War 2: బాలీవుడ్ నుండి సౌత్ బాక్సాఫీస్ దగ్గర రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో ‘జవాన్’ మూవీకి ప్రత్యేక స్థానం ఉంది. షారుక్ ఖాన్ హీరోగా, అట్లీ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా దక్షిణాది రాష్ట్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్ సినిమా అయింది. సౌత్ ఇండియాలో దాదాపు ₹75 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టి, బాలీవుడ్ సినిమాలకు ఇక్కడ మార్కెట్ ఉంది ప్రూవ్ చేసింది జవాన్ సినిమా.
‘జవాన్’కు సౌత్ లో ఈ స్థాయి విజయం రావడానికి అట్లీ ఇమేజ్, విజయ్ సేతుపతి, నయనతార స్టార్ నటించడమే, అలాగే షారుక్ ఖాన్ కి కూడా సౌత్ లో సాలిడ్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇవన్నీ కలిసి జవాన్ సినిమా సౌత్ లో రికార్డ్ క్రియేట్ చేసేలా హెల్ప్ చేసాయి. ముఖ్యంగా తమిళనాడులో ‘జవాన్’కు మంచి ఓపెనింగ్స్ రావడానికి అట్లీ ట్రాక్ రికార్డ్ మరింత హెల్ప్ అయ్యింది.
ఇప్పుడు ఆ రికార్డుని బ్రేక్ చేయడానికి వస్తున్న సినిమా ‘WAR 2’. మేకర్స్ దీనిని పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా ప్రమోట్ చేస్తున్నా, ఇది స్ట్రెయిట్ హిందీ మూవీ అనే విషయం మారదు. అయితే WAR 2పై తెలుగు రాష్ట్రాల్లో ఉన్న హైప్ అంతా ఎన్టీఆర్ వలన అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన క్రేజ్, మాస్ అప్పీల్ వలన ఈ సినిమా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో బ్లాస్టింగ్ కలెక్షన్లు అందుకునే ఛాన్సుంది.
వార్ 2 సినిమాకు హిట్ టాక్ వస్తే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించడంలో ఆశ్చర్యం ఏమీ ఉండదు. ఇప్పటికే ఈ రేంజ్ సినిమాలకి మంచి మార్కెట్ ఏర్పడింది. జవాన్ సాధించిన ₹75 కోట్ల సౌత్ బిజినెస్‌ను వార్ 2 కేవలం తెలుగు రెండు రాష్ట్రాల్లోనే బ్రేక్ చేసే అవకాశం ఉంది.
ఇక తమిళనాడు, కేరళ లాంటి ప్రాంతాల్లో మాత్రం వార్ 2కి అంతగా ఆదరణ లభించకపోవచ్చు. కారణం – అక్కడ రజనీకాంత్ కూలీ మూవీ వంటి బిగ్ బడ్జెట్ సినిమాలు లైన్‌లో ఉన్నాయి. అందుకే ఈ రెండు రాష్ట్రాల్లో వార్ 2 డామినేట్ చేయడం కాస్త కష్టమే. అయినా కూడా, తెలుగు రాష్ట్రాల్లో వార్ 2 సాధించే వసూళ్లతో ‘జవాన్’ సెట్ చేసిన రికార్డులు తిరగరాయడం ఖాయం అనిపిస్తోంది.
మొత్తానికి, ఎన్టీఆర్ బ్రాండ్, వార్ 2 బజ్, బాక్సాఫీస్ క్రేజ్—అన్ని కలిపి సౌత్ ఇండియాలో బాలీవుడ్ సినిమాలకు సరికొత్త రేంజ్ తెచ్చేలా ఉంది. బాలీవుడ్ నుండి వచ్చిన సినిమాల్లో ‘జవాన్’ మొదటి సక్సెస్ అయితే, ‘వార్ 2’ మరో మెట్టు ఎక్కే అవకాశం ఉన్న మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్‌గా మారనుంది.