
Unstoppable : ఆహా ఓటీటీ వేదికగా ప్రచారం అవుతున్న అన్‌స్టాపబుల్ షోకి ఈ మధ్య పాపులారిటీ విపరీతంగా పెరిగింది. అటు సినీ సెలబ్రిటీలతోపాటు రాజకీయ ప్రముఖులను బాలయ్య తనదైన శైలిలో ఇంటర్వ్యూలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు సినీహీరో కమ్ రాజకీయ నాయకుడు పవర్ స్టార్ ఎంట్రీ ఇచ్చారు. బాలకృష్ణ వ్యాఖ్యతగా వ్యవహరిస్తోన్న అన్‌స్టాపబుల్-2కు పవన్ కల్యాణ్ గెస్ట్‌గా వచ్చారు. ఈ ఎపిసోడ్ చిత్రీకరణ ప్రారంభమైందని అల్లు అరవింద్ వెల్లడించారు.
‘అన్‌స్టాపబుల్’ మొదటి సీజన్ సూపర్ సక్సెస్ అయ్యింది. రెండో సీజన్‌ను మంచి జోష్ మీద కొనసాగిస్తున్నారు. ప్రేక్షకులను ఈ షో ఎంతగానో అలరిస్తోంది. ఇక ఈ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ ఎప్పుడు వస్తారా..? అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వాళ్ల కోరిక నెరవేరుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్‌లో అన్ స్టాపబుల్ ఎపిసోడ్ షూటింగ్ జరుగుతోంది.
అన్‌స్టాపబుల్‌లో ఎవరి కోసమైతే అందరూ ఎదురు చూస్తున్నారో ఆయన వచ్చేశారని అరవింద్ తెలిపారు. బిగ్గెస్ట్ అండ్ క్రేజీ ఎపిసోడ్ షూటింగ్ జరుగుతోందని చెప్పారు. పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమానికి రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. త్వరలోనే ఈ ఎపిసోడ్ ప్రేక్షకులు ముందుకు రానుందన్నారు. ఈ కార్యక్రమానికి పవన్ వస్తారన్నది రెండో ఎపిసోడ్‌లోనే అభిమానులకు అర్థమైంది. అప్పుడు త్రివిక్రమ్‌కు ఫోన్ చేసిన బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్‌కు ఎప్పుడు వస్తున్నావు?, ఎవరితో రావాలో తెలుసుగా.!’ అని అనడంతో అది వైరల్ అయింది. అప్పుడే హింట్ ఇచ్చిన బాలయ్య ఇప్పుడు పవన్ షో చేస్తున్నారు.
ప్రస్తుతం పవన్ ‘హరి హర వీరమల్లు’ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్నారు. అటు బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’గా సంక్రాంతికి అలరించేందుకు సిద్ధమయ్యారు. ఈ లోపే పవర్ స్టార్ పాల్గొన్న అన్ స్టాపబుల్ షో ప్రేక్షకులకు ఆహా ఓటీటీలో అలరించే ఛాన్స్ ఉంది.
Mansoor Ali Khan : నా ఉద్దేశం అది కాదు.. ఫైనల్ గా స్పందించిన మన్సూర్..