BigTV English

Pooja Hegde : గుంటూరు కారం నుంచి పూజా తప్పుకోవడం వెనక కారణం అదేనా….

Pooja Hegde : గుంటూరు కారం నుంచి పూజా తప్పుకోవడం వెనక కారణం అదేనా….


Pooja Hegde : మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ముచ్చటగా వస్తున్న మూడవ చిత్రం గుంటూరు కారం. ఈ చిత్రం అనుకున్నప్పటి నుంచి ప్రతి ఒక్క విషయంలో ఏదో ఒక రకంగా వార్తల్లో ఉంటుంది. మూవీ షూటింగ్ లేట్ అవ్వడం దగ్గర నుంచి హీరోయిన్ మార్పు వరకు ప్రతి ఒక్కటి హాట్ డిస్కషన్ కి దారితీసింది. ఇంతకుముందు త్రివిక్రమ్, మహేష్ కాంబినేషన్ లో అతడు ఖలేజా లాంటి సినిమాలు వచ్చాయి. అతడు సినిమా సూపర్ డూపర్ హిట్ కాగా, ఖలేజా యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది.

కానీ రెండు సినిమాలు ఆక్టర్ గా మహేష్ బాబు కెరియర్లో మైలురాయిలుగా మిగిలాయి. అతడు సినిమాలో మహేష్ బాబు యాక్షన్ అద్భుతంగా ఉంటే…ఖలేజా లో మహేష్ టైం టు టైం కామెడీ ఎక్స్ట్రార్డినరీగా ఉంటుంది. అందుకే వీరిద్దరి క్రేజీ కాంబినేషన్లో రాబోయే మూడవ చిత్రంపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. దానికి తోడు మూవీ నుంచి వచ్చిన టీజర్ లో మిర్చి మార్కెట్లో కర్ర పట్టుకొని.. మహేష్ వస్తుంటే…అభిమానులు సూపర్ ట్రీట్ గా ఫీల్ అయ్యారు. ఇప్పటివరకు ఎన్నో క్లాస్ క్యారెక్టర్స్ చేసిన మహేష్ అప్పుడప్పుడు తనలోని మాస్ యాంగిల్ ని చూపించాడు. కానీ ఈ మూవీలో మహేష్ మాస్ డోస్ పెంచాడు అనిపిస్తుంది.


ఇక ఈ చిత్రానికి సంబంధించిన వివాదాల విషయానికి వస్తే…ఫస్ట్ ఈ మూవీకి హీరోయిన్ గా పూజ హెగ్డే ను ప్రకటించడం జరిగింది. అయితే ఆ తర్వాత పూజ మూవీ నుంచి తప్పుకున్నట్టు.. దీనికి కారణం కేవలం శ్రీ లీల అని ఒక పుకారు స్టార్ట్ అయింది. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న గుంటూరు కారం నిర్మాత సూర్యదేవర నాగావంసి ఈ విషయంపై మొదటిసారిగా స్పందించడమే కాకుండా స్పష్టత కూడా ఇచ్చారు. నిజానికి ప్రస్తుతం పూజ కెరీర్ పరంగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటుంది. కమ్ బ్యాక్ కి ఛాన్సెస్ తక్కువ అవుతాయి కాబట్టి ఏవో చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా ప్రాజెక్ట్ ని కంటిన్యూ చేయడానికి ఇటువంటి పరిస్థితుల్లో హీరోయిన్లు ప్రయత్నిస్తారు.

కానీ గుంటూరు కారం మూవీకి ఫస్ట్ తనని ప్రధాన హీరోయిన్ గా తీసుకున్నప్పటికీ…సెకండ్ హీరోయిన్ అయిన శ్రీ లీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో పూజ మూవీ నుంచి తప్పుకుంది అనేది ఇండస్ట్రీ టాక్. అయితే నిర్మాత సూర్యదేవర నాగవంశీ తో జరిగిన ఇంటర్వ్యూలో కేవలం పూజ ఫ్లాప్స్ కారణంగానే ఆమెను తీసేసారా అని అడగడం జరిగింది. దీనికి స్పందించిన నాగ వంశీ…. అసలు పూజ జయాపజయాలతో సంబంధం లేకుండానే తను ఆఫర్ ఇవ్వడం జరిగింది అని స్పష్టం చేశారు. ఇంతకుముందు వచ్చిన అరవింద సమేత వీర రాఘవ చిత్రానికి ముందు పూజా మొహంజొదారో లాంటి చిత్రాల్లో చేసింది కదా అని ఎదురు ప్రశ్న వేశారు.

ఈ నేపథ్యంలో అసలు పూజా మూవీ నుంచి ఎందుకు తప్పుకోవలసి వచ్చిందో కూడా వివరించి చెప్పారు. నిజానికి జనవరిలో గుంటూరు కారం షూటింగ్ స్టార్ట్ చేయడం జరిగింది.. కానీ కొన్ని కారణాలవల్ల నాలుగు నెలల పాటు బ్రేక్ పడింది. దీంతో అప్పటికే పూజా ఆల్రెడీ కమిట్ అయిన చిత్రాలకు డేట్స్ ఇష్యూ వచ్చింది. అందుకే ఆమె చేస్తున్న మూవీస్ డిస్టర్బ్ కాకూడదు అనే ఉద్దేశంతో నేను తొలగించడం జరిగింది. అంతేకానీ ఆమెను గుంటూరు కారం నుంచి తీసేసారు కాబట్టి మిగిలిన సినిమాల్లో కూడా ఛాన్స్ పోయింది అనడంలో ఎటువంటి నిజం లేదు అని నాగ వంశీ పేర్కొన్నాడు. పూజా కెరీర్ ను నిలబెట్టిన అరవింద సమేత వీర రాఘవ , అలవైకుంఠపురం…. ఈ రెండు చిత్రాలు నాగ వంశీ నిర్మాణంలోనే జరిగాయి. 

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×