(29-12-2024 ఆదివారం) ( FDIలు పెరుగుతున్నాయి )
రైజింగ్ తెలంగాణ టార్గెట్ గా పెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి తొలి ఏడాదిలో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ సెట్ చేశారు. అది నిజమే అన్నట్లుగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విషయంలో తెలంగాణ గర్వించదగ్గ వృద్ధి సాధించింది. రాష్ట్రానికి విదేశీ పెట్టుబడుల రాకపై ఎక్స్‌లో సీఎం డిసెంబర్ 29న రియాక్ట్ అయ్యారు. ప్రమాణ స్వీకారం చేసిన మొదటి నెల నుంచే దావోస్, అమెరికా, సౌత్ కొరియా లాంటి దేశాల్లో పర్యటించి ఇన్వెస్ట్ మెంట్స్ కోసం చేసిన ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయన్నారు. 2023 ఏప్రిల్ – సెప్టెంబర్ తో పోలిస్తే.. 2024 ఏప్రిల్ – సెప్టెంబర్ లో అద్భుత లక్ష్యాలను సాధించింది రాష్ట్రం. మొత్తం 12 వేల 864 కోట్ల రూపాయల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల సాధనతో 33 శాతం వృద్ధిని నమోదు చేసింది. గతేడాది ఇదో మైల్ స్టోన్.
(29-12-2024 ఆదివారం) ( విద్యార్థులకు సాఫ్ట్ స్కిల్స్ )
సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్లినా.. ఏ కార్యక్రమంలో పాల్గొన్నా ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థుల అభివృద్ధి కోసమే ఆలోచిస్తుంటారు. తాను చూసినవి ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు ఎలా ఉపయోగపడుతుంటాయో లెక్కలేసుకుంటారు. వాటిని ఇంప్లిమెంట్ చేయాలని అప్పటికప్పుడు అధికారులను ఆదేశిస్తున్నారు. డిసెంబర్ 29న రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని కన్హా శాంతివనాన్ని సీఎం రేవంత్‌రెడ్డి సందర్శించినప్పుడు ఇదే ఆలోచన చేశారు.
శాంతివనం ఆవరణలోని ట్రీ కన్జర్వేషన్ సెంటర్, వివిధ రకాల వంగడాల అభివృద్ధి, మొక్కల పెంపకానికి సంబంధించిన విధానాలు చూశారు. వర్షారణ్యం, టిష్యూ కల్చర్ ల్యాబ్‌కి వెళ్లారు. శాంతివనంలో విద్యార్థులకు నేర్పించే సాఫ్ట్ స్కిల్స్‌కు సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. కళ్లకు గంతలు కట్టుకుని కలర్స్ గుర్తించడం, పదాలు చదవడం వంటి స్కిల్స్ ను అక్కడి విద్యార్థులు ప్రదర్శించడాన్ని సీఎం అభినందించారు. ఇలాంటి నైపుణ్యాలనే ప్రభుత్వ పాఠశాలల్లోనూ అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
(30-12-2024 సోమవారం) ( తెలంగాణ అభివృద్ధికి మైక్రోసాఫ్ట్ )
టెక్ రంగంలో నెంబర్ వన్ గా తెలంగాణ ఉండాలన్న లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి పని చేస్తున్నారు. అందులో భాగంగానే మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లను హైదరాబాద్ లోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. రాష్ట్రంలో సాంకేతిక రంగం, వనరుల అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ భేటీలో తమ ప్రభుత్వం చేపట్టిన రీజినల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్లు, ఫ్యూచర్ సిటీ, కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ల అభివృద్ధి, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, ఏఐ వర్శిటీ వంటి ప్రణాళికలను సత్య నాదెళ్లకు సీఎం రేవంత్ వివరించారు. హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ తమ కార్యకలాపాలను విస్తరిస్తుండడంపై ధన్యవాదాలు తెలిపారు. ఇటీవలే మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్ లో 4 వేల మందికి ఉద్యోగావకాశాలిచ్చింది.
త్వరలో చందనవెల్లి, మేకగూడ, షాద్ నగర్ లో 4 డేటా సెంటర్లను 600 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేస్తోంది. ఏఐ సదస్సులో మైక్రోసాఫ్ట్ తో కుదిరిన ఒప్పందంలో భాగంగా ఇప్పటి వరకు సుమారు 100 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులకు ట్రైనింగ్ కూడా పూర్తయింది. అంతే కాదు క్లౌడ్ కంప్యూటరింగ్ కు సంబంధించిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని, దీనికి మైక్రోసాఫ్ట్ భాగస్వామిగా ఉండాలని, ప్యూచర్ సిటీలో రానున్న ఏఐ సిటీలో ఆర్ అండ్ డీ కేంద్రాన్ని మైక్రోసాఫ్ట్ ఏర్పాటు చేయాలని సీఎం కోరారు.
