BigTV English

Trump WhiteHouse: ఓటమిని ట్రంప్ అంగీకరించడా?.. 2020లో వైట్ హౌస్‌ని వీడి తప్పుచేశానని వివాదాస్పద వ్యాఖ్యలు!

Trump WhiteHouse: ఓటమిని ట్రంప్ అంగీకరించడా?.. 2020లో వైట్ హౌస్‌ని వీడి తప్పుచేశానని వివాదాస్పద వ్యాఖ్యలు!

Trump WhiteHouse | అమెరికాలో నవంబర్ 5న జరుగుబోయే అధక్ష ఎన్నికలు ఉత్కంఠంగా మారాయి. డెమోక్రాట్స్, రిపబ్లికన్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. దేశవ్యాప్తంగా జరిగిన సర్వేలలో వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ కంటే మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాస్త ముందంజలో ఉన్నారు. కానీ ఇద్దరి మధ్య ఓటింగ్ శాతంలో స్వల్స తేడా మాత్రమే ఉంది. పైగా కొన్ని రాష్ట్రాలలో కమలా హ్యారిస్ ఎక్కువ మద్దతుదారులున్నారు. ఈ విషయంపై ట్రంప్ తాజాగా వివాదాస్ప వ్యాఖ్యలు చేశారు. తాను ఓటమిని అంగీకరించనని పరోక్షంగా చెప్పారు.


‘లైక్లీ అమెరికన్ ఓటర్స్ ఫ్రమ్ అట్లాస్ ఇంటెల్’ అనే సంస్థ చేసిన సర్వేలో.. నార్త్ కరోలీనా, జార్జియా, ఆరిజోనా, నెవాడా, విస్‌కాన్సిన్, మిచిగాన్, పెన్సిల్వేనియా రాష్ట్రాల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి అయిన డొనాల్డ్ ట్రంప్ తన ప్రత్యర్థి కమలా హ్యారిస్ కంటే ముందంజలో ఉన్నారు. సర్వే ప్రకారం ఆరిజోనా రాష్ట్రంలో ట్రంప్ నకు 52.3 శాతం మంది మద్దతు తెలిపితే.. కమలా హ్యారిస్‌కు 45.8 శాతం మంది జై కొట్టారు. అలా నెవాడా లో ట్రంప్ – 51.2 శాతం, హ్యారిస్ – 46 శాతం ఉండగా.. నార్త కరోలినాలో ట్రంప్ – 50.5 శాతం, హ్యరిస్ – 47.1 శాతం ఉంది.

అదేవిధంగా జార్జియాలో ట్రంప్ – 50.5 శాతం, హ్యరిస్ – 47.1 శాతం
మిచిగాన్ లో ట్రంప్ – 49.7 శాతం, హ్యరిస్ – 48.2 శాతం
పెన్సిల్వేనియాలో ట్రంప్ – 49.6 శాతం, హ్యరిస్ – 47.8 శాతం
విస్‌కాన్సిన్ లో ట్రంప్ – 49.7 శాతం, హ్యరిస్ – 48.5 శాతం


Also Read: కెనడాలో హిందు దేవాలయంపై దాడి.. భక్తులపై అటాక్ చేసిన సిక్కు కార్యకర్తలు

మొత్తంగా చూస్తే.. ట్రంప్ మద్దతుదారులు 49 శాతం ఉంటే.. హ్యారిస్ కు ఓటు వేస్తమన్న వారు 47.2 శాతం ఉన్నట్లు సర్వేలో తేలింది. అంటే కేవలం 2 శాతం తేడా ఉండడంతో ఈ రాష్ట్రాల్లో ఎన్నