BigTV English

Gold Card : గోల్డ్ కార్డ్‌తో అమెరికా తలరాత మారుతుందా?.. కంప్లీట్ డీటైల్స్

Gold Card : గోల్డ్ కార్డ్‌తో అమెరికా తలరాత మారుతుందా?.. కంప్లీట్ డీటైల్స్

Gold Card : గోల్డ్ కార్డ్. అమెరికాలో సెటిల్ అయ్యేందుకు గేట్ పాస్. ధర కేవలం రూ.43 కోట్లు. రండి బాబూ రండి.. అంటూ అధ్యక్షుడు ట్రంప్ సంపన్నులకు వెల్‌కమ్ చెబుతున్నారు. ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో ట్రంప్ ఈ గోల్డ్ కార్డ్‌ వీసాను ఆవిష్కరించినప్పటి నుంచీ యావత్ ప్రపంచం ఈ గోల్డెన్ ఆఫర్ గురించే చర్చించుకుంటోంది.


గోల్డ్ కార్డ్‌తో గోల్డెన్ ఆఫర్

EB-5 ఇన్వెస్టరఱ్ వీసాను రద్దు చేసి సరికొత్త గోల్డ్ కార్డు వీసాను తీసుకొస్తున్నారు అధ్యక్షుడు ట్రంప్. ఆయన ఫోటో, సంతకంతో గోల్డ్ కార్డ్ మెరిసిపోతోంది. మరో 2 వారాల్లో అందుబాటులోకి రాబోతోంది. దీని ఖరీదు అక్షరాలా 5 మిలియన్ డాలర్లు. ఫస్ట్ కార్డును ట్రంపే కొనబోతున్నారు. ఈ కార్డును కొని.. ఆ దేశంలో రూ.43 కోట్లు ఇన్వెస్ట్ చేసే వారెవరైనా ఇక పర్మినెంట్‌గా అమెరికాలో ఉండొచ్చు. అమెరికన్ సిటిజెన్‌షిప్ కూడా ఈజీగా పొందొచ్చు. గోల్డ్ కార్డుల అమ్మకంతో ఆమెరికాకు భారీ ఆదాయం వస్తుందని.. పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయని.. ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతుందని.. డొనాల్డ్ ట్రంప్ చెబుతున్నారు.


గోల్డ్ కార్డు సరే.. సుంకాల సంగతేంటి?

5 మిలియన్ డాలర్ల ఖరీదైన గోల్డ్ కార్డ్ వీసా సంగతి ఎలా ఉన్నా.. లేటెస్ట్‌గా ట్రంప్ విధించిన ప్రతీకార టారిఫ్‌లనే చర్చ, రచ్చ నడుస్తోంది. ఇండియాపై 26శాతం సుంకాలు పెంచేశారు. చైనాపై 36శాతం వరకు వాయించారు. దెబ్బకు అమెరికన్ మార్కెట్లు కుప్పకూలిపోయాయి. ఆ ఎఫెక్ట్ ప్రపంచ స్టాక్ మార్కెట్ల మీదా పడింది. ప్రతీకార సుంకాలతో అమెరికాలో రెసిషన్ వస్తుందని కూడా అంచనా వేస్తున్నారు. గడిచిన 2 రోజుల్లో యూఎస్ మార్కెట్ల విలువ ఏకంగా 5 ట్రిలియన్ డాలర్ల మేర నష్టపోయింది. ఇంతలా మార్కెట్లు పడినా.. నో ప్రాబ్లమ్ అంటున్నారు ట్రంప్. అమెరికా సంపన్న దేశం కాబోతోందంటూ ఎప్పటిలానే తనదైన స్టైల్‌లో ధీమాగా చెబుతున్నారు. ట్రంప్‌ చర్యలతో అమెరికా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని చెబుతున్నారు. జీడీపీ 0.3 శాతం తగ్గే అవకాశముందని, నిరుద్యోగ రేటు 5.3 శాతానికి పెరిగే ప్రమాదం ఉందని JP మోర్గాన్ అంచనా వేసింది.

స్టోర్లకు పరిగెడుతున్న అమెరికన్లు

ట్రంప్ టారిఫ్‌లపై చైనా సైతం ఇప్పటికే రివేంజ్ ట్యాక్సెస్ పెంచేసింది. ఆ దెబ్బకు ఐఫోన్ రేట్లు పెరుగుతాయని అంటున్నారు. అనేక దేశాలు తాము కూడా సుంకాలు పెంచేందుకు రెడీ అవుతున్నాయి. దీంతో యూఎస్‌లో అనేక వస్తువుల ధరలు పెరగడం ఖాయం. అందుకే, ముందుచూపుతో అమెరికన్లు డిపార్ట్‌మెంటల్ స్టోర్స్‌కు క్యూ కడుతున్నారు. రేట్లు పెరగక ముందే కావాల్సిన సామాగ్రి కొనేస్తు్న్నారు. ఎలక్ట్రానిక్ వస్తువులకు గిరాకీ భారీగా పెరిగింది.

Also Read : మగజాతి రక్షణ కోసం ఉద్యమం.. హీ టీమ్స్ కావాలి!

అమెరికాకు తైవాన్ దెబ్బ

తైవాన్‌పై 32 శాతం సుంకాలు పెంచింది అమెరికా. అది అగ్రరాజ్యానికే ఎదురుదెబ్బగా మారనుంది. ఎలక్ట్రానిక్ చిప్స్ తయారీకి తైవాన్ హెడ్‌క్వార్టర్. ట్రంప్ ఎఫెక్ట్‌తో ఇకపై ల్యాప్‌టాప్స్, కంప్యూటర్స్, సెన్సార్‌తో పని చేసే సామాగ్రి, వాషింగ్ మెషిన్స్ లాంటి హోమ్ నీడ్స్ వస్తువుల ధరలు పైపైకి పాకుతాయి. అందుకే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కొనడానికి అమెరికన్లు ఎగబడుతున్నారు.

Related News

Nuclear Threat: ఇండియాను అణుబాంబులతో లేపేస్తాం.. అమెరికాలో పాక్ సైన్యాధిపతి చెత్త వాగుడు

Donald Trump: ట్రంప్ మామకు దిమ్మతిరిగే న్యూస్.. బాయ్‌కట్ అమెరికా ప్రొడెక్ట్స్ ట్రెండింగ్

Turkey Earthquake: టర్కీని కుదిపేసిన భూకంపం.. ఎటు చూసినా శిథిలాల దిబ్బలు

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Big Stories

×