BigTV English

Pooja Hegde: బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి గెలిచాను.. కెరీర్ విషయంలో పూజా హెగ్డే కామెంట్స్

Pooja Hegde: బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి గెలిచాను.. కెరీర్ విషయంలో పూజా హెగ్డే కామెంట్స్

Pooja Hegde: చాలామంది హీరోయిన్లు ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ముందుగా మోడలింగ్‌లో అడుగుపెట్టి ఆ తర్వాత హీరోయిన్లుగా మారుతూ ఉంటారు. హీరోయిన్స్‌గా మారిన తర్వాత కూడా వారికి బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లభిస్తుందని గ్యారెంటీ లేదు. అయినా కూడా తమ టాలెంట్ మీద నమ్మకంతో ముందుకు వెళ్తుంటారు. అలాంటి హీరోయిన్స్‌లో పూజా హెగ్డే ఒకరు. పాన్ ఇండియా హీరోయిన్ అనే ట్యాగ్‌కు చాలా దగ్గర వరకు వెళ్లి దూరమయిపోయిన పూజా.. ప్రస్తుతం సౌత్ భాషలతో పాటు బాలీవుడ్‌లో కూడా బిజీ అయిపోయింది. తాజాగా తను నటించిన ‘దేవ’ (Deva) మూవీ థియేటర్లలో విడుదల కాగా దీని ప్రమోషన్స్‌లో భాగంగా తన కెరీర్ గురించి చెప్పుకొచ్చింది పూజా.


ఖాళీగా లేను

‘‘నా కెరీర్‌లో చాలా ఎత్తుపల్లాలు ఉన్నాయి. ఇదంతా రోలర్ కోస్టర్ రైడ్‌లాగా గడిచింది. జీవితంలో ఎన్నో గొప్ప మూమెంట్స్ ఉంటాయి. నాకు కూడా ఉన్నాయి. కానీ ప్రేక్షకులు నన్ను ప్రశంసించినప్పుడు సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేని ఫ్యామిలీ నుండి వచ్చి ఇండస్ట్రీలో సక్సెస్ సాధించినానని చాలా గర్వంగా అనిపిస్తుంది. నేనెప్పుడూ తర్వాత ప్రాజెక్ట్ ఏంటి, తర్వాత ప్రాజెక్ట్ ఏంటి అని ఆలోచిస్తూనే ఉంటాను. నేనెప్పుడూ ఖాళీగా లేను. కానీ ఒక్కసారి ఆగి వెనక్కి తిరిగి చూసుకుంటే వావ్ చాలా దూరం వచ్చాను అనిపిస్తుంది. నేను ఒక్కదాన్నే ఈ ప్రయాణం చేయలేను. ఈ క్రమంలో సినిమాలతో మరింత ప్రేమలో పడిపోయాను’’ అని చెప్పుకొచ్చింది పూజా హెగ్డే.


డిఫరెంట్ క్యారెక్టర్స్

‘‘నేను మొదటిసారి సెట్‌లో అడుగుపెట్టినప్పటి నుండి ఇప్పటివరకు నేను చాలా మారిపోయాను. నా సినిమాను నేను మొదటిసారి థియేటర్‌లో చూసుకున్నప్పుడు మ్యాజిక్‌లాగా అనిపించింది. ఈ షాట్స్ అన్నీ కలిసి సినిమాలాగా మారాయా అని ఆశ్చర్యపోయాను. సినిమాలు ఇలా చేస్తారా అని వావ్ అనుకున్నాను. సినిమాలు చేస్తున్నకొద్దీ దీని గురించి నేర్చుకున్నాను. నేను నేర్చుకుందంతా సినిమా సెట్‌లోనే నేర్చుకున్నాను. ఇప్పటినుండి దేవ సినిమాలో దియాలాగా డిఫరెంట్ పాత్రలు చేయాలని ఫిక్స్ అయ్యాను. ఇందులో నేను ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా కనిపించనున్నాను. నా తరువాతి సినిమా రెట్రోలో కూడా డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నాను’’ అని తెలిపింది పూజా హెగ్డే (Pooja Hegde).

Also Read: షాహిద్ కపూర్ సినిమాకు రికార్డ్ స్థాయిలో టికెట్ ధరలు.. బాలీవుడ్‌లో కూడా ఈ పంచాయతీ తప్పదా.?

అంతా ఒకటే

‘‘నేను నా సినిమాల గురించి నా ఫ్యామిలీకి చెప్తే వారికి ఏమీ అర్థం కాదు. అందుకే మాకేం చెప్పొద్దు అంటుంటారు. నేను చెప్పడం కంటే వారే సినిమలు చూసి నేరుగా తెలుసుకుంటారు. సౌత్, నార్త్‌లో భాషలు మాత్రమే వేరు. కానీ మనుషులు మాత్రం ఒక్కటే. అందరూ దాదాపుగా ఒక్కటే. సెట్ అనేది ఎలా ఉండాలో దర్శకుడు డిసైడ్ చేస్తాడు. అది అలాగే ఉంటుంది. నేను అన్ని రకాల ఎక్స్‌పీరియన్స్‌లు చేశాను. ఇప్పుడు కేవలం భాష, పాత్రలు మాత్రమే నాకు డిఫరెంట్ అనిపిస్తున్నాయి. మహారాష్ట్రలోని పెరిగిన పల్లెటూరి అమ్మాయి కంటే కర్ణాకటలో పెరిగిన పల్లెటూరి అమ్మాయి డిఫరెంట్‌గా ప్రవర్తిస్తుంది. అదే తేడాను అర్థం చేసుకోవాలి అంతే’’ అని చెప్పింది పూజా.

Related News

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Actress Mohini: అలా చేయాలని బలవంతం చేశారు.. చాలా ఏడ్చాను, బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Big Stories

×