విమాన ప్రయాణాలలో తరచుగా ఆశ్చర్యకర ఘటనలతో పాటు షాకింగ్ ఇన్సిడెంట్లు జరుగుతుంటాయి. తోటి ప్రయాణీకుల మీద దాడి చేయడం, విమానం గాల్లో ఉండగా ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నించడం, కొంత మంది అందరి ముందే దుస్తులు విప్పడం లాంటి ఘటనలు జరుగుతుంటాయి. తాజాగా అచ్చం ఇలాంటిదే జరిగింది. చికాగో మిడ్ వే ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో జరిగిన ఈ ఘటనతో ప్రయాణీకులు షాకయ్యారు.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
తాజాగా సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఓ విమానం కాసేపట్లో చికాగో మిడ్ వే ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవుతుంది అనగా, తన బట్టలన్నీ విప్పేసి, సీటు మీదే మల విసర్జన చేసింది ఓ మహిళా ప్యాసింజర్. ఈ ఘటన చూసి విమానంలోని ఇతర ప్రయాణీకులు షాకయ్యారు. కొంత మంది భయపడగా, మరికొంత మంది అసహనం వ్యక్తం చేశారు. వెంటనే విమాన సిబ్బందికి విషయం చెప్పారు. కాసేపటికే విమానం ల్యాండ్ అయ్యింది.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
విమానం దిగిన వెంటనే పోలీసులు, వైద్య సిబ్బంది. సదరు మహిళా ప్రయాణీకురాలిని మెడికల్ ఎగ్జామిన్ కోసం హాస్పిటల్ కు తరలించారు. ఆమె ఎందుకు అలా చేసింది? అనే విషయంపై డాక్టర్లు ఆరా తీస్తున్నారు. వైద్య పరీక్షల తర్వాత ఆమె పరిస్థితి ఏంటి అనేది తెలియాల్సి ఉంటుంది. మరోవైపు ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకున్నారనే విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. అయితే, వెంటనే విమానాన్ని పూర్తిగా క్లీన్ చేసేందుకు పంపించారు. విమానాన్ని పూర్తిగా శుభ్రపరిచిన తర్వాత మళ్లీ అందుబాటులోకి తీసుకురానున్నట్లు సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్ అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో పలువురు ప్రయాణీకులు తమ గమ్య స్థానాలకు అనుకున్న సమయానికి చేరుకోలేకపోయారు.
Read Also: ఇంట్లో నుంచే ఆలయాల దర్శనం టికెట్లు బుక్ చేసుకోవచ్చు, సింపుల్ గా ఇలా?
విమానయాన సంస్థ ఏం చెప్పిందంటే?
అటు ఈ ఘటనకు సంబంధించి సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్ కీలక ప్రకటన విడుదల చేసింది. ప్రయాణీకుల సేఫ్టీ కోసం ఎంతో ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఊహించని ఘటనను సమర్థవంతంగా ఎదుర్కొన్న సిబ్బందిని అభినందించింది. ఈ ఇన్సిడెంట్ కారణంగా అసౌకర్యం కలిగిన ప్రయాణీకులు, ఆలస్యం అయిన ప్రయాణీకులకు సారీ చెప్పింది. ఈ ఘటన కారణంగా ఇబ్బందులు ఎదర్కొన్న ప్రతి ఒక్కరి తగిన సాయం చేసేందుకు తమ సిబ్బంది పని చేస్తున్నట్లు తెలిపారు.
Read Also: పది నిమిషాల్లో సీట్లో ఉండాలి, లేదంటే క్యాన్సిల్.. ఇదీ అసలు కథ!
గత నెలలోనూ ఇదే ఎయిర్ లైన్స్ లో ఇలాంటి ఘటనే జరిగింది. ఓ మేల్ ప్యాసింజర్ ప్రయాణ సమయంలో తన బట్టలు విప్పి నగ్నంగా కనిపించాడు. వెంటనే విమాన సిబ్బంది స్పందించి అతడికి మళ్లీ దుస్తులు వేయించారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. మళ్లీ ఇలాంటి ఘటన జరగడంతో విమానయాన సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇకపై ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా ఉండేందుకు తగిన చర్యలు చేపడుతోంది.
Read Also: దేశంలోనే ఫస్ట్ గ్రీన్ విలేజ్, ఖోనోమా గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!