హైదరాబాద్ సహా తెలంగాణలో ఏర్పాటయ్యే స్టార్టప్ లకు ఓపెన్ ఏఐ నుంచి ఉచిత క్రెడిట్స్ ఇచ్చేలా త్వరలో దావోస్ లో జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో ఒప్పందం కుదుర్చుకోవాలని సీఎం కోరారు. భవిష్యత్ అవసరాలకు తగినట్లు హైదరాబాద్ లో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చే విషయంలో సీఎం రేవంత్ రెడ్డి దార్శనికత అభినందనీయమని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ప్రశంసించారు.
(30-12-2024 సోమవారం) ( ఫలించిన సీఎం కృషి )
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వరుడంటే తెలుగువారందరికీ ఓ సెంటిమెంట్. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు, ఆ తర్వాత కూడా తెలంగాణ నుంచి తిరుమల వెళ్లే భక్తుల సంఖ్య ఏటికేడు పెరుగుతోంది. అందుకే అక్కడ తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతించాలని సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబును ప్రత్యేకంగా కోరారు. దీనికి ఏపీ సీఎం సమ్మించడంతో తెలంగాణ భక్తులకు దర్శనాల విషయంలో మరో వెసులుబాటు వచ్చినట్లయింది. దీంతో ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ నుంచి ప్రతివారం ఏదైనా రెండు రోజుల్లో అంటే సోమవారం నుంచి గురువారం వరకు వీఐపీ బ్రేక్ దర్శనం 500 రూపాయల టిక్కెట్ కోసం రెండు లేఖలు, స్పెషల్ ఎంట్రీ దర్శన్ 300 టిక్కెట్ కోసం రెండు లేఖలు స్వీకరించనున్నారు. ప్రతి సిఫార్సు లెటర్ తో ఆరుగురు భక్తులు శ్రీనివాసుడి దర్శనానికి వెళ్లొచ్చు.
VO: (31-12-2024 మంగళవారం) ( బడ్జెట్ కసరత్తు షురూ )
తెలంగాణ రాబోయే బడ్జెట్‌పై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. అన్ని శాఖల నుంచి బడ్జెట్ ప్రతిపాదనలు ఆహ్వానించింది. శాఖలు, పథకాల వారీగా వ్యయ అంచనాలను ప్రతిపాదించాలని సూచించారు. జనవరి 4లోపు పంపాలని తెలిపారు. మోడీ ప్రభుత్వం ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఆ బడ్జెట్‌లో రాష్ట్రానికి వచ్చే గ్రాంట్లు, కాంట్రిబ్యూషన్లు, ప్రత్యేక గ్రాంట్లు, పన్ను వాటాలను పరిశీలించి రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. అందుకు తగ్గట్లుగానే తెలంగాణ ప్రభుత్వం 2025-26 బడ్జెట్ కసరత్తు ప్రారంభించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం 2,91,159 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టింది. కొత్త బడ్జెట్ ఎంత ఉండాలన్నది అన్ని శాఖల నుంచి ప్రతిపాదనలు అందిన తర్వాత ప్రభుత్వం ఒక అంచనాకు వస్తుంది.
(31-12-2024 మంగళవారం) ( డ్రగ్స్ రహిత సమాజం కోసం )
డ్రగ్స్ రహిత సమాజం కోసం సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపుతో సినీ హీరోలు వరుసగా స్పందిస్తున్నారు. తాజాగా డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి సహకరించాలని ప్రముఖ సినీ హీరో ప్రభాస్ పిలుపునిచ్చారు. ఈ అంశంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఓ స్పెషల్ వీడియో చేశారు. జీవితంలో మనకు బోలెడన్ని వినోదాలున్నాయని, మనల్ని ప్రేమించే మనుషులు, మనకోసం బతికే మనవాళ్లు ఉండగా.. ఈ డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్ అంటూ ప్రభాస్ ఈ వీడియోలో ప్రశ్నించారు. తెలిసినవారు ఎవరైనా డ్రగ్స్‌కు బానిసలైతే టోల్ ఫ్రీ నంబర్ 8712671111 కు ఫోన్ చేసి చెప్పాలని విజ్ఞప్తి చేశారు. బాధితులు పూర్తిగా కోలుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం భరోసా ఇస్తుందన్నారు. ఈ వీడియోకు మంచి రెస్పాన్స్ వస్తోంది. జనంలో అవగాహన మరింతగా పెరిగేందుకు కారణమైంది.
