inter students: ఏపీలో గురువారం నుంచి పాఠశాలలు, కాలేజీలు మొదలు కానున్నాయి. కేవలం నాలుగు రోజులు మాత్రమే ఉంది. కొత్త విద్యాసంవత్సరం మొదలుకానుండడంతో విద్యా కిట్ పంపణీ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది ఇంటర్ స్టూడెంట్స్ విద్యా మిత్ర కిట్ ఇవ్వాలని నిర్ణయించింది. దీంత విద్యార్థులు ఫుల్‌ఖుషీ.
విద్యారంగంలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది చంద్రబాబు ప్రభుత్వం. ఈ విషయంలో ఎవరు ఏమనుకున్నా అస్సలు పటించు కోలేదు. దిగువ స్థాయి నుంచి కాలేజీ స్థాయి వరకు విద్యార్థులు ఏ దశలో ఇబ్బందులు పడకుండా నిర్ణయాలు తీసుకుంటోంది. మరో నాలుగు రోజుల్లో అంటే జూన్ 12న నుంచి ఏపీలో పాఠశాలలు, కాలేజీలు ఓపెన్ కానున్నాయి.
విద్యార్థులకు బ్యాగు,యూనిఫామ్, పుస్తకాలు, షూస్, డిక్షనరీ వాటిని ఉచితంగా ఇవ్వనుంది. గత ప్రభుత్వంలో అమలులో ఉన్నా స్కూళ్లు తెరిచిన తర్వాత ధీమాగా పంపిణీ చేసేవారు. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం రూటు మార్చింది. పాఠశాలలు ఓపెన్ అయిన తొలిరోజే విద్యార్థులకు ఆయా కిట్లు ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. ఆ దిశగా చర్యలు ప్రారంభించింది.
జూన్ ఆరున ప్రభుత్వ పాఠశాలలకు అందించే వివిధ రకాల కిట్లను మంత్రి నారా లోకేష్ ఉండవల్లి నివాసంలో పరిశీలించారు. ఆయా కిట్లకు సంబంధించిన వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అలాగే 222 పీఎం పాఠశాలలకు స్టెమ్ ల్యాబ్ కిట్లను అందించనున్నారు.
ALSO READ: దేశంలో ఏఐ యూనివర్సిటీ అమరావతిలో
దీనికితోడు ఇంటర్ విద్యార్థులకు శుభవార్త చెప్పింది. ఫస్టయిర్ విద్యార్థులకు విద్యామిత్ర కిట్లు ఇవ్వాలని నిర్ణయించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో కేవలం స్కూల్ విద్యార్థులకు మాత్రమే ఇచ్చేవారు. ఇంటర్ విద్యార్థులకు ఇవ్వలేదు.
కూటమి ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు ఆ కిట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు వాటిని అందించనుంది. కాలేజీ బ్యాగ్, బుక్స్, యూనిఫామ్ అందనుంది. వాటిపై ప్రత్యేక గుర్తింపు నంబర్ ఉండటంతో వస్తువుల నాణ్యతను విద్యార్థులు తెలుసుకోవచ్చు.
వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలకు అందించే వివిధ రకాల కిట్లను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఉండవల్లి నివాసంలో పరిశీలించారు. ఆయా కిట్లను పరిశీలించిన మంత్రి లోకేష్ సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలోని 222 పీఎమ్ శ్రీ పాఠశాలలకు స్టెమ్ ల్యాబ్ కిట్లను… pic.twitter.com/XcPJ2GRMJB
— Telugu Desam Party (@JaiTDP) June 6, 2025