Allu Arjun: అల్లు అర్జున్ కేసులో కొద్దీకొద్దిగా మార్పు కనిపిస్తుంది. ఇప్పటికే రెండోసారి బన్నీకి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కండిషన్స్ పెట్టినా కూడా కొంతవరకు అతనికి ఊరట లభించిందనే చెప్పాలి. ఎప్పుడు విచారణకు రమ్మన్నా రావాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. అన్నింటికీ బన్నీ ఓకే చెప్పాడు. ఇక ఇప్పుడు బన్నీకి పోలీసులు మరో సహాయం చేశారు. శ్రీతేజ్ ను కలవడానికి పర్మిషన్ ఇస్తూ బన్నీకి నోటీసులు పంపారు.
ఎప్పటి నుంచో బన్నీ.. రేవతి కుమారుడు శ్రీతేజ్ ను కలవాలని ప్రయత్నిస్తున్న విషయం తెల్సిందే. అయితే కొన్ని లీగల్ కారణాల వలన అల్లు అర్జున్, శ్రీతేజ్ ను కలువలేకపోయాడు. మొన్నటికి మొన్న ప్రెస్ మీట్ లో కూడా బన్నీ ఇదే విషయాన్నీ చెప్పాడు. శ్రీతేజ్ ను కలవాలని తనకు ఉందని, కానీ, తన లీగల్ టీమ్ ఇప్పుడు కలవకూడదు అని చెప్పడం వలన వెళ్లలేకపోతున్నట్లు తెలిపాడు. ఇక విచారణ అనంతరం కోర్టు కూడా సాక్షులను ప్రభావితం చేయవద్దని, కేసును ప్రభావితం చేసే విధంగా బహిరంగంగా మాట్లాడవద్దని చెప్పుకొచ్చింది.
Pawan Kalyan: ఇద్దరు యువకుల మృతి.. అదే రోడ్డుపై ప్రయాణిస్తానని శపథం చేసిన పవన్
తాజాగా శ్రీతేజ్ ను కలవడానికి పోలీసులు అనుమతినిచ్చారు. కిమ్స్ ఆస్పత్రిలో శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు అల్లు అర్జున్‌కి షరతులతో అనుమతి ఇస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ కండిషన్స్ ఏంటంటే.. అల్లు అర్జున్ వచ్చే విషయం కూడా రహస్యంగా ఉండాలి. అతను ఎప్పుడు శ్రీతేజ్ ను పరామర్శించడానికి వెళ్తున్నాడో ముందే పోలీసులకు తెలపాలి. అలా చెప్తేనే బందోబస్త్ చేయగలం. సమాచారం ఇవ్వకుండా వస్తే పూర్తి బాధ్యత మీదే.కిమ్స్ ఆస్పత్రికి ఎప్పుడు రావాలనుకున్నా సమాచారం ఇవ్వాలి అని నోటీసుల్లో తెలిపారు. ఈ కండిషన్స్ ను కాదంటే మాత్రం బన్నీ ఇంకా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పుకొచ్చారు.
పుష్ప 2 బెన్ ఫిట్ షో లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ కు తీవ్రగాయాలు అయ్యాయి. గత కొన్నిరోజులుగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న శ్రీతేజ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఇక ఇప్పటికే శ్రీతేజ్ హాస్పిటల్ ఖర్చులు అన్ని బన్నీనే చూసుకుంటున్నాడని శ్రీతేజ్ తండ్రి చెప్పుకొచ్చాడు. మరి బాలుడిని పరామర్శించడానికి బన్నీ ఎప్పుడు వెళ్తాడో చూడాలి.