(01-01-2025 బుధవారం ) ( జీఎస్టీ వసూళ్లు పైపైకి )
డిసెంబర్ నెల జీఎస్‌టీ వసూళ్లు 2023తో పోల్చితే 2024లో తెలంగాణలో 10 శాతం పెరిగాయి. కేంద్ర ఆర్థికశాఖ ఈనెల 1న రిలీజ్ చేసిన లెక్కలు ఈ విషయాన్ని వెల్లడించాయి. తెలంగాణ వసూళ్లు 2023 డిసెంబర్ తో పోలిస్తే 2024 డిసెంబర్ లో 4,753 కోట్ల నుంచి 5,224 కోట్లకు పెరిగాయి. ఇదే సమయంలో తెలంగాణ ఆదాయం 29 వేల 889 కోట్ల నుంచి 32 వేల 653 కోట్ల కు చేరుకొంది. ఈ ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ వరకు సీజీఎస్‌టీ, ఎస్‌జీఎస్‌టీ, ఐజీఎస్‌టీ, సెస్‌ల రూపంలో తెలంగాణ నుంచి 46 వేల 289 కోట్లు వసూలైంది. 2023తో పోల్చితే ఈ వసూళ్లు తెలంగాణలో 5.5% పెరిగాయి.
(02-01-2025 గురువారం) ( మీకోసం.. తెలంగాణ టూరిజం)
గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన విద్య, టూరిజం, స్పోర్ట్స్ రంగాలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అవసరమైన ప్రతి సందర్భంలోనూ వీటిని ప్రమోట్ చేస్తోంది. తాజాగా తెలంగాణలోని టూరిజం సెంటర్ల ప్రమోషన్‌లో భాగంగా.. మీకోసం తెలంగాణ అవెయిట్స్ యూ అంటూ సర్కారు ప్రత్యేక వీడియో రూపొందించింది. వరల్డ్ వైడ్ టూరిస్టులను ఆకర్షించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రకృతి అందాలు, వారసత్వ కట్టడాలను వీడియోలో ప్రదర్శించారు.
తెలంగాణ అవెయిట్స్ యూ పేరుతో రూపొందించిన 58 సెకన్ల వీడియోలో.. జోడేఘాట్ లోయ, నల్లమల అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, కిన్నెరసాని వైల్డ్ లైఫ్ శాంక్చురీ, కుమ్రంభీం ప్రాజెక్ట్, ఎస్‌ఆర్‌ఎస్‌పీ నందిపేట బ్యాక్ వాటర్స్‌ను చూపించారు. ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయం, ప్రపంచ పర్యటక సంస్థ నుంచి ఉత్తమ పర్యటక గ్రామంగా గుర్తింపు పొందిన భూదాన్ పోచంపల్లి, యాదగిరిగుట్ట టెంపుల్, ఘనపురం కోటగుళ్లు, పాండవుల గుట్ట, నాగార్జున సాగర్, ఘనపురం చెరువు వంటి పర్యటక ప్రదేశాలను అందంగా చూపించారు.
(02-01-2025 గురువారం) ( రైతు భరోసాకు రైట్.. రైట్.. )
సంక్రాంతి నుంచి అమలు చేయాలని భావిస్తున్న రైతు భరోసాపై ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈనెల 5 నుంచి 7వ తేదీ వరకు గ్రామసభలు నిర్వహించి అర్హులైన రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వానికి సూచించింది. ఒక మండలాన్ని మూడు భాగాలుగా విభజించి ఆ మూడురోజుల్లోనే గ్రామ సభలు నిర్వహించి, రైతు భరోసా కోసం దరఖాస్తులు ఆహ్వానించాలనే అభిప్రాయానికి వచ్చారు. సాగు చేసే భూములకే రైతు భరోసా ఇవ్వబోతున్నారు. ధరణి పోర్టల్ ప్రకారం రాష్ట్రంలో కోటీ 53 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా, సాగుభూమి కోటీ 30 లక్షల ఎకరాలుగా ప్రభుత్వం ప్రాథమికంగా గుర్తించింది. ఇందులో రబీ సీజన్ లో 70 లక్షల ఎకరాల వరకే వివిధ పంటలు సాగవుతాయి. సో ఆ ప్రకారమే రైతు భరోసా ఇచ్చే ఛాన్స్ ఉంది.
