BigTV English

Posani Arrest: బెడ్ రూమ్ లోకి వచ్చి బలవంతంగా తీసుకెళ్లారు.. పోలీసులపై పోసాని భార్య ఫైర్?

Posani Arrest: బెడ్ రూమ్ లోకి వచ్చి బలవంతంగా తీసుకెళ్లారు.. పోలీసులపై పోసాని భార్య ఫైర్?

Posani Arrest..ప్రముఖ సినీ నటుడిగా, రచయితగా,హాస్యనటుడిగా, విలన్ గా, రాజకీయవేత్తగా తనకంటూ మంచి పేరు సొంతం చేసుకున్నారు పోసాని కృష్ణ మురళి(Posani Krishna Murali) . గతంలో వైసిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏపీఎఫ్టీవీడీసీ చైర్మన్ గా పనిచేసిన ఆయన ఆ పదవిలో ఉన్నప్పుడు అటు సినీ పరిశ్రమపై, ఇటు ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Nara Chandra Babu Naidu), ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గతంలో ఆయనపై అన్నమయ్య జిల్లాలో ఓబులవారిపల్లెలో కేసు ఫైల్ అయింది. ఇక సినిమా పరిశ్రమపై విమర్శించినందుకుగాను స్థానికులు ఈయనపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో.. పోసానిపై 196, 353(2), 111 రెడ్ విత్ 3(5) పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి రాయదుర్గం మై హోమ్ భుజా అపార్ట్మెంట్స్ లో నివాసం ఉంటున్న పోసానిని ఏపీలోని రాయచోటి పోలీసులు అదుపులోకి తీసుకోవడం గమనార్హం.


పోలీసుల తీరుపై మండిపడుతున్న పోసాని భార్య..

ఇకపోతే నిన్న రాత్రి పోసాని కృష్ణ మురళిని అరెస్టు చేయడంతో ఈ విషయం కాస్త సంచలనంగా మారింది. అయితే పోసానిని అరెస్టు చేయడానికి వెళ్ళిన పోలీసులు వారితో ప్రవర్తించిన తీరుకు పోసాని భార్య పోలీసుల తీరుపై మండిపడింది. పోసాని భార్య కుసుమలత మీడియాతో మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేసింది.”రాత్రి ఎనిమిది గంటలకు పోలీసులు మా ఇంటికి వచ్చారు. నా భర్త ఆరోగ్యం బాగోలేదు అని చెప్పినా వినలేదు. హాస్పిటల్ కి వెళ్ళాలి.. నోటీసులు ఇవ్వండి. రేపు వస్తామని చెప్పినా వినకుండా.. వారు మాతో చాలా రూడ్ గా ప్రవర్తించారు. నా భర్త ఫోన్, నా ఫోన్ కూడా తీసుకెళ్లిపోయారు. రాత్రిపూట అంత అత్యవసరంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది .బాత్రూం, బెడ్ రూమ్ లోకి కూడా పోలీసులు వెళ్లి రావడం మాకు చాలా అవమానంగా అనిపిస్తోంది. రాజకీయాల్లో లేనని చెప్పినా.. ఇకపై ఎవరి గురించి మాట్లాడనని చెప్పినా కూడా ఆయనను వదలడం లేదు. పోలీసులు హడావిడిగా బలవంతంగా మా ఆయనను తీసుకెళ్లారు” అంటూ పోసాని కృష్ణ మురళి భార్య కుసుమలత పోలీసుల తీరుపై మండిపడుతూ పలు కామెంట్లు చేసింది. ఇకపోతే ఈ విషయాన్ని వైకాపా అధ్యక్షుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) కి కుసుమలత వెల్లడించడంతో ఆయన సీనియర్ న్యాయవాదులను రంగంలోకి దింపినట్లు సమాచారం.


పోసాని కృష్ణ మురళి అరెస్ట్ పై పృథ్వీరాజ్ ట్వీట్..

ఇదిలా ఉండగా ఒకప్పుడు వైసీపీ పార్టీలో పనిచేసి కొన్ని విభేదాలు రావడంతో మళ్లీ జనసేన పార్టీలోకి చేరిన 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ (Prudhviraj)పోసాని కృష్ణమురళి అరెస్టుపై ఒక ట్వీట్ వేశారు.”నోటి దూలకు తగిన శాస్తి తప్పదు. నిజం అనేది ఎప్పుడూ న్యాయానికి తోడుగా నిలుస్తుంది. మాట చాలా విలువైనది. అందుకే ఎప్పుడూ పొదుపుగా వాడాలి. నిజం తెలుసుకొని ఎప్పుడు ఆగిపోవాలో తెలిసిన వాడే మహాపురుషుడు” అంటూ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ట్వీట్ వేసిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×