Actor Rare Photo: సాధారణంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారి విషయాలను తెలుసుకోవడం కోసం అభిమానులు ఎంతగానో ఆత్రుత పడుతూ ఉంటారు. గతంలో సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు తెలుసుకోవాలి అంటే కేవలం సినీ వార్తాపత్రికలలో ప్రచురించి విషయాల ద్వారా వారి సినీ కెరియర్ గురించి వారి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ గురించి తెలుసుకునే అవకాశం ఉండేది కానీ ఇటీవల కాలంలో సోషల్ మీడియా బాగా అభివృద్ధి చెందిన తర్వాత హీరో హీరోయిన్లకు సంబంధించిన ప్రతి చిన్న విషయం క్షణాల్లో తెలిసిపోతుంది. ఇక సోషల్ మీడియా మంచిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత సెలబ్రిటీలు కూడా వారి చిన్నప్పటి ఫోటోలను అందరితో పంచుకుంటున్నారు.
నటితో నిశ్చితార్థం…
తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఒక హీరో ఫాదర్స్ డే(Fathers Day) సందర్భంగా తన తండ్రితో కలిసి దిగిన చిన్నప్పటి ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇలా ఈ ఫోటోని షేర్ చేసిన ఆ హీరో ఫాదర్స్ డే శుభాకాంక్షలు చెప్పడమే కాకుండా తన తండ్రిని చాలా మిస్ అవుతున్నాను అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మరి ఈ ఫోటోలో ఉన్న ఆ హీరో ఎవరో గుర్తుపట్టారా. ఇటీవల ఆ హీరో నిశ్చితార్థం (Engagment) చేసుకున్నారు. ఇప్పటికైనా ఆ హీరో ఎవరో గుర్తొచ్చిందా? గుర్తు రాకపోతే మీ కోసం మరొక చిన్న హింట్ ఈయన ఫ్యామిలీకి భారీ పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ కూడా ఉంది. మరి ఇప్పటికైనా ఆ హీరో ఎవరో గుర్తొచ్చారా?
ఫాదర్స్ డే స్పెషల్…
ఇలా చిన్నప్పుడు తండ్రి దగ్గర తన అన్నయ్యతో కలిసి ఫోటో దిగిన ఈ హీరో మరెవరో కాదండోయ్ నటుడు నారా రోహిత్(Nara Rohit). ఫాదర్స్ డే సందర్భంగా నారా రోహిత్ తన తండ్రితో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేశారు. నారా రోహిత్ హీరోగా బాణం, సోలో, ప్రతినిధి వంటి ఎన్నో సినిమాలలో నటించి మంచి సక్సెస్ అందుకున్నారు. తాజాగా ఈయన భైరవం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ద్వారా తన నటనకు మంచి మార్కులే కొట్టేశారు. ఇక ప్రస్తుతం నారా రోహిత్ కి సంబంధించిన చిన్నప్పటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో చిన్నప్పుడు కూడా చాలా బొద్దుగా ఉన్నారు అంటూ కొంతమంది అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
Also Read: Actress Anupama: అనుపమాకు కేంద్రమంత్రి మద్దతు.. సిమ్రన్, ఆసిన్, నయన్‌లకు అదే జరిగిందంటూ.
ఇక నారా రోహిత్ కెరియర్ విషయానికి వస్తే ఇటీవల ఎన్నికల సమయంలో ప్రతినిధి 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన ఈ సినిమాతో పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయారు. తాజాగా విజయ్ కనకమేడల దర్శకత్వంలో నటించిన భైరవం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పరవాలేదు అనిపించుకుంది. నారా రోహిత్ నటి సిరి లెల్లా(Siri Lellaa) హీరోయిన్ తో ప్రేమలో పడి పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఇటీవల తన నిశ్చితార్థం కూడా హైదరాబాద్ లో ఎంతో ఘనంగా జరిగింది అయితే ఈయన తండ్రి నారా రామ్మూర్తి నాయుడు(Nara Ramurthi Naidu) మరణించడంతో వీరి వివాహం కాస్త ఆలస్యం అవుతుంది. ఇక నారా రామ్మూర్తి నాయుడు స్వయంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి సోదరుడు అవుతారనే విషయం మనకు తెలిసిందే.