Sankranthiki Vasthunam: రమణ గోగుల.. ఈ పేరు ఇప్పటి జనరేషన్ కు తెలియదేమో కానీ.. అప్పట్లో ఆయన సాంగ్స్ కు, వాయిస్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. లవ్ సాంగ్ అయినా.. రొమాంటిక్ సాంగ్ అయినా.. ర్యాప్ అయినా.. టైటిల్ సాంగ్ అయినా రమణ గోగుల పాడాడు అంటే అది హిట్ అవ్వాల్సిందే. ముఖ్యంగా ఆయన గాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. బద్రి లో ఏ చికితా, బంగాళాఖాతంలో నువ్వుంటే సాంగ్స్.. తమ్ముడులో ట్రావెలింగ్ సోల్జర్, ప్రేమంటే ఇదేరా లో నాలో ఉన్న ప్రేమ.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన పాడిన హిట్ సాంగ్స్ చాలా ఉన్నాయి.
2013 లో 1000 అబద్దాలు సినిమా తరువాత రమణ గోగుల ఇండస్ట్రీలో కనిపించలేదు. ఆ తరువాత కొత్త మ్యూజిక్ డైరెక్టర్ స్ వచ్చారు. కొత్త గాత్రాలు వచ్చాయి. కొత్త సింగర్స్.. తమ వాయిస్ తో మెస్మరైజ్ చేశారు. ఈ మధ్యకాలంలో దర్శకనిర్మాతలు కూడా కొత్త సింగర్స్ వైపే మొగ్గు చూపుతున్నారు కానీ, సీనియర్ సింగర్స్ ను పట్టించుకోవడం లేదు. కేవలం సింగర్స్ విషయంలోనే కాదు మ్యూజిక్ డైరెక్టర్స్ విషయంలో కూడా ఇదే ట్రెండ్ నడుస్తోంది.
Coolie: కూలీ రిలీజ్ డేట్ ఫిక్స్.. బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావ్ లోకేష్.. ?
గతంలో మణిశర్మ ఇదే విషయమై ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇండస్ట్రీలో సీనియర్లను కూడా పట్టించుకోవాలని ఆయన చెప్పుకొచ్చారు. ఇక యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తాజాగా తన సినిమా కోసం సింగర్ రమణ గోగులను సెలెక్ట్ చేసుకోవడం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న చిత్రం సంక్రాంతికి వస్తున్నాం.
దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో వెంకీ మామ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షీ చౌదరి నటిస్తున్నారు. పేరుకు తగ్గట్టే ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి మొదటి సాంగ్ ను రిలీజ్ చేయడానికి మేకర్స్ ముహూర్తం ఖరారు చేశారు.
VD12: రౌడీ హీరో కోసం రంగంలోకి నందమూరి హీరో.. ఇది అస్సలు ఊహించలేదే..?
గోదారి గట్టుమీద రామ చిలకవే.. గోరింట ఎట్టుకున్న చందమావవే అంటూ సాగే ఈ సాంగ్ ను రిలీజ్ చేస్తున్నట్లు ప్రోమో రిలీజ్ చేశారు. అయితే ఈ సాంగ్ ను ఎవరు పాడబోతున్నారు అనేది ఈ ప్రోమోలో చూపించారు. చాలా స్పెషల్ సాంగ్ కాబట్టి చాలా స్పెషల్ సింగర్ తో పాడిద్దామని అనిల్ రావిపూడి, మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ తీవ్రంగా ఆలోచించి రమణ గోగులను సెలెక్ట్ చేసినట్లు చూపించారు.
ఇక రమణ గోగుల కెరీర్ ను మొదలుపెట్టిందే.. వెంకీ మామ సినిమా అయినా ప్రేమంటే ఇదేరాతో.. మళ్లీ 18 ఏళ్ల తరువాత ఈ సినిమాకోసం రమణ గోగులను దింపుతున్నారు. త్వరలోనే ఈ సాంగ్ ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. మరి రమణ గోగుల తన వాయిస్ తో ఈ జనరేషన్ ను మెప్పిస్తాడో..లేదో చూడాలి.
Excited to have @RamanaGogula garu on board to sing for Victory @VenkyMama garu after 18 long years for our #SankranthikiVasthunam First Single 😍
It's going to be a special song with #BheemsCeciroleo's terrific composition and @bhaskarabhatla garu's amazing lyrics 👌👌
Coming… pic.twitter.com/roOY5tIiQy
— Anil Ravipudi (@AnilRavipudi) November 13, 2024