Cancer Survivior Win Lotteries| దేవుడు కరుణిస్తే.. ఎంత పెద్ద సమస్యకైనా పరిష్కారం అవుతుంది. అదృష్ట దేవత వరిస్తుంది. జీవితంలో ఎన్నో కష్టాలు పడి చావు అంచుల దాక వెళ్లిన ఒక వ్యక్తి తిరిగి ఆరోగ్య వంతుడయ్యాడు. అంతే కాకుండా వరుసగా నాలుగు లాటరీలు గెలుచుకుని కోట్లు సంపాదించాడు. గెలిచిన ఆ నాలుగు లాటరీలలో మూడు లాటరీలు ఒకే సంవత్సరంలో గెలుచుకోవడం మరీ ఆశ్చర్యం.
కెనడాకు చెందిన ఒక వ్యక్తి, క్యాన్సర్‌తో పోరాడి గెలిచాడు. అందరూ చనిపోతాడనుకుంటే.. మనోధైర్యంతో చికిత్స చేయించుకొని ఆరోగ్యవంతుడయ్యాడు. తర్వాత, కేవలం తొమ్మిది నెలల్లో మూడు లాటరీలు గెలిచి రూ.15.6 కోట్లు ($2.5 మిలియన్) సంపాదించాడు. కెనడాలోని ఆల్బెర్టాలోని లెథ్‌బ్రిడ్జ్‌కు చెందిన డేవిడ్ సెర్కిన్.. వెస్టర్న్ కెనడా లాటరీ కార్పొరేషన్ (WCLC) ప్రకారం.. మే 3 నాటి LOTTO 6/49 క్లాసిక్ డ్రాలో $1 మిలియన్ గెలుచుకున్నాడు.
అమెరికా మీడియా కథనం ప్రకారం.. ఈ వ్యక్తి ఆగస్టు 20 నాటి LOTTO MAX (లొట్టో మ్యాక్స్) డ్రాలో $500,000, నవంబర్ 16 నాటి LOTTO 6/49 డ్రాలో $1 మిలియన్ గెలిచాడు. ఇప్పుడు, మే 3 నాటి మరో LOTTO 6/49 క్లాసిక్ డ్రాలో మళ్లీ $1 మిలియన్ గెలిచాడు. జాక్‌పాట్ గెలిచే అవకాశం 33,294,800లో ఒకటి అని WCLC తెలిపింది. కానీ సెర్కిన్ ఈ అసాధ్యమైన అవకాశాన్ని జయించాడు. 1982లో LOTTO 6/49 ప్రారంభమైనప్పటి నుండి అతను టికెట్లు కొనడం, వాటిని తనిఖీ చేయడం ఒక రొటీన్‌గా చేస్తూ వచ్చాడు. తాజాగా గెలుచుకున్న టికెట్‌ను అతను లెథ్‌బ్రిడ్జ్‌లోని షెల్ లెథ్‌బ్రిడ్జ్, 2440 ఫెయిర్‌వే ప్లాజా రోడ్ వద్ద కొనుగోలు చేశాడు.
“టికెట్ నెంబర్లు చూశాక.. గెలిస్తే సంతోషం. గెలవకపోతే, మళ్లీ ప్రయత్నించవచ్చు,” అని సెర్కిన్ మీడియాతో చెప్పాడు. “ఈ టికెట్‌ను నేను గ్యాస్ (పెట్రోల్) కొనేటప్పుడు తీసుకున్నాను. గోల్డ్ బాల్ డ్రా దగ్గరకు వస్తోందని చూసి, కొనాలనుకున్నాను. నన్ను నా మిత్రులు తప్పు చేస్తున్నావు అని హెచ్చరించారు. అయినా నేను నమ్మకంతో కొనుగోలు చేశాను.” అని అతను తెలిపాడు.
తన భారీ విజయాల గురించి అడిగినప్పుడు, సాదాసీదాగా జీవనం గడిపే సెర్కిన్ ఇలా అన్నాడు. “లాటరీ అవకాశాలు చాలా కష్టమని నాకు తెలుసు. ఇక మళ్లీ ఇలా జరుగుతుందని అనుకోను, కానీ నేను ఇప్పటికీ టికెట్లు కొనడానికే ఇష్టపడతాను.నేను క్యాన్సర్‌ను జయించాను, రిటైర్ అయ్యాను, కాబట్టి ఈ అనుభవాలకు నేను కృతజ్ఞుడిని,” అని చెప్పాడు.
సెర్కిన్ అదృష్టం గత దశాబ్దంలో కూడా కనిపించింది. ఇటీవలి గెలిచిన మూడు లాటరీలకు తోడు.. 10 సంవత్సరాల క్రితం మరో డ్రాలో $250,000 గెలిచాడు.
Also Read: సోషల్ మీడియాలో డస్టింగ్ ఛాలెంజ్.. ఇన్‌ఫ్లుయెన్సర్ మృతి.. ఎలా జరిగిందంటే?
డిన్నర్‌కు వెళ్తూ లాటరీ గెలిచిన జంట..
ఈ నెల ప్రారంభంలోనే అమెరికాలోని న్యూజెర్సీలో ఒక జంట, డిన్నర్‌కు వెళ్లే మార్గంలో రూ.257 స్క్రాచ్-ఆఫ్ టికెట్ కొని రూ.12.86 కోట్లు గెలిచారు. వీరిద్దరిలో ఒకరు.. వేరే ఊరిలో టికెట్ కొనాలనుకున్నప్పటికీ, మరొకరు సాధారణంగా వెళ్లే దుకాణంలోనే కొనాలని పట్టుబట్టారు.ఆర్థిక కష్టాలు ఎప్పుడూ ఎదుర్కొనే ఈ జంట ఒత్తిడిలో ఉండేది. అయితే అనూహ్యంగా వీరి జీవితం ఇప్పుడు చాలా సులభమైంది.” అని విజేత చెప్పాడు.