BigTV English

Pooja Hegde:- డేటింగ్ వార్తలపై పూజా హెగ్డే క్లారిటీ

Pooja Hegde:- డేటింగ్ వార్తలపై పూజా హెగ్డే క్లారిటీ

Pooja Hegde:- ల‌క్కీ హీరోయిన్‌గా క్రేజ్ తెచ్చుకున్న మ‌న బుట్ట‌బొమ్మ పూజా హెగ్డేకి గ‌త ఏడాది పెద్ద‌గా క‌లిసి రాలేదు. ఆమె చేసిన బ‌డా చిత్రాల‌న్నీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ప‌రాజ‌యం పాల‌వ‌టంతో ఇప్పుడు పెద్ద‌గా అవ‌కాశాలు లేవ‌నే చెప్పాలి. ముఖ్యంగా ఆమె బాలీవుడ్‌పై చాలా ఆశ‌ల‌నే పెట్టుకుంది. లాస్ట్ ఇయ‌ర్ పూజా హెగ్డే న‌టించి హౌస్‌ఫుల్ 4, స‌ర్క‌స్ చిత్రాలు డిజాస్ట‌ర్ అయ్యాయి. దీంతో అమ్మ‌డు త‌న బాలీవుడ్ ఆశ‌ల‌న్నింటినీ ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ సినిమాపైనే పెట్టుకుంది. కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ న‌టిస్తోన్న ఈ చిత్రంలో పూజా హీరోయిన్. కాగా.. టాలీవుడ్ స్టార్ వెంక‌టేష్ ద‌గ్గుబాటి కీల‌క పాత్ర‌లో న‌టించారు.


ఈద్ సంద‌ర్భంగా ఈ మూవీ ఏప్రిల్ 21న రిలీజ్ అవుతుంది.పూజా హెగ్డే ఈ సినిమా ప్ర‌మోష‌నల్ యాక్టివిటీస్‌తో బిజీ బిజీగా ఉంది. ఈ నేప‌థ్యంలో సొగ‌స‌రికి ఓ ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌శ్న ఎదురైంది. బాలీవుడ్ హీరో స‌ల్మాన్ ఖాన్‌తో మీరు డేటింగ్ ఉన్నార‌ట‌గా అని.. దానికి పూజా హెగ్డే స్పందిస్తూ.. ‘‘ప్రస్తుతానికి నేను సింగిల్‌నే. ఇలా ఉండ‌టానికే ఇష్ట‌ప‌డ‌తాను. కెరీర్‌లో ఇంకా ఎద‌గాల‌ని అనుకుంటున్నాను. ఇంకా ఎన్నో భాష‌ల్లో వైవిధ్య‌మైన సినిమాలు చేయాల‌నేది నా కోరిక‌. నా పై ఎన్నో వార్త‌లు వ‌స్తుంటాయి. వాటిని నేను కూడా చూస్తుంటాను. కానీ పెద్ద‌గా ప‌ట్టించుకోను. ఆ అవ‌స‌రం లేద‌నేది నా అభిప్రాయం’’ అంటూ పూజా హెగ్డే క్లారిటీ ఇచ్చేసింది.

కిసీ కా భాయ్ కిసీ కా జాన్ సినిమా తర్వాత నెక్ట్స్ కూడా స‌ల్మాన్ ఖాన్ చేయ‌బోయే సినిమాలోనూ పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించ‌నుంద‌నే టాక్ బ‌లంగా వినిపిస్తోంది మ‌రి. ఇది కాకుండా టాలీవుడ్‌ సూప‌ర్ స్టార్‌ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తోన్న సినిమాాలోనూ పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా కూడా సెట్స్‌పై ఉంది. ఈ సినిమా వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 13న రిలీజ్ కానుంది.


Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×