BigTV English

Ayalaan Movie Teaser : హాలీవుడ్ రేంజ్ లో ఉన్న శివ కార్తికేయ అయాలన్ టీజర్…

Ayalaan Movie Teaser : హాలీవుడ్ రేంజ్ లో ఉన్న శివ కార్తికేయ అయాలన్ టీజర్…

Ayalaan Movie Teaser : కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ రీసెంట్ గా మహావీరుడు మంచి సక్సెస్ అందుకున్నాడు. వైవిధ్యమైన కథలను ఎంచుకోవడంలో ఎప్పుడు ముందుండే శివ కార్తికేయన్ ‘అయలాన్‌’ అనే కొత్త మూవీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు.‘అయలాన్‌’ అంటే తమిళ్ లో ‘ఏలియన్‌’ అని అర్థం…టైటిల్ విన్నవారికి ఎవరికైనా మూవీ దేని గురించో సులభంగా అర్థమవుతుంది.


ఏలియన్‌ బ్యాక్ డ్రాప్ తో ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి.. కానీ శివ కార్తికేయన్ ‘అయలాన్‌’ ట్రైలర్ చూసిన వారికి ఎవరికైనా ఇది మిగతా వాటికంటే కాస్త వెరైటీగా ఉంది అనిపించక మానదు. ఈ మూవీలో శివ కార్తికేయన్ సరసన హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. ఇప్పటికే మూవీ నుంచి మేకర్స్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది.

అక్టోబర్ 6న విడుదలైన అయలాన్‌ తెలుగు టీజర్‌ కు మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి సందడి చేయడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటివరకు ఈ సినిమాపై కోలీవుడ్ లో మాత్రమే అంచనాలు భారీగా ఉండేది కానీ ఇప్పుడు ఇది టాలీవుడ్ కి కూడా గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తుంది. ఇప్పటివరకు ఇండియన్ సినిమా హిస్టరీ లోనే ఉపయోగించినటువంటి అత్యధిక సంఖ్యలో 


సీజీ షాట్స్ ‘అయలాన్’ కోసం ఉపయోగించినట్లు టాక్.

టీజర్ చూసిన ఎవరికైనా ఈ మూవీ టోటల్ హాలీవుడ్ రేంజ్ లో ఉంటుంది అని అర్థమవుతుంది. అప్పట్లో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటించిన కోయి మిల్ గయా మూవీ తరహాలో ఈ చిత్రం ఉండబోతోంది. అదేనండి తన గ్రహం నుంచి తప్పిపోయి భూమ్మీదకి వచ్చిన ఒక ఏలియన్ ఎలాగో హీరో దగ్గరకు చేరుతుంది. దానికోసం విలన్స్ వెతుకుతుంటారు…. అమాయకుడైన హీరోకి ఏలియన్ కారణంగా కొన్ని అద్భుతమైన శక్తులు వస్తాయి. అతను విలన్స్ నుంచి దాన్ని కాపాడి దాని గ్రహానికి పంపడంలో సహాయం చేస్తాడు. చూడబోతే స్టోరీ అటు ఇటుగా ఇలాగే ఉంటుంది అనిపిస్తుంది.

సైన్స్ ఫిక్షన్ జోనర్ లో ఎన్నో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో నిండిన ‘అయలాన్’ ట్రైలర్ లో శివ కార్తికేయన్ చాలా డిఫరెంట్ గా ఉన్నాడు.శరద్ ఖేల్కర్, ఇషా కొప్పికర్, భానుప్రియ, యోగి బాబు, కరుణాకరన్, బాల శరవణన్ ఈ మూవీ లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఒక్క ట్రైలర్ లోనే ఈ చిత్రం యాక్షన్, కామెడీ ,సెంటిమెంట్ సమ్మేళనం అన్న విషయాన్ని డైరెక్టర్ ఎంతో బాగా చూపించారు. మరీ ముఖ్యంగా ఇందులో గ్రీన్ కలర్ ఏలియన్ ఓ రెడ్ బనియన్, షాట్ వేసుకొని డాన్స్ వేసే సీన్ చాలా వెరైటీగా ఉంది.

ట్రైలర్ స్టార్టింగ్ లో.. ఒక్కొక్క పీరియడ్ లో ఒక్కొక్క ఎనర్జీ ఈ వరల్డ్ ను డామినేట్ చేస్తుంది…అంటూ మొదలుపెట్టి…వాతావరణం లో ఏర్పడిన ఈ ప్రమాదకరమైన మార్పులు భూమిని అంతం చేస్తాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు…అంటూ సాగుతుంది. ట్రైలర్ లో ఎప్పుడో అంతరించిపోయిన డ్రాగన్ ఎగ్స్ దగ్గర నుంచి హాలీవుడ్ ఐరన్ మాన్ సూట్ ను పోలిన ఒక రోబో వరకు చూపించడం జరిగింది. ఇక ఇందులో మంచి యాక్షన్స్ సన్నివేశాలు ఉంటాయి అనేది కూడా ట్రైలర్ లో హైలెట్ చేశారు. మొత్తానికి ఓ మంచి హాలీవుడ్ మూవీ అనుభూతిని ఈ చిత్రం అందిస్తుంది అని అందరూ ఆశిస్తున్నారు.

Tags

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×