Younis Khan vs Pak Coach: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో భాగంగా ఫిబ్రవరి 26 బుధవారం రోజు జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై ఆఫ్గనిస్తాన్ జట్టు 8 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 325 పరుగుల భారీ స్కోర్ ని నమోదు చేసింది. ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ రికార్డ్ సెంచరీ తో చెలరేగాడు. 146 బంతులలో 12 ఫోర్లు, ఆరు సిక్స్ లతో 177 పరుగులు చేశాడు.
అలాగే ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ లో రెహ్మానుల్లా గుర్బాజ్ {6}, సెదికుల్లా అటల్ {4}, రహ్మత్ షా {4}.. పరుగులతో విఫలం చెందగా.. హస్మతుల్లా షాహిదీ {40}, అజ్మతుల్లా ఒమర్జాయ్ {41}, మహమ్మద్ నబీ {40} పరుగులతో రాణించడంతో ఆఫ్ఘనిస్తాన్ 325 పరుగుల భారీ స్కోర్ ని నమోదు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 3, లివింగ్ స్టోన్ 2, జేమీ ఓవర్టన్, ఆదిల్ రషీద్ చెరో వికెట్ పడగొట్టారు. ఇక ఈ మ్యాచ్ లో సూపర్ సెంచరీ తో అలరించిన జద్రాన్.. ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే అత్యధిక స్కోర్ {177} నమోదు చేసిన ఆటగాడిగా రికార్డు క్రియేట్ చేశాడు.
అనంతరం లక్ష్య చేదనలో ఇంగ్లాండ్ 49.5 ఓవర్లలో 317 పరుగులకే ఆల్ అవుట్ అయ్యింది. ఇంగ్లాండ్ జట్టులో జో రూట్ {120} సెంచరీ చేసినా ఫలితం దక్కలేదు. ఇక ఆఫ్గనిస్తాన్ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ 5 వికెట్లతో రాణించగా.. మహమ్మద్ నబీ 2, ఫజల్కాక్, ఫరుఖీ, రషీద్ ఖాన్, గుల్బాదిన్ చెరో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో అఫ్గానిస్థాన్ సెమిస్ ఆశలు మెరుగు కాగా .. ఇంగ్లాండ్ సెమిస్ రేసు నుంచి నిష్క్రమించింది. ఈ గెలుపుతో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మెంటార్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ఆఫ్ఘనిస్తాన్ జట్టుకి మెంటార్ ఎవరో కాదు.. పాకిస్తాన్ మాజీ ఆటగాడు యూనిస్ ఖాన్. ఈ ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ 2025 కి ముందు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు {ఏసీబీ} తమ జట్టు మెంటార్గా పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం యూనిస్ ఖాన్ ని నియమించింది. యూనిస్ ఖాన్ కి గతంలో 2022లో ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు బ్యాటింగ్ కోచ్ గా పని చేసిన అనుభవం ఉంది. అలాగే యూనిస్ ఖాన్ కి కోచ్ గా అపారమైన అనుభవం ఉంది. గతంలో అతడు పాకిస్తాన్ క్రికెట్ జట్టు బ్యాటింగ్ కోచ్ గా కూడా పనిచేశాడు.
అదే విధంగా పాకిస్తాన్ సూపర్ లీగ్ లో పెషావర్ జల్మి, అబుదాబి టీ-10 లీగ్ లో బంగ్లా టైగర్స్ తో కూడా కలిసి పని చేశాడు. పాకిస్తాన్ తరపున 118 టెస్టులు ఆడిన యూనిస్ ఖాన్ 10 వేలకు పైగా పరుగులు చేశాడు. అంతేకాకుండా అతని సారధ్యంలోనే 2009 టీ-20 ప్రపంచ కప్ ని పాకిస్తాన్ జట్టు సొంతం చేసుకుంది. ఇప్పుడు యూనిస్ ఖాన్ వల్లే ఆఫ్గనిస్తాన్ ఇలా రెచ్చిపోయి ఆడుతుందని క్రీడా వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
Pakistan’s greatest batsman Younis khan is coaching Afghanistan team. Who’s Pakistan coach by the way ? pic.twitter.com/YWEbiOm96K
— Moments & memories (@momentmemori) February 26, 2025