Homemade Conditioner: జుట్టు సిల్కీగా, మెరిసేలా ఉండాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఇందుకోసం కొంత మంది రకరకాల షాంపూలు, హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ వాడుతున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం హెయిర్ కండిషనర్ వాడే వారి సంఖ్య కూడా చాలా వరకు పెరిగింది.
హెయిర్ కండిషనర్ జుట్టుకు తగిన పోషణను అందిస్తుంది. అంతే కాకుండా జుట్టును సిల్కీగా కూడా మారుస్తుంది. మరి బయట మార్కెట్‌లో దొరికే కండిషనర్‌లను కాకుండా ఇంట్లోనే తయారు చేసిన కండిషనర్ వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అంతే కాకుండా డబ్బు కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న హోం మేడ్ హెయిర్ కండిషనర్ ఎలా తయారు చేసి వాడాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పెరుగు, తేనెతో కండిషనర్ :
కండిషనర్ తయారు చేయడానికి మీకు సగం కప్పు పెరుగు, 1 టేబుల్ స్పూన్ తేనె, 1 టేబుల్ స్పూన్ కలబంద జెల్ అవసరం అవుతాయి. కండిషనర్ తయారు చేయడానికి, ముందుగా అన్ని పదార్థాలను బాగా కలిపి జుట్టుకు అప్లై చేయండి. 20 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో వాష్ చేయాలి. ఈ కండిషనర్ జుట్టును మృదువుగా , తేమగా మారుస్తుంది.
ఎగ్, ఆలివ్ ఆయిల్‌తో కండిషనర్:
ఈ కండిషనర్ తయారు చేయడానికి, ముందుగా ఒక గిన్నెలో 1 గుడ్డు, 2 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ ,1 టేబుల్ స్పూన్ నిమ్మరసం ఒక బౌల్‌లో వేసుకుని కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేసి 15-20 నిమిషాల తర్వాత తేలిక పాటి షాంపూతో వాష్ చేయండి ఇది జుట్టును సిల్కీగా , బలంగా మార్చడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా జుట్టుకు తగిన పోషణను కూడా అందిస్తుంది.
కొబ్బరి పాలతో కండిషనర్:
ఈ కండిషనర్ తయారు చేయడం చాలా సులభం. దీని కోసం, మీకు ½ కప్పు కొబ్బరి పాలు, 1 టేబుల్ స్పూన్ తేనె , 1 టేబుల్ స్పూన్ బాదం నూనె అవసరం అవుతాయి. అన్ని పదార్థాలను ముందుగా ఒక బౌల్ లో వేసుకుని బాగా కలిపిన తర్వాత, దానిని జుట్టుకు అప్లై చేసి 30 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత గోరువెచ్చని నీటితో వాష్ చేయండి. ఈ కండిషనర్ పొడి బారిన, చిక్కుబడ్డ జుట్టును మృదువుగా చేస్తుంది. అంతే కాకుండా జుట్టు సహజంగా మెరిసేలా చేస్తుంది.
Also Read: గుమ్మడి విత్తనాలతో.. మతిపోయే లాభాలు !
అరటిపండు, తేనెతో కండిషనర్:
అరటిపండు శరీరానికి మాత్రమే కాకుండా జుట్టుకు కూడా చాలా ప్రయోజనాలను కలిగిస్తుంది. దీంతో కండిషనర్ తయారు చేయడానికి, మీకు 1 పండిన అరటిపండు, 1 టేబుల్ స్పూన్ తేనె , 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె అవసరం అవుతాయి. దీనిని తయారు చేయడానికి రెండు పదార్థాలను కలిపి మృదువైన పేస్ట్ లా చేసి జుట్టుకు అప్లై చేయండి. 20 నిమిషాల తర్వాత తలస్నానం చేయండి. ఇది జుట్టుకు లోతైన కండిషనింగ్ ఇస్తుంది. అంతే కాకుండా జుట్టును మృదువుగా , మెరిసేలా చేస్తుంది. జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే కండిషనర్ వాడటం కూడా చాలా ముఖ్యం.