Pooja Hegde: ప్రముఖ సీనియర్ స్టార్ హీరోయిన గా పేరు సొంతం చేసుకున్న పూజా హెగ్డే (Pooja Hegde) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ‘ఒక లైలా కోసం’ అనే సినిమా ద్వారా నాగచైతన్య(Naga Chaitanya) సరసన నటించి, తెలుగు తెరకు పరిచయమయ్యింది. మొదటి సినిమాతోనే యూత్లో క్రష్ గా మారిపోయిన ఈమెకు ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాలలో వరుసగా అవకాశాలు తలుపు తట్టాయి. అలా అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా నటించిన ‘అల వైకుంఠపురంలో’ సినిమాలో నటించిన ఈమె.. ఇందులో ‘బుట్ట బొమ్మ’ పాటతో మరింత ఫేమస్ సొంతం చేసుకుంది.
ఐరన్ లెగ్ అనిపించుకున్న పూజా హెగ్డే..
ఇక రామ్ చరణ్ (Ram Charan), మహేష్ బాబు (Maheshbabu)వంటి స్టార్ హీరోలతో నటించిన ఈమెకు సడన్గా వరుస ఫ్లాప్స్ తలుపు తట్టాయి. దీంతో ఐరన్ లెగ్ అనే బిరుదు తో పాటు అవకాశాలు కూడా తగ్గిపోయాయి. ఫలితంగా కొన్ని నెలల పాటు సినిమా ఇండస్ట్రీకి దూరమైన పూజా హెగ్డే.. మళ్లీ ఇప్పుడు కోలీవుడ్ లో రీ ఎంట్రీ ఇచ్చింది. అందులో భాగంగానే సూర్య (Suriya)హీరోగా నటించిన ‘రెట్రో ‘మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె, ఈ సినిమాతో పర్వాలేదు అనిపించుకుంది.
విజయ్ మూవీ తోనైనా సక్సెస్ అవుతుందా?
ఇక ఇప్పుడు విజయ్ దళపతి (Vijay Thalapathi)చివరి సినిమాగా వస్తున్న ‘ జననాయగన్ ‘ సినిమాలో హీరోయిన్ గా అవకాశాన్ని అందుకుంది పూజా హెగ్డే. పొలిటికల్ థ్రిల్లర్గా తెరకెక్కబోతున్న ఈ సినిమాపై అభిమానులలో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.దీనికి తోడు విజయ్ చివరి సినిమా కావడంతో అందరూ ఈ సినిమా పైనే ఎక్కువ అంచనాలు పెట్టుకున్నారు. పైగా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు సమాచారం.
ఈ సమయం నాకు అత్యంత కీలకం – పూజా హెగ్డే
ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజా హెగ్డే పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది. పూజా హెగ్డే మాట్లాడుతూ..” ఈమధ్య కాలంలో నేను నటించిన సినిమాలు అన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరుస్తున్నాయి. నా లైఫ్ లో గత కొంతకాలంగా విజయం అనే పదానికి అర్థమే లేకుండా పోయింది. ప్రస్తుతం ఈ సమయం నాకు చాలా ముఖ్యమైనది. భవిష్యత్తులో నేను చేసే సినిమాలు నేను ఎలాంటి నటిని అనేదే ప్రేక్షకులకు చూపిస్తాయని అనుకుంటున్నాను. ఇకపోతే సిని బ్యాక్ గ్రౌండ్ ఉండి ఇండస్ట్రీలోకి వచ్చిన నాలాంటి వాళ్ళు ఇండస్ట్రీలో కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు నేను ఈ స్థాయిలో ఉన్నా కానీ నేను సాధించాల్సింది ఎంతో ఉంది. అందరి జీవితంలో హెచ్చుతగ్గులు అనేవి కచ్చితంగా ఉంటాయి. ఇక మేము నటులము కాబట్టి విజయంతో పాటు ఓటమిని కూడా చవిచూడాల్సి ఉంటుంది.
also read: Akhanda 2 Teaser Update: అఖండ 2 నుండి బిగ్ అప్డేట్.. టీజర్ డేట్ లాక్
ఇదొక చేదు వార్త..
ఇకపోతే విజయ్ తో ‘బీస్ట్’ సినిమా తర్వాత ఇప్పుడు ‘జననాయగన్’ సినిమా చేయడం ఆనందంగా ఉంది. కానీ ఇది విజయ్ చివరి చిత్రం అని తెలిసి చాలా బాధగా ఉంది. నా దృష్టిలో ఇదొక హృదయ విషాదకర వార్త. ఎందుకంటే నాతోపాటు విజయ్ సినిమాలు ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక ఆయన సినిమా చేయరని తెలిసి మరింత బాధగా ఉంది. అయినా సరే అన్నింటిని యాక్సెప్ట్ చేయాలి.. అప్పుడే జీవితంలో ముందుకు వెళ్తాం ” అంటూ పూజా హెగ్డే చెప్పుకొచ్చింది.