Tamannaah: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా మిల్క్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న తమన్నా (Tamannaah) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 17 సంవత్సరాలకు పైగానే అవుతున్నా.. ఇప్పటికీ అదే అందంతో, క్రేజ్ తో ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా రామ్ చరణ్ (Ram Charan), అల్లు అర్జున్ (Allu Arjun), ఎన్టీఆర్ (NTR), ప్రభాస్ (Prabhas) వంటి స్టార్ హీరోలతో కలసి పనిచేసిన ఈమె.. చిరంజీవి (Chiranjeevi) వంటి మెగాస్టార్ తో కూడా నటించిన సందర్భాలు ఉన్నాయి. అంతేకాదు సినీ ఇండస్ట్రీలో ఒక సెంటిమెంట్ ను కూడా మోసింది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా ఈమె ఎవరితో నటిస్తే వారికి పెళ్లయిపోయింది. దాంతో తమన్నాతో ఎవరు నటిస్తే వారి పెళ్లి ఖాయం అనే సెంటిమెంట్ ను కూడా మోయాల్సి వచ్చింది. ఇకపోతే ఈమె సెంటిమెంట్ నుండి ప్రభాస్ మాత్రం తప్పించుకున్నారు అని చెప్పవచ్చు.
బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ అయ్యిందా..?
ఇదిలా ఉండగా ఈమెతో నటించిన చాలామంది వివాహాలు చేసుకుని, పిల్లల్ని కూడా కంటుంటే.. ఈమె మాత్రం ఇంకా వివాహానికి దూరంగానే ఉంది. ఈ నేపథ్యంలోనే గత కొన్ని సంవత్సరాలుగా ప్రముఖ నటుడు విజయ్ వర్మ (Vijay Varma) తో డేటింగ్ చేస్తోందని, అతడిని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతోంది అని అందరూ ఫిక్స్ అయిపోయారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం సినిమాలను కూడా ఆమె అంగీకరించడం లేదని అందరూ కామెంట్ చేస్తున్న నేపథ్యంలో సడన్గా తన బాయ్ ఫ్రెండ్ కి ఈమె బ్రేకప్ చెప్పేసినట్లు సమాచారం. అయితే ఈ విషయంపై తమన్నా క్లారిటీ ఇవ్వకపోయినా.. ఆమె ప్రవర్తన చూస్తే మాత్రం ఇదే నిజమనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Star Heroine: ఇంతలోనే అంత మార్పా.. ఏకంగా 3 మతాలు మారిన స్టార్ హీరోయిన్..!
అద్భుతం కోసం ఎదురుచూడకూడదు – తమన్నా..
ఇకపోతే ఇలాంటి సమయంలో తాజాగా తమన్నా పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. తమన్నా తన పోస్టులో జీవితంలో “అద్భుతం కోసం ఎప్పుడు ఎదురు చూడొద్దు..దాని బదులు మనమే ఆ అద్భుతాన్ని సృష్టించుకోవాలి” అంటూ తెలిపింది.ఈ కొటేషన్ తో పాటు తన స్నేహితులైన ప్రగ్యా కపూర్, మనీష్ మల్హోత్రా, రాషా థడానీ తో కలిసి దిగిన ఫోటోలను, వారితో పార్టీ చేసుకున్న ఫోటోలను కూడా షేర్ చేసింది. ఇక తమన్నా పెట్టిన ఈ పోస్ట్ చేసిన నెటిజన్స్ మాత్రం బ్రేకప్ బాధ నుంచి బయటపడేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు ఈమెలో ఈ మార్పు వచ్చింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా తమన్నా.. విజయ్ వర్మ బ్రేకప్ స్టోరీ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది అని చెప్పవచ్చు.
తమన్నా కెరియర్..
ఒక తమన్నా సినిమాల విషయానికి వస్తే.. గత కొన్ని రోజులుగా స్పెషల్ సాంగ్స్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె.. ఇప్పుడు ఓదెల (Odela ) సీక్వెల్ ‘ఓదెల 2’లో నటిస్తోంది. ఇక భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమాలో లేడీ అఘోరీ గా నటిస్తోంది తమన్నా..
ఈ సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. దీనికి తోడు ఈ సినిమా తర్వాత మరో సినిమాకి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. మరి ఈ సినిమా ఫలితాన్ని బట్టి ఆమెకు ఆఫర్లు కూడా వరుసగా వస్తాయని నెటిజన్స్ భావిస్తున్నారు. మరి ఈ సినిమా తర్వాత తమన్నా ఎలాంటి కెరియర్ ను అనుభవిస్తుందో చూడాలి.