Indian Railways: భారతీయ రైల్వే అద్భుతాలు సృష్టిస్తోంది. గత దశాబ్దకాలంగా రైల్వే ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని అద్భుతమైన రైల్వే లైన్లను పూర్తి చేస్తోంది. జమ్మూకాశ్మీర్ లో చీనాబ్ రైల్వే వంతెన, అంజిఖాడ్ రైల్వే బ్రిజ్జితో పాటు అద్భుతమైన పంబన్ వర్టికల్ రైల్వే బ్రిడ్జిని నిర్మించింది. తాజాగా ఉత్తరాఖండ్ లో రిషికేష్, కర్ణప్రయాగ్ నడుమ 125 కిలో మీటర్ల పొడవైన రైల్వే మార్గాన్ని శరవేగంగా పూర్తి చేస్తోంది. అందులో భాగంగానే దేశంలోనే అత్యంత పొడవైన రైల్వే టన్నెల్ పనులను అత్యంతం వేగంగా పూర్తయ్యాయి. సుమారు 14 కిలో మీటర్ల పొడవైన ఈ సొరంగ మార్గాన్ని రెండు వైపులా తవ్వుతూ పూర్తి చేశారు. ఈ టన్నెల్ పనులను తాజాగా కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కన్ సింగ్ ధామితో కలిసి సందర్శించారు. సుమారు 3.5 కిలో మీటర్ల మేర ఇద్దరూ కలిసి ప్రయాణించారు.
14.57 కి.మీ పొడవు సొరంగమార్గం
రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (RVNL) ఆధ్వర్యంలో దేవ్ ప్రయాగ్ సౌద్ నుంచి జనసు వరకు 14.57 కి.మీ సొరంగ మార్గాన్నినిర్మించారు. ఇందుకోసం శక్తి అనే అత్యాధునిక టన్నెల్ బోరింగ్ మెషిన్లను (TBM) ఉపయోగించి బోరింగ్ చేశారు. దేశంలోని పర్వత ప్రాంతాలలో రైలు సొరంగ మార్గం కోసం TBM సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ఇదే మొదటిసారి. 9.11 మీటర్ల వ్యాసంతో ఈ టన్నెల్ ను నిర్మించారు. జర్మనీ నుంచి తెప్పించిన ప్రత్యేక BTM 10.47 కిలో మీటర్లు బోరింగ్ చేయగా, మిగతాది సాధారణ, డ్రిల్, బ్లాస్ట్ విధానంలో పూర్తి చేశారు. షికేశ్- కర్ణప్రయాగ్ ప్రాజెక్ట్ ఐదు హిమాలయ జిల్లాలు అయిన దేవ్ ప్రయాగ్, శ్రీనగర్, రుద్రప్రయాగ్, గౌచర్, కర్ణప్రయాగ్ ను కనెక్ట్ చేయనుంది. ఈ ప్రాజెక్టు ప్రాంతీయ కనెక్టివిటీకి ఎంతగానో ఉపయోగపడనుంది. 125 కిలోమీటర్ల అలైన్ మెంట్‌లో 83% కంటే ఎక్కువ సొరంగాల ద్వారా కొనసాగుతుంది. జూలై 2025 నాటికి ఈ రైల్వే లైన్ పనులు పూర్తవుతాయని RVNL అధికారులు తెలిపారు.
7 గంటల ప్రయాణం కేవలం రెండు గంటల్లో..
ఈ సొరంగం పూర్తి కావడం పట్ల రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. “ఈ రైల్వే లైన్ ఉత్తరాఖండ్ అభివృద్ధిలో కీలక ముందడుగు కాబోతోంది. ఈ ప్రాజెక్ట్ రాష్ట్రంలోని పర్వత ప్రాంతాలను రైల్వే నెట్ వర్క్ తో అనుసంధానించడంలో ఒక కీలక మైలు రాయిగా నిలిచింది. 14.57 కి.మీ పొడవైన ఈ రైల్వే సొరంగం, ఉత్తరాఖండ్ లోనే కాదు, మొత్తం భారతదేశంలోనే అతి పొడవైన సొరంగం. ఈ ప్రాజెక్టుతో, రిషికేశ్ నుంచి కర్ణప్రయాగ్ వరకు ప్రయాణం ఏడు గంటల నుండి కేవలం రెండు గంటలకు తగ్గుతుంది” అని అశ్విని వైష్ణవ్ తెలిపారు.
A major breakthrough achieved today.
The tunnel boring machine has made it through the longest transportation tunnel (T-8) in India which is 14.58 km long.
Rishikesh-Karnaprayag new line project.
📍Uttarakhand pic.twitter.com/4GA9Mw1D9G— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) April 16, 2025
Read Also: ఇండియాకు జపాన్ అదిరిపోయే గిఫ్ట్, రెండు బుల్లెట్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!
సంతోషం వ్యక్తం చేసిన ఉత్తరాఖండ్ సీఎం
ఉత్తరాఖండ్ అభివృద్ధికి ఈ సొరంగం ఒక చారిత్రాత్మక మలుపు కాబోతుందని ముఖ్యమంత్రి ధామి అన్నారు.”ఈ రైల్వూ లైన్ స్థానిక ప్రజలకు రవాణాను సులభతరం చేయడమే కాకుండా, ఈ ప్రాంతంలో పర్యాటకం, వాణిజ్యం, ఆర్థిక కార్యకలాపాలకు కొత్త ఊపునిస్తుంది. ప్రధాని మోడీ సాకారంతో రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి శరవేగంగా కొనసాగుతోంది” అని వివరించారు.
यह परियोजना आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी के ‘नए व सशक्त भारत’ के विजन और उत्तराखण्ड को विकास की मुख्यधारा से जोड़ने के संकल्प को साकार करती है। निश्चित तौर पर ऋषिकेश-कर्णप्रयाग रेल परियोजना राज्य की कनेक्टिविटी, पर्यटन, आर्थिकी और रोजगार के लिए नई संभावनाएं खोलेगी। pic.twitter.com/vwmVw5kMCf
— Pushkar Singh Dhami (@pushkardhami) April 16, 2025
Read Also: విశాఖ ప్రయాణీకులకు అలర్ట్, సమత ఎక్స్ ప్రెస్ రద్దు, ఎన్ని రోజులంటే?