(03-01-2025 శుక్రవారం ) ( ఉద్యోగులకు మేమున్నాం )
రాష్ట్రంలో సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్రజలకు చేరవేయడంలో ఉద్యోగుల పాత్ర చాలా ఉంటుంది. అలాంటి ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం కచ్చితంగా మేలు చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఈనెల 3న సచివాలయంలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ 2025 డైరీ, క్యాలెండర్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. సమగ్ర శిక్ష అభియాన్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై కీలక వ్యాఖ్యలు చేశారు.
వారిని రెగ్యులరైజ్ చేయాలని ఉన్నా.. చేయలేని పరిస్థితి ఉందని, రూల్స్ కు విరుద్ధంగా రెగ్యులరైజ్ చేస్తే కోర్టుల్లో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని క్లారిఫికేషన్ ఇచ్చారు. అలాగే ఉద్యోగులు సమస్యల పరిష్కారానికి ధర్నాలు, ఆందోళనలు చేయాల్సిన అవసరం లేదని, చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. కొందరు రాజకీయాల కోసం నిరసనలు, ధర్నాలకు ప్రేరేపిస్తున్నారని, అలాంటివారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రభుత్వంలో కనీస అవసరాలకు ప్రతీ నెల 22,500 కోట్లు అవసరం ఉండగా, 18,500 కోట్లు మాత్రమే ఆదాయం వస్తోందని చెప్పారు. ఇంకా 4 వేల కోట్ల లోటు ఉంటోందన్నారు.
03-01-2025 శుక్రవారం ( వేగంగా రీజినల్ రింగ్ రోడ్ )
రీజినల్ రింగ్ రోడ్డుపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా సీరియస్ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే ఇప్పటికే చాలా రివ్యూలు సీఎం స్వయంగా చేశారు. సూచనలు ఇచ్చారు. వేగం పెంచాలన్నారు. తాజాగా ఈనెల 3న జరిగిన రివ్యూలోనూ క్లియర్ కట్ ఆదేశాలిచ్చారు. నార్త్ కు సంబంధించి భూ సేకరణను త్వరగా పూర్తి చేయాలన్నారు. రైతులకు పరిహారం నిర్ణయించే విషయంలో ఉదారంగా వ్యవహరించాలని సూచించారు. ఆర్బిట్రేటర్లుగా ఉన్న జిల్లా కలెక్టర్లు వీలైనంత ఎక్కువ మొత్తంలో రైతులకు పరిహారం అందేలా చూడాలన్నారు.
తరచూ రైతులతో సమావేశమై ట్రిపుల్ ఆర్ తో కలిగే బెనిఫిట్స్ ను వివరించాలన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు సౌత్ పార్ట్ నిర్మాణానికి ఎన్‌హెచ్‌ఏఐ ఇప్పటికే సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. హ్యామ్ విధానంలో ఆర్‌అండ్‌బీ పరిధిలో 12 వేల కిలోమీటర్లు, పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 17,700 కిలోమీటర్లు రోడ్లు నిర్మించాలని సీఎం అధికారులను ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో దెబ్బతిన్న రోడ్ల రిపేర్లు అలాగే కూలిన బ్రిడ్జిలను వెంటనే నిర్మించబోతున్నారు.
(03-01-2025 శుక్రవారం) (గ్రామీణ రోడ్లకు మహర్దశ)
తెలంగాణలో గ్రామీణ రోడ్లకు మహర్దశ రాబోతోంది. రాష్ట్రంలో రూరల్ రోడ్ల నిర్మాణానికి సీఎం రేవంత్ ఏకంగా వెయ్యి కోట్లను కేటాయించారు. ఈ నెల నుంచే నెలకు 150 కోట్ల చొప్పున జూన్ నెలాఖరు నాటికి వెయ్యి కోట్లు రిలీజ్ చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఈనెల 3న సీఎం ఆదేశించారు. అటవీ ప్రాంతాల్లోని గ్రామాలకు సైతం రోడ్లు నిర్మించాలని సూచించారు. ఫోర్ వీలర్లు తిరిగేలా ఈ రోడ్లు ఉండాలన్నారు. ప్రతి పంచాయతీకి బీటీ రోడ్డు ఉండాలని, గ్రామాల నుంచి మండలాలకు సింగిల్ రోడ్లు, మండలాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ రోడ్లు కచ్చితంగా ఉండాలన్నారు.
(03-01-2025 శుక్రవారం) ( హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ )
2050 నాటికి నగర ప్రజల అవసరాలకు తగ్గట్లుగా భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేయాలని జలమండలి అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 3న జరిగిన సమీక్షలో ఆదేశించారు. బోర్డు ఛైర్మన్ హోదాలో తొలిసారి జలమండలి అధికారులతో సీఎం భేటీ అయ్యారు. గత 11 ఏళ్లలో ఇలాంటి మీటింగ్ జరగడం ఇదే తొలిసారి. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నుంచి నీటి సేకరణపై చర్చించారు. నగర ప్రజల అవసరాలకు అనుగుణంగా 20 టీఎంసీలు తెచ్చుకునేలా మార్పులకు సీఎం ఆమోదం తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ లో జనాభాకు తగ్గట్లుగా 9 వేల 800 కిలోమీటర్ల మేర 13.79 లక్షల నల్లా కనెక్షన్లతో నీటి సరఫరా జరుగుతోంది. రాబోయే 25 ఏళ్ల భవిష్యత్ అవసరాలను అంచనా వేసుకొని GHMCలో మంచినీటి సరఫరాకు ప్రణాళిక తయారు చేయాలన్నారు సీఎం.
(03-01-2025 శుక్రవారం) ( రాష్ట్రం ఇక గ్రీన్ హబ్ )
తెలంగాణను గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. HICCలో వాటాదారులైన సీఐఐ, ఫిక్కీ, ఎన్టీపీసీ, ఎఫ్‌టీసీసీఐ, సోలార్ ఎనర్జీ అసొసియేషన్ తదితర సంస్థల ప్రతినిధులతో ప్రభుత్వం చర్చలు జరిపింది. ఫ్లోటింగ్ సోలార్‌పై పెట్టుబడులకు రెడీ అవుతున్నారు. 2030 నాటికి 20 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ 20 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీలో సింగరేణి సంస్థ 5 వేల మెగావాట్లు ఉత్పత్తి చేయనుంది. గ్రీన్ ఎనర్జీ పాలసీ కూడా త్వరలోనే రానుంది. సో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లకు పెట్టుబడిలో 25% సబ్సిడీగా సమకూరుస్తారు. ప్లాంట్ల ఏర్పాటుకు ప్రైవేట్ వ్యవసాయ స్థలాలను నాన్ అగ్రికల్చర్ ల్యాండ్‌గా కన్వర్ట్ చేస్తారు. మెటీరియల్, పరికరాలపై స్టేట్ జీఎస్టీని రీయింబర్స్ చేస్తారు. పావలా వడ్డీతో ఐదేళ్ల పాటు రుణాలిస్తారు. వందశాతం స్టాంప్ డ్యూటీ రీయింబర్స్‌మెంట్ వర్తిస్తుంది.
(03-01-2025 శుక్రవారం) ( మహిళాసంఘాలకు మరో కానుక )
మహిళలను కోటీశ్వరులను చేయాలని సంకల్పంతో ఉన్న తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో మరో ముందడుగు వేసింది. ఈనెల 3న ప్రజాభవన్‌లో 25 సంచార చేపల విక్రయ వాహనాలను మంత్రి సీతక్క జెండా ఊపి ప్రారంభించారు. మహిళలు చేపల విక్రయ వ్యాపారం ద్వారా ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించాలన్నది ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం. ఈ పథకం కింద 10 లక్షల విలువైన వాహనాలను 6 లక్షల సబ్సిడీతో కేవలం 4 లక్షలకే లబ్దిదారులకు అందిస్తున్నారు. మహిళా సంఘాల ఫిష్ ఫుడ్ కు మంచి బ్రాండ్ క్రియేట్ కావాలన్నారు మంత్రి సీతక్క. 100% సక్సెస్ రేట్ సాధించాలని ఆకాంక్షించారు. మహిళల ఉపాధి కల్పనకు, వ్యాపారాల్లో రాణించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోంది. అంతే కాదు 17 రకాల వ్యాపారాలకు లోన్లు, బీమా స్కీమ్స్ అమలు చేస్తున్నారు.
(04-01-2025 శనివారం ) ( క్యాబినెట్ కీలక నిర్ణయాలు )
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైతు భరోసా విధి విధానాలు, భూమి లేని వారికి ఆర్థిక సహాయం, గ్రీన్ పాలసీ, టూరిజం పాలసీ, బీసీ డెడికేటెడ్ కమిషన్, ఎస్సీ వర్గీకరణ కమిషన్ నివేదికలపై చర్చించారు. యాదగిరిగుట్ట ఆలయానికి కూడా బోర్డు, ఇందిరమ్మ ఇండ్ల సర్వే వంటి వాటిపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.