BigTV English

Ice Cream: నకిలీ ఐస్‌క్రీమ్ దందా.. కొనేముందు జర జాగ్రత్త..

Ice Cream: నకిలీ ఐస్‌క్రీమ్ దందా.. కొనేముందు జర జాగ్రత్త..
ICE CREAM

Ice Cream: నడినెత్తిమీద సూరీడు నాట్యం చేస్తుంటే.. నోట్లో ఏదైనా చల్లగా వేసుకుంటే ఎంత హాయిగా ఉంటుందో కదా. ఆ సమయంలో చల్లని ఓ ఐస్ క్రీమ్ తీసుకుంటే ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేం. ఎండాకాలంలో ఐస్‌క్రీమ్ ఇచ్చే ఎంజాయ్‌మెంట్ మరేదీ ఇవ్వదు. అలా అనుకుని.. ఎక్కడ పడితే అక్కడ ఐస్ క్రీమ్ కొన్నారో.. ఇక ఆస్పత్రి అడ్రస్ వెతుక్కోవాల్సిందే. సమ్మర్ డిమాండ్ ను క్యాష్ చేసుకునేందుకు కొందరు దుండగులు.. కస్టమర్ల ఆరోగ్యంతో ఆటలాడుకుంటన్నారు. హైదరాబాద్ లో పెద్ద ఎత్తున జరుగుతున్న నకిలీ ఐస్ క్రీమ్ తయారీ గుట్టు రట్టైంది.


కెమికల్స్, కలుషితమైన నీటి నుంచి చల్లటి ఐస్ క్రీమ్స్ తయారుచేస్తున్నారు కేటుగాళ్లు. చందానగర్ లో నకిలీ ఐస్ క్రీమ్స్ తయారు చేస్తున్న గోదామ్ లో పోలీసులు దాడి చేశారు. గోదాంలో నిల్వ ఉన్న 10 లక్షలకు పైగా విలువైన ఐస్ క్రీమ్ ముడిపదార్థాలు, ఫ్లేవర్స్, బ్రాండెడ్ స్టిక్కర్లను స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకుడు శ్రీనివాస్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఐదేళ్లుగా శ్రీనివాస్ రెడ్డి.. ఈ నకిలీ దందా చేస్తున్నట్టు గుర్తించారు. బెస్ట్ ఐస్ క్రీమ్ అనే రిజిస్టర్డ్ టైటిల్ తో ఐస్ క్రీమ్ స్టోర్ ను నడుపుతున్నా.. అక్కడ అన్ని కంపెనీల లేబుల్స్ వాడేస్తున్నారు.

సమ్మర్ లో ఐస్ క్రీమ్స్ కు డిమాండ్ బాగా ఉంటుంది. దీన్ని క్యాష్ చేసుకునేందుకు.. ఈ సీజన్ లో ఇలాంటి కల్తీ ఖార్ఖానాలు హైదరాబాద్ లో చాలావరకు నడుపుతున్నారు. కల్తీ ఐస్ క్రీమ్ అని ఎవరూ గుర్తించడానికి వీల్లేకుండా.. పైన కవర్ తో పాటు.. లోపల టేస్ట్ కూడా మార్చేస్తున్నారు. ఐస్ క్రీమ్స్ టేస్ట్ పెంచేందుకు.. ప్రమాదకరమైన రసాయనాలు, పౌడర్లు ఉపయోగిస్తున్నారు. కొనేవి ఒరిజినలా? నకిలీవా? అనేది తెలియకుండానే జనం కొనేస్తున్నారు.. తినేస్తున్నారు.. అనారోగ్యం పాలవుతున్నారు.


ఇలాంటి నకిలీ ఐస్ క్రీమ్స్ చాలావరకు రోడ్ సైడ్ బండి పెట్టుకుని అమ్మేవాళ్ల దగ్గరకే వెళ్తాయని చెబుతున్నారు. అందుకే ఈసారి ఐస్ క్రీమ్ కొనేటప్పుడు జర జాగ్రత్త.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×