BigTV English

Pooja Hegde: ‘కూలీ’లో పూజా హెగ్డే ఐటెం సాంగ్.. ఏకంగా అంత రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందా.?

Pooja Hegde: ‘కూలీ’లో పూజా హెగ్డే ఐటెం సాంగ్.. ఏకంగా అంత రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందా.?

Pooja Hegde: ఒకప్పుడు ఐటెమ్ సాంగ్స్ కోసం నార్త్ నుండి హీరోయిన్స్‌ను రంగంలోకి దించేవారు మేకర్స్. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఐటెమ్ సాంగ్స్‌లో హీరోతో కలిసి స్టెప్పులేయడం కోసం స్టార్ హీరోయిన్స్‌ను ఎంపిక చేసుకుంటున్నారు దర్శక నిర్మాతలు. కాసేపు పాటలో కనిపించడం కోసం హీరోయిన్స్ ఎంత డిమాండ్ చేసినా కాదనకుండా ఓకే చెప్పేస్తున్నారు. తాజాగా పూజా హెగ్డే విషయంలో కూడా అదే జరిగిందని ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. వరుసగా హీరోయిన్‌గా అవకాశాలతో దూసుకుపోతున్న సమయంలోనే ఐటెమ్ గర్ల్‌గా మారింది పూజా హెగ్డే. త్వరలోనే రజినీకాంత్ హీరోగా నటిస్తున్న ‘కూలీ’లో కూడా స్పెషల్ సాంగ్‌లో కనిపించడానికి సిద్ధమయ్యింది.


ఇప్పటికే రెండు పాటల్లో

తెలుగు, తమిళంలో ఎంతోమంది స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది పూజా హెగ్డే. తన కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలోనే ముందుగా సుకుమార్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘రంగస్థలం’లో ఐటెమ్ సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందులో జిగేల్ రాణిగా అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత ఐటెమ్ సాంగ్స్‌కు కొన్నాళ్లు బ్రేక్ ఇచ్చి సినిమాలపై ఫోకస్ పెట్టింది. మళ్లీ చాలాకాలం తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎఫ్ 3’లో స్పెషల్ సాంగ్‌లో మెరిసింది. అలా ఒకవైపు హీరోయిన్‌గా సినిమాలు చేస్తూనే స్పెషల్ సాంగ్స్ చేయడానికి కూడా నో ప్రాబ్లమ్ అనేస్తుంది పూజా హెగ్డే. అందులో భాగంగానే ‘కూలీ’లో కూడా స్పెషల్ సాంగ్ చేయడానికి వెనకాడలేదు.


స్పెషల్ సాంగ్

లోకేశ్ కనకరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో రజినీకాంత్ (Rajinikanth) హీరోగా నటిస్తున్న చిత్రమే ‘కూలీ’. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక మూవీ షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది. ఫైనల్‌గా ఇందులో ఒక స్పెషల్ సాంగ్ ఉందని, అందులో పూజా హెగ్డే ఆడిపాడనుందని మేకర్స్ తాజాగా రివీల్ చేశారు. ఇక ఈ సాంగ్‌లో కాసేపు కనిపించడం కోసం పూజా హెగ్డే తీసుకున్న రెమ్యునరేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ‘కూలీ’లో స్పెషల్ సాంగ్‌లో కనిపించడం కోసం పూజా రూ.2 కోట్లు పారితోషికం తీసుకుందని కోలీవుడ్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో పూజా డిమాండ్ చూసి ప్రేక్షకులు షాకవుతున్నారు.

Also Read: అడుక్కుంటున్నా పట్టించుకోవడం లేదు.. యంగ్ బ్యూటీపై డైరెక్టర్ ఆరోపణలు

ఆఫర్లు తగ్గాయి

ఒకప్పుడు పూజా హెగ్డే (Pooja Hegde) చేతిలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఉండేవి. కానీ ఈరోజుల్లో కొత్త హీరోయిన్ల తాకిడి ఎక్కువయ్యింది. అందుకే పూజాకు కూడా ఆఫర్లు తగ్గిపోతూ వస్తున్నాయి. ముఖ్యంగా తెలుగులో అయితే తనను పట్టించుకోవడమే మానేశారు. ప్రస్తుతం తన చేతిలో రెండు భారీ బడ్జెట్ ప్రాజెక్ట్స్ ఉన్నా అవి రెండు తమిళంలోనే ఉన్నాయి. ఇక అందులోకి ‘కూలీ’ (Coolie) కూడా యాడ్ అయ్యింది. ఆఫర్లు తగ్గిపోవడంతో తన రెమ్యునరేషన్‌ను చాలావరకు తగ్గించేసిందట పూజా హెగ్డే. ఇక ప్రస్తుతం ఒక సినిమాకు తను రూ.2 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటుందని, అందుకే ‘కూలీ’లో స్పెషల్ సాంగ్ చేయడానికి కూడా అంతే డిమాండ్ చేయగా మేకర్స్ ఓకే చెప్పారని తెలుస్తోంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×