Music Director Radhan : టాలీవుడ్ ఇండస్ట్రీలో సెన్సేషనల్ క్రియేట్ చేసిన సినిమా అంటే టక్కున అందరికీ గుర్తొచ్చేది అర్జున్ రెడ్డి. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ స్టార్ హీరో అయ్యాడు. స్టోరీ మాత్రమే కాదు ఈ సినిమాలోని ప్రతిపాట ఒక అద్భుతం అని చెప్పాలి. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ రధన్ మంచి సంగీతాన్ని అందించారు. ఒకప్పుడు వరుస సినిమాలకు మ్యూజిక్ ని కంపోస్ట్ చేసిన ఈ డైరెక్టర్ ఈ మధ్య సినిమాల్లో కనిపించలేదు. మళ్లీ ఇన్నాళ్లకు తాజాగా ప్రదీప్ మాచిరాజు నటించిన ఇక్కడ అమ్మాయి అక్కడ అబ్బాయి సినిమాతో మరోసారి టాలీవుడ్ ఇండస్ట్రీలో తన సత్తాను చాటేందుకు రెడీ అవుతున్నాడు. తాజాగా ఈ సినిమా ఈవెంట్ ను నిర్వహించగా ఇందులో ఆయన మాట్లాడుతూ గతంలో జరిగిన వివాదాలకు వివరణ ఇచ్చారు. ఆయన మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ రధన్ఏం చెప్పారు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
సందీప్ రెడ్డి వంగా కామెంట్స్..
అర్జున్ రెడ్డి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు ప్రముఖ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించారు. సంగీత దర్శకుడు రధన్ ఇచ్చిన పాటలు ఎంత గొప్పగా వర్కౌటయ్యాయో అభిమానులకు గుర్తే. అయితే ఇతనితో పని చేయించుకోవడం సందీప్ రెడ్డి వంగా గతంలో తీవ్ర విమర్శలు చేయడం వైరలయ్యింది. రధన్ చాలా ఇబ్బంది పెట్టాడని, బ్రతిమాలి పాటలు రాబట్టుకున్నాననే తరహాలో చెప్పడం ఇండస్ట్రీలోనూ చర్చగా మారింది.. ఇదిలా కొనసాగుతుండగానే మరో డైరెక్టర్ ఆయన పై విమర్శలు చేశారు. వీటివల్ల రధన్ సినిమాలకు మ్యూజిక్ చేసినట్లు కనిపించలేదు. అయితే ఈ వివాదాలు నిజంగానే జరిగాయా లేదా అన్నదానిపై ఇన్నాళ్ళ తర్వాత క్లారిటీ ఇచ్చారు.
Also Read : ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. ఆ సినిమాలను మిస్ చెయ్యకండి..
వివాదాలకు చెక్ పెట్టిన రధన్..
మ్యూజిక్ డైరెక్టర్ రధన్ ప్రస్తుతం ప్రదీప్ మాచిరాజు నటిస్తున్న ఇక్కడ అమ్మాయి అక్కడ అబ్బాయి సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరించారు. ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్లో మ్యూజిక్ డైరెక్టర్ మాట్లాడారు. ఇండస్ట్రీలో తనపై వస్తున్న వదంతులకు క్లారిటీ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ సందీప్ రెడ్డి వంగ నాకు తండ్రితో సమానం. ఆయన అవకాశం ఇవ్వడం వల్లే అంత మంచి ఆల్బమ్ వచ్చిందని, మాట కొంచెం కఠినంగా ఉన్నా అందరితోనూ అలాగే ఉండే శైలిని అర్థం చేసుకున్నానని వివరించాడు. పాట నచ్చలేదు అన్నప్పుడు అప్పుడే చెప్తే బాగుండేది కానీ సినిమా అయిపోయి హిట్ అయిన తర్వాత నా గురించి ఇలా మాట్లాడటం నాకు చాలా బాధగా అనిపించిందని ఆయన అన్నారు. నా తప్పేమీ లేకపోయినా నా మీద ఇలాంటి విమర్శలు రావడంతో చాలామంది నా మీద కోపంగా ఉన్నారు. నేను ఎప్పుడు ఎప్పుడు దొరుకుతానా అని వెయిట్ చేస్తున్నారు అంటూ రధన్ చెప్పారు.. సందీప్ వంగాని ఏకంగా తండ్రితో పోల్చి మరీ గౌరవం ఇచ్చిన రధన్ చివరికి కాంట్రావర్సికి చెక్ పెట్టినట్టే అనుకోవాలి. ఈ సినిమా గనక హిట్ అయితే మళ్లీ తెలుగులో రధన్ ఫామ్ లోకి వస్తాడని తెలుస్తుంది.. మరి ఈ సినిమా ఎలాంటి టాక్ని అందుకుంటుందో చూడాలి..