BigTV English

OTT Movie : సీను సీనుకో ట్విస్ట్ … సైలెన్స్ తో వైలెన్స్ పెంచే మూవీ… ఈ థ్రిల్లర్ని ఊపిరి బిగబట్టి చూడాల్సిందే

OTT Movie : సీను సీనుకో ట్విస్ట్ … సైలెన్స్ తో వైలెన్స్ పెంచే మూవీ… ఈ థ్రిల్లర్ని ఊపిరి బిగబట్టి చూడాల్సిందే

OTT Movie : ఈ సైకో సినిమాలకంటే, దెయ్యాల సినిమాలే నయం అనిపిస్తుంది ఒక్కోసారి. ఎందుకంటే వీళ్ళు చేసే హింస, దెయ్యాలు కూడా చెయ్యవు. అంతలా మనుషుల్ని టార్చర్ చేస్తుంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో, ముగ్గురు సైకోలు ఒక జంటని టార్గెట్ చేస్తారు. ఆతరువాత ఈ సినిమాలో ప్రతీ సీన్ ఉత్కంఠం రేపుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


స్టోరీలోకి వెళితే

మాయా, ర్యాన్ అనే జంట మ్యారేజ్ డే ని సెలెబ్రేట్ చేసుకోవడానికి, మాయా జాబ్ ఇంటర్వ్యూ కోసం, ఒక పోర్ట్‌ ల్యాండ్‌కి రోడ్ ట్రిప్‌లో వెళ్తుంటారు. ఒరెగాన్‌లోని వీనస్ అనే చిన్న పట్టణంలో, వాళ్ళ కారు బ్రేక్‌డౌన్ అవుతుంది. స్థానిక మెకానిక్ ఆ కారును మరుసటి రోజు వరకు రిపేర్ చేయలేమని చెప్పడంతో, వాళ్ళు ఆప్రాంతంలో ఉండే, ఒక క్యాబిన్‌ ని అద్దెకు తీసుకుంటారు. అందులో ఒక రాత్రి గడపాలని నిర్ణయించుకుంటారు.ఆ క్యాబిన్‌లోకి వెళ్ళిన తర్వాత, వారికి వింత అనుభవాలు ఎదురవుతాయి. ర్యాన్ తన ఇన్‌హేలర్‌ను కారులో మరచిపోయినట్లు గుర్తించి, దానిని తీసుకోవడానికి బయటికి వెళ్తాడు. ఈ సమయంలో మాయా ఒంటరిగా క్యాబిన్‌ లో ఉంటుంది. ఆమెను ముగ్గురు ముసుగు ధరించిన అపరిచితులు గమనిస్తూ లోపలికి వెళతారు. మాయా షవర్‌లో ఉన్నప్పుడు ఆమెను ఒక వ్యక్తి రహస్యంగా చూస్తుంటాడు.


మాయాకి ఇంట్లో ఇంకెవరో ఉన్నారని అనుమానం వస్తుంది. ర్యాన్ తిరిగి వచ్చినప్పుడు, ఈ విషయం చెప్తుంది. అతను ఆమె మాటను తేలిగ్గా తీసుకుంటాడు. అయితే వాళ్ళు భోజనం చేస్తున్నప్పుడు, ఒక కోడిని గొంతు కోసి రక్తం కారుతూ ఉండగా, సీలింగ్ కి వేలాడదీసి ఉంటారు ఆ సైకోలు. ఒక్క సారిగా షాక్ అయిన ఈ జంట, తమను తాము రక్షించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ ముగ్గురు సైకోలు ఆ ఇంట్లోనే మకాం వేస్తారు. ఈ జంట వాళ్ళకు కనిపించకుండా దాక్కోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఎంత ప్రయత్నించినా ఆ సైకోల చేతికి దొరికిపోతారు.  చివరికి ఆ సైకోల చేతిలో ఈ జంట ఏమౌతుంది ? వీళ్ళు ప్రాణాలతో బయట పడతారా ? ఎవరైనా సాయం చేస్తారా ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ సినిమాని మిస్ కాకుండా చూడండి.

Read Also : ఆ అడవిలో కాలు పెడితే తిరిగిరారు… బెస్ట్ అడ్వెంచర్ థ్రిల్లర్

 

అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ది స్ట్రేంజర్స్: చాప్టర్ 1’ (The Strangers: Chapter 1). అనేది 2024లో విడుదలైన ఈ మూవీకి రెన్నీ హార్లిన్ దర్శకత్వం వహించారు. ఇందులో మాడెలైన్ పెట్ష్, ఫ్రాయ్ గుటిరెజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది ‘ది స్ట్రేంజర్స్’ ఫిల్మ్ సిరీస్‌లో మూడవ పార్ట్ గా తెరకెక్కింది. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

OTT Movie : షార్ట్ ఫిలిం పేరుతో బీచ్ కి తీసుకెళ్లి… టీనేజ్ అమ్మాయితో ఆ పని… మస్ట్ వాచ్ మలయాళ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie :సిటీ జనాల్ని చితగ్గొట్టే డిమాన్స్… సూపర్ హీరోలనూ వదలకుండా దబిడి దిబిడే

OTT Movie : ఈ వారం ఓటీటీలోకి అడుగు పెట్టిన సిరీస్ లు… ఒక్కోటి ఒక్కో జానర్ లో

OTT Movie : తలపై రెడ్ లైన్స్… తలరాత కాదు ఎఫైర్స్ కౌంట్… ఇండియాలో వైరల్ కొరియన్ సిరీస్ స్ట్రీమింగ్ షురూ

OTT Movie : పిల్లోడిని చంపి సూట్ కేసులో… మైండ్ బెండయ్యే కొరియన్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్

OTT Movie : రెంటుకొచ్చి పక్కింటి అమ్మాయితో… కారు పెట్టిన కార్చిచ్చు… దిమాక్ కరాబ్ ట్విస్టులు సామీ

OTT Movie : అమ్మాయి ఫోన్ కి ఆ పాడు వీడియోలు… ఆ సౌండ్ వింటేనే డాక్టర్ కి దడదడ… మస్ట్ వాచ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : పిల్లల ముందే తల్లిపై అఘాయిత్యం… సైతాన్ లా మారే కిరాతక పోలీస్… క్లైమాక్స్ లో ఊచకోతే

Big Stories

×