BigTV English

Pindam Review: ఎమోషనల్ హారర్ క్రైమ్ థ్రిల్లర్..పిండం ఎలా ఉందంటే..

Pindam Review: ఎమోషనల్ హారర్ క్రైమ్ థ్రిల్లర్..పిండం ఎలా ఉందంటే..

Pindam Review: ఓ పక్క థియేటర్లలో పెద్ద సినిమాలు సందడి చేస్తుంటే.. మరోపక్క ధైర్యంగా ఈరోజు చిన్న సినిమాలు థియేటర్లలోకి వచ్చేసాయి. అలా ఈరోజు విడుదలైన ఓ ఎమోషనల్ హారర్ క్రైమ్ థ్రిల్లర్ పిండం. వెరైటీ టైటిలే కాదండోయ్ స్టోరీ కూడా చాలా వెరైటీగా ఉంది. మరి ఈ మూవీ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో తెలుసుకుందాం పదండి..


స్టోరీ:

క్రైస్తవ మతస్తుడైన ఆంథోని (శ్రీరామ్) ఒక రైస్ మిల్ లో అకౌంటెంట్ గా పనిచేస్తుంటాడు. అతను భార్య ,ఇద్దరు పిల్లలు ,తల్లి సూరమ్మతో కలిసి ఓ ఊరిలో అతి పురాతనమైన ఒక ఇంటిని కొనుగోలు చేస్తాడు. కుటుంబంతో కలిసి అతను అక్కడే ఉంటాడు. అయితే ఇంట్లో చేరినప్పటి నుంచి కొన్ని ఊహించని సంఘటనలు చోటు చేసుకోవడం మొదలుపెడతాయి. ఇంట్లో ఉన్న క్షుద్ర శక్తులను అడ్డుకోవడానికి ఆంథోనీకి అన్నమ్మ (ఈశ్వరీరావు),ఆమె శిష్యుడు (అవసరాల శ్రీనివాస్) సహాయం చేస్తారు.


ఈ క్రమంలో గర్భిణిగా ఉన్న అతని భార్య ఒకసారి హాస్పిటల్ లో కూడా అడ్మిట్ అవుతుంది. మరో పక్క తల్లి ఊహించని ప్రమాదానికి గురి అవుతుంది. ఆ తర్వాత ఎవరూ ఊహించని షాకింగ్ సన్నివేశాలు జరుగుతాయి. అసలు ఆ ఇంటిని ఆంథోనీ ఎందుకు కొన్నాడు? ఆ ఇంట్లో ఏముంది? అక్కడ జరుగుతున్నది అరికట్టడానికి అన్నమ్మ.. ఏం చేసింది? చివరికి ఏం జరిగింది? తెలుసుకోవాలంటే పూర్తి సినిమా తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ:

ఫస్ట్ హాఫ్ ఎంతో అద్భుతంగా చాలా పకడ్బందీగా.. మంచి ట్విస్టులతో బాగా ప్లాన్ చేశారు. సెకండ్ హాఫ్ కూడా అదే స్థాయిలో నడిపించారు. కాకపోతే ప్రీ క్లైమాక్స్ నుంచి స్టోరీ కొద్దిగా రొటీన్ గా అనిపిస్తుంది. ఫ్లాష్ బ్యాక్ అయితే మరీ ఎమోషనల్ గా గుండెను పిండే విధంగా ఉంది. స్టోరీ చెప్పిన విధానం.. ప్రతిపాత్రను జాగ్రత్తగా క్యారీ చేసిన పద్ధతి అద్భుతంగా ఉన్నాయి. ఫస్ట్ టైం డైరెక్ట్ చేసిన సాయికిరణ్ ఈ మూవీని.. ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ లాగా తెరకెక్కించాడు.

పర్ఫామెన్స్ పరంగా నటీనటులు.. పాత్రకు తమ వంతు న్యాయం చేశారు. ఇప్పటివరకు గ్లామర్ ,యాక్షన్ పాత్రలో నటించిన శ్రీరామ్.. మొదటిసారి చాలా డిఫరెంట్ లుక్ తో కనిపించాడు. భావోద్వేగమైన సన్నివేశాలలో అతని నటన అద్భుతంగా ఉంది. ఆంథోనీ భార్యగా ఖుషి రవి తన పాత్ర కు బాగా సెట్ అయింది. ఈ మూవీలో చిన్న పిల్లల నటన అందరిని కదిలించే విధంగా ఉంది. ఈ మూవీలో ఈశ్వరి రావు కూడా చాలా డిగ్నిఫైడ్ క్యారెక్టర్ లో స్టోరీని తన భుజాల మీద వేసుకొని మరీ ముందుకు నడిపించింది. అవసరాల శ్రీనివాస్ పాత్ర పరిధి తక్కువే అయినా అద్భుతంగా నటించాడు.ఇది ఒక మంచి హారర్ థ్రిల్లర్ మూవీ.. ఫ్యామిలీ ఎమోషన్స్ ని హారర్ కాన్సెప్ట్ కి అటాచ్ చేసి మంచి థ్రిల్లింగ్ సన్నివేశాలతో.. అద్భుతమైన సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ పిండం చిత్రాన్ని తెరకెక్కించారు.

ఫ్యామిలీ ఎమోషన్స్, హారర్ ఎలిమెంట్స్, సస్పెన్స్ అంశాలతో రూపొందించిన చిత్రం పిండం. భావోద్వేగానికి గురిచేసే ఓ పాయింట్‌ చుట్టు అల్లుకొన్న థ్రిల్లర్ ప్రేక్షకుడిని ఉద్వేగానికి గురి చేస్తుంది. చైల్డ్ సెంటిమెంట్ అంశాలు కనెక్ట్ అయ్యేలా చేస్తాయి. హారర్‌తో కూడిన సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలను ఆదరించే వారికి ఈ సినిమా నచ్చుతుంది. కథలో కొత్తదనం లేకపోయినా.. కథనం, ఎమోషనల్ సీన్లు, స్క్రీన్ ప్లేతో దర్శకుడు సాయికిరణ్ కట్టిపడేశాడనే చెప్పాలి. పక్కాగా ఇది థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ మూవీ. థియేటర్‌లో చూస్తే మంచి అనుభూతి కలుగుతుంది.

చివరిగా.. పిండం.. ఒక హారర్ థ్రిల్లింగ్ అనుభూతినిస్తుంది.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×