Mahesh Babu Hit Movie : ‘ప్రిన్స్’ మహేష్ బాబు హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘పోకిరి’ అనే సినిమా వచ్చింది. 2006 లో ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అప్పటివరకు తెలుగు సినిమా రేంజ్ రూ.30 కోట్లు లోపే ఉండేది. కానీ ‘పోకిరి’ సినిమాతో రూ.40 మార్క్ టచ్ అయినట్టు అయ్యింది. ఒక్క టాలీవుడ్లోనే కాదు సౌత్లోనే ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ‘పోకిరి’ చిత్రం. అందుకే మహేష్ బాబు పేరు సౌత్ మొత్తం మార్మోగింది.
ఒక రకంగా మహేష్ బాబు కెరీర్ గురించి చెప్పాలంటే ‘పోకిరి’ కి ముందు.. ‘పోకిరి’ తర్వాత అనే చెప్పాలి. అప్పటివరకు మహేష్ బాబు మార్కెట్ అంతంత మాత్రమే.’పోకిరి’ కి ముందు మహేష్ కెరీర్లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమా అంటే ‘ఒక్కడు’. కానీ ‘పోకిరి’ దానికి రెండింతలు కలెక్ట్ చేసింది.అతని మార్కెట్ ను పెంచింది. అంతేకాదు సూపర్ స్టార్ ట్యాగ్ ను కూడా కట్టబెట్టింది.
‘పోకిరి’ తర్వాతే మహేష్ సినిమాలకి భారీ ఓపెనింగ్స్ రావడం మొదలయ్యాయి. దర్శకుడు పూరీ జగన్నాథ్ టేకింగ్ కి.. మహేష్ బాబు డైనమిక్ పెర్ఫార్మన్స్ వావ్ ఫాక్టర్ అయ్యింది. అప్పటివరకు మహేష్ ను అంత రఫ్ గా చూసింది లేదు. లుక్స్ పరంగా కూడా చాలా వేరియేషన్ కనిపిస్తుంది. ఇవన్నీ ‘పోకిరి’ ఘనవిజయం సాధించడంలో ముఖ్య పాత్ర పోషించాయి అని చెప్పొచ్చు.
ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. ‘పోకిరి’ సినిమాకి కో రైటర్ గా ఓ దర్శకుడు పనిచేశాడు. చాలా మందికి ఈ విషయం తెలీదు. ఆ కో రైటర్ గా చేసిన దర్శకుడెవరో కూడా తెలీదు. అతను మరెవరో కాదు మెహర్ రమేష్. నమ్మడానికి కష్టంగా అనిపించినా ఇది నిజం. ‘పోకిరి’ కి మెహర్ రమేష్ అసిస్టెంట్ డైరెక్టర్ గా, కో రైటర్ గా పనిచేశాడు.
అంతేకాదు ఇంట్రో ఫైట్ ను డైరెక్ట్ చేసింది అతనే. అంతేకాదు ఈ సినిమాలో చాలా యాక్షన్ బ్లాక్స్ అతను డైరెక్ట్ చేశాడు. ‘ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగాడు’ అనే డైలాగ్ ను రాసింది కూడా మెహర్ రమేష్ అనే సంగతి చాలా మందికి తెలీదు. ‘పోకిరి’ వంటి ఇండస్ట్రీ హిట్ సినిమాలో మెహర్ పాత్ర ఉంది.
కేవలం ‘పోకిరి’ అనే కాదు.. పూరీ డైరెక్ట్ చేసిన ‘దేశముదురు’ ‘చిరుత’ సినిమాలకి కూడా మెహర్ రమేష్ పనిచేశాడు. ‘చిరుత’ సినిమాలో జైలు ఫైట్ ను డిజైన్ చేసింది మెహర్. దానికి దగ్గరుండి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను మణిశర్మతో కంపోజ్ చేయించాడు మెహర్. ఇంకా చాలా హిట్ సినిమాల్లో మెహర్ పాత్ర ఉంది. కానీ దర్శకుడిగా మాత్రం తనదైన ముద్ర వేసుకోవడంతో ఇతను విఫలమయ్యాడు. ‘బిల్లా’ మినహా మెహర్ రమేష్ డైరెక్ట్ చేసిన ఏ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సరైన విజయం అందుకోకపోవడం దురదృష్టకరం.