Director Geetha Krishna:డైరెక్టర్ గీతాకృష్ణ (Director Geetha Krishna).. ఈయన గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. యూట్యూబ్ ఓపెన్ చేసి ఈయన పేరు అలా సర్చ్ చేసామో లేదో వందల కొద్ది ఆయన ఇంటర్వ్యూలు మనకు కనిపిస్తాయి.ఆ వీడియోలకు పెట్టే థంబ్ నెయిల్స్ దగ్గర నుంచి ఆయన మాట్లాడే సబ్జెక్టు అంశాలు అన్ని షాకింగ్ గా అనిపిస్తాయి. ముఖ్యంగా సినిమా హీరోయిన్ల మీద ఆయన తరచూ చేసే కామెంట్లు సంచలనంగా మారడంతో పాటు పెద్ద ఎత్తున వైరల్ కూడా అవుతుంటాయి. ముఖ్యంగా హీరోయిన్ల గురించి, వారి వస్త్రధారణ గురించి, వారి వ్యక్తిత్వం గురించి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడే ఈయనపై తాజాగా ఫిర్యాదు నమోదయింది. ముఖ్యంగా యూట్యూబ్ తో పాటు సోషల్ మీడియాలో కూడా దారుణంగా పోస్ట్లు పెట్టే ఈయనపై చర్యలు తీసుకోవాలి అంటూ విశాఖపట్నం ఆమెన్ అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు విశాఖ పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చీకి కంప్లైంట్ ఇచ్చారు.
గీతాకృష్ణపై కేసు ఫైల్..
దర్శకుడు గీతాకృష్ణ అక్కయ్యపాలెంలో గీతాకృష్ణ ఫిలిం స్కూల్, హైదరాబాదులోని మాదాపూర్ లో మరో ఫిలిం ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్నారని, ఇటీవల పలు యూట్యూబ్ ఛానల్ లలో ఆయన ఇస్తున్న ఇంటర్వ్యూలు, సోషల్ మీడియాలో పెడుతున్న పోస్ట్లు గురించి, ఆయన చేస్తున్న విమర్శలు, ఆరోపణలు వెంటనే ఆపాలి. వీటిపై తగిన విచారణ చేపట్టి ఆయనపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. మొత్తానికి అయితే ఇన్ని రోజులు తనకు ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాను విచక్షణ రహితంగా వాడుతూ సినీ సెలబ్రిటీలపై ఈయన చేస్తున్న కామెంట్లకు ఎప్పుడు చెక్ పడుతుందో అని ఎంతోమంది ఎదురు చూశారు అని, ఎట్టకేలకు ఇప్పుడు ఈయనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం మంచిదే అంటూ ఒక వర్గం నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.ఏది ఏమైనా హీరోయిన్ల గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడే గీతాకృష్ణపై ఇప్పుడు కేసు ఫైల్ అయినట్లు తెలుస్తోంది.
గీతాకృష్ణ కెరియర్..
దిగ్గజ దర్శకుడు గీతా కృష్ణ విషయానికి వస్తే, తెలుగు, తమిళ చిత్రాలను రూపొందిస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. 1987లో నాగార్జున (Nagarjuna) నటించిన ‘సంకీర్తన’ అనే సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన, మొదటి సినిమాతోనే ఉత్తమ నూతన దర్శకుడిగా నంది అవార్డు కూడా అందుకున్నారు.. సంగీత ప్రేమ కథగా వచ్చిన ఈ సినిమా కమర్షియల్ గా భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత ఈయన దర్శకత్వం వహించిన ‘కోకిల’ చిత్రం కంటి మార్పిడి ఆధారంగా క్రైమ్ మిస్టరీగా రూపొందించి. మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇక తర్వాత ‘కీచురాళ్ళు, ‘ప్రియతమా’ వంటి రెండు ప్రయోగాత్మక చిత్రాలతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక తర్వాత కొన్నాళ్లు ఇండస్ట్రీకి దూరమైన ఈయన, మళ్లీ 1996లో ‘సర్వర్ సుందరమ్మ గారి అబ్బాయి’ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఇక ఈ చిత్రానికి దర్శకత్వం మాత్రమే కాదు సంగీతాన్ని కూడా సమకూర్చారు.ఇక చివరిగా తెలుగులో ‘కాఫీ బార్'(2011), తమిళంలో ‘నిమిడంగల్'(2013) అనే సినిమాలు చేసి ప్రస్తుతం ఇంటర్వ్యూలు ఇస్తూ కాంట్రవర్సీలకు చోటు ఇస్తున్నారు.