BigTV English

Retro Censor : రెట్రో సెన్సార్ పూర్తి… ఆఖరి 10 నిమిషాలకు ఫిదా అవ్వాల్సిందే..?

Retro Censor : రెట్రో సెన్సార్ పూర్తి… ఆఖరి 10 నిమిషాలకు ఫిదా అవ్వాల్సిందే..?

Retro Censor : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, పూజా హెగ్డే జంటగా సినిమా రెట్రో. ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజు సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కార్తీక్ సుబ్బరాజు సినిమాలన్నీ తమిళ ప్రేక్షకులే కాక తెలుగు ఆడియోస్ కూడా నచ్చే విధంగా ఉంటాయి. ఈ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. అందులో భాగంగా ఈ మూవీకి సెన్సార్ పూర్తి చేసుకుంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..


సినిమాలో అదే హైలెట్ ..

కోలీవుడ్ స్టార్ సూర్య నటిస్తున్న 44వ సినిమా రెట్రో. ఈ సినిమాలో టాలీవుడ్ క్వీన్ పూజా హెగ్డే నటిస్తున్నారు. అలా వైకుంఠపురంతో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న పూజా హెగ్డే గత కొన్ని రోజులుగా తెలుగులో ఎలాంటి సినిమా చేయలేదు. ఇప్పుడు ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా రెట్రో సినిమా 2 గంటల 48 నిమిషాల రన్ టైమ్ లాక్ చేస్తూ సెన్సార్ పూర్తి చేసుకొని U/A సర్టిఫికెట్ను పొందినట్లు అధికారంగా ప్రకటించింది చిత్ర యూనిట్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి. 1980లో జరిగిన ఒక గ్యాంగ్ స్టార్ కు సంబంధించిన సినిమాగా రూపొందిస్తున్నారు. పీడియాటిక్ సినిమాగా రెట్రో రానుంది. ఈ సినిమాలో చివరి పది నిమిషాలు హైలెట్ అని టాక్.. ఆఖరి నిమిషాల్లో వచ్చే సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయని సమాచారం. ఈ సినిమాలో సూర్య డిఫరెంట్ లుక్ తో పెద్దపెద్ద మీసాలతో రఫ్ గా కనిపిస్తాడు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టరు, టీజర్ తో అంచనాలు పెంచేశారు.


హీరో ఆలా కనిపిస్తాడా ..

ఈ సినిమాలో హీరోయిన్ తో ప్రేమలో పడిన గ్యాంగ్ స్టర్ ఎలా మారతాడు అనేదే ఈ సినిమా స్టోరీ. టీజర్ లో పూజ హెగ్డే, సూర్య ఇద్దరు ఫస్ట్ షాట్ లోనే కనిపిస్తారు. నా కోపాన్ని కంట్రోల్ చేస్తావా.. మా నాన్నతో కలిసి పనిచేయడం ఆపేస్తావా అని పూజ సూర్యని అడుగుతుంది. సూర్య, పూజకి రౌడీయిజం మానేస్తానని మాట ఇస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మనం ఈ సినిమాలో చూడొచ్చు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, నాజర్, జయరాం కీలక పాత్రలో నటిస్తున్నారు. లవ్, యాక్షన్ సెంటిమెంట్ తో వస్తున్న సినిమా రెట్రో. ఈ సినిమా హిట్ అవడం సూర్యకి, పూజకి ఇద్దరికీ ఎంతో ముఖ్యం. కార్తీక్ సుబ్బరాజ్ పిజ్జా, జిగర్ తాండ, వంటి విభిన్నమైన సినిమాలను నిర్మించాడు. సూర్య ఈ చిత్రంలో పవర్ఫుల్ రోల్ లో కనిపిస్తున్నారని టాక్. ఈ సినిమాకు సంతోష్ నారాయణ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా మే 1న రిలీజ్ కానుంది. సూర్య అభిమానులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

Jewel Thief OTT : కోట్లు పెట్టి తీశారు… చేసేదేమ్ లేకుండా.. డైరెక్ట్ ఓటీటీలో…

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×