BigTV English

Kannappa : ‘కన్నప్ప’లో గెస్ట్ రోల్ కోసం ప్రభాస్ ఎంత ఛార్జ్ చేశారో తెలిస్తే ఫ్యూజులు అవుట్

Kannappa : ‘కన్నప్ప’లో గెస్ట్ రోల్ కోసం ప్రభాస్ ఎంత ఛార్జ్ చేశారో తెలిస్తే ఫ్యూజులు అవుట్

Kannappa : మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీం ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ (Kannappa) సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ‘రుద్ర’ (Rudra) అనే పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా, ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. అయితే ప్రభాస్ ఈ సినిమాలో నటించడానికి ఎంత రెమ్యూనరేషన్ ఛార్జ్ చేశారు అనే విషయంపై ప్రస్తుతం చర్చ నడుస్తుంది.


‘కన్నప్ప’ కోసం ప్రభాస్ రెమ్యూనరేషన్

ఇండియాలోనే బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టార్ అనగానే గుర్తొచ్చే పేరు ప్రభాస్. ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటిది మరి. అంతేకాకుండా చేతి నిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉన్న బిజీయెస్ట్ పాన్ ఇండియా స్టార్ కూడా ప్రభాసే. మరి ఇంతటి క్రేజ్, ఫాలోయింగ్ ఉన్న స్టార్ ఒక సినిమాలో నటిస్తే భారీ రెమ్యూనరేషన్ తీసుకోవడం సహజమే. అందుకే ప్రభాస్ ఇప్పుడు ఒక్కో సినిమాకు ఏకంగా 200 కోట్ల దాకా వసూలు చేస్తున్నాడు అనే టాక్ నడుస్తోంది.


మరి ఇంత భారీ పారితోషికం వసూలు చేసే స్టార్ గెస్ట్ రోల్ చేస్తే… ఆ రెమ్యూనరేషన్ కూడా ఎక్కువగానే ఉంటుంది. కానీ మన డార్లింగ్ ‘కన్నప్ప’ మూవీ కోసం ఎంత రెమ్యూనరేషన్ ఛార్జ్ చేశారో తెలిస్తే ఖచ్చితంగా ఫ్యూజులు అవుట్ అవుతాయి. ఎందుకంటే ఆయన అసలు ఈ మూవీ కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. ఈ విషయాన్ని స్వయంగా మంచు విష్ణు వెల్లడించారు.

హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో ప్రభాస్ గెస్ట్ రోల్ పై షూటింగ్ జరిగింది. ఆయన పాత్రకు సంబంధించిన షూటింగ్ ను కేవలం ఐదు రోజుల్లోనే పూర్తి చేశారు. అయితే నిజానికి ‘కన్నప్ప’ మూవీలో చాలామంది అగ్ర నటీనటులు కీలకపాత్రలు పోషించారు. కానీ ‘రుద్ర’ రోల్ కోసం ప్రభాస్ మాత్రం ఒక్క పైసా కూడా తీసుకోలేదని, ఆయన బిజీ షెడ్యూల్స్ మధ్య కూడా ఈ మూవీ కోసం డేట్స్ కేటాయించి మూవీ షూటింగ్ ను పూర్తి చేశాడని మంచు విష్ణు చెప్పుకోచ్చారు. ఇంత పెద్ద స్టార్ అయినప్పటికీ ప్రభాస్ ఇలా గెస్ట్ రోల్ చేయడానికి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండానే నటించాడని చెప్పి మంచు విష్ణు డార్లింగ్ అభిమానులను ఆశ్చర్యపరిచాడు. అలాగే మలయాళ స్టార్ మోహన్ లాల్ కూడా ఈ మూవీలో నటించడానికి పారితోషికం తీసుకోలేదని తెలుస్తోంది. మరోవైపు ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో, రెండేసి సినిమాల షూటింగ్ లతో బిజీగా ఉన్నారు.

‘కన్నప్ప’లో నటించిన అగ్రతారలు
‘కన్నప్ప’లో మోహన్ బాబు, శరత్‌ కుమార్, అర్పిత్ రాంక, కౌశల్ మందా, రాహుల్ మాధవ్, దేవరాజ్, ముఖేష్ రిషి, బ్రహ్మానందం, రఘుబాబు, ప్రీతి ముఖుందన్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మోహన్‌లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా, మోహన్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ మూవీ రూపొందుతోంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×