BigTV English

Poonam Kaur: త్రివిక్రంపై కంప్లైంట్ ఇచ్చినా లాభం లేదు.. మా అసోసియేషన్ పై పూనమ్ ఫైర్..!

Poonam Kaur: త్రివిక్రంపై కంప్లైంట్ ఇచ్చినా లాభం లేదు.. మా అసోసియేషన్ పై పూనమ్ ఫైర్..!

Poonam Kaur..ప్రముఖ పంజాబీ ముద్దుగుమ్మ పూనమ్ కౌర్ (Poonam Kaur)తెలుగులో చేసింది కొన్ని సినిమాలే.. అయినా తెలుగు డైరెక్టర్ ను టార్గెట్ చేస్తూ చేసే పోస్టుల ద్వారా మరింత పాపులారిటీ అందుకుంది. ముఖ్యంగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ‘గురూజీ’ అని పిలువబడే స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) ను టార్గెట్ చేస్తూ నేరుగా పేరు మెన్షన్ చేస్తూ విమర్శలు చేస్తూ ఉంటుంది. అయితే తనకు జరిగిన అన్యాయం ఏంటి? అన్నది మాత్రం బయటకు చెప్పలేదు ఈ ముద్దుగుమ్మ. ఇప్పటికే పలువురు నెటిజెన్స్ అసలు మీకు జరిగిన అన్యాయం ఏంటో క్లియర్ గా చెప్పండి అంటూ ఎన్నోసార్లు అడుగుతూనే ఉంటారు. కానీ ఈమె మాత్రం అసలు మ్యాటర్ ఏంటి? అన్నది ఇప్పటివరకు ఎక్కడా క్లియర్ గా చెప్పలేదు..


త్రివిక్రమ్ పై పూనమ్ పోస్ట్..

ఇక మా అసోసియేషన్ లో కూడా త్రివిక్రమ్ పై పలు మార్లు కంప్లైంట్ చేసిందట. అయితే ఇంతవరకు త్రివిక్రమ్ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదట. దీంతో ఈ మేరకు మరొకసారి పూనమ్ మండిపడుతూ ఎక్స్ ద్వారా పోస్ట్ పెట్టింది. సాధారణంగా పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో కొన్నిసార్లు పరోక్షంగా ట్వీట్లు వేస్తుంది. అది పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), త్రివిక్రమ్ (Trivikram) లను టార్గెట్ చేస్తూ ఆమె కౌంటర్లు వేసింది అని మనకు అర్థమవుతుంది. ఇంకొన్నిసార్లు గురూజీ అంటూ పరోక్షంగా కౌంటర్లు వేస్తుంది. అయితే ఇప్పుడు ఏకంగా త్రివిక్రం పేరు పెడుతూ ట్వీట్ లు చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు కూడా త్రివిక్రమ్ పేరు మెన్షన్ చేస్తూ ట్వీట్ చేసింది.


త్రివిక్రం వల్లే నా జీవితం నాశనం అయ్యింది..

ఇక పూనమ్ కౌర్ వేసిన ట్వీట్ లో ఏముంది అనే విషయానికొస్తే.. “నేను మా అసోసియేషన్ లో త్రివిక్రమ్ మీద ఎన్నోసార్లు కంప్లైంట్ చేశాను. కనీసం అతడిని ప్రశ్నించలేదు. యాక్షన్ తీసుకోలేదు. నా జీవితాన్ని అన్ని రకాలుగా త్రివిక్రమ్ నాశనం చేశాడు. అయితే అలాంటి వాడిని ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు. నా ఆరోగ్యాన్ని, సంతోషాన్ని పూర్తిగా నాశనం చేశాడు” అంటూ త్రివిక్రమ్ పై ఆరోపణలు చేస్తూ మండిపడింది పూనమ్ కౌర్. ప్రస్తుతం పూనమ్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అలాంటి మాటలను గుర్తు చేసిన పూనమ్..

ఇదిలా ఉండగా మళ్లీ కాసేపటికి ఇంకో ట్వీట్ వేసింది ఈ ముద్దుగుమ్మ. ఆ ట్వీట్ గమనించినట్లయితే పవన్ కళ్యాణ్ మాటలను గుర్తు చేసి మరీ ఆమె కౌంటర్ వేసినట్టు అనిపిస్తుంది. “నువ్వు ఎవరన్నది కాదు.. నువ్వేం చేసావు అన్నదే ముఖ్యం” అని అల్లు అర్జున్ అరెస్టు విషయంలో రేవంత్ చేసిన పని గురించి చెబుతూ పవన్ కళ్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలే చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అవే మాటల్ని త్రివిక్రమ్ విషయంలో కూడా ఆమె గుర్తు చేస్తున్నట్టు అనిపిస్తోంది అని నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా పూనం చేసే పోస్టులు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూ ఉంటాయి. కానీ అసలు త్రివిక్రమ్ వల్ల తనకు జరిగిన అన్యాయం ఏంటి అన్నది మాత్రం ఇప్పటివరకు బయటకు రాలేదు. కనీసం ఇప్పటికైనా తనకు జరిగిన అన్యాయాన్ని బయటపెడుతుందో లేదో చూడాలి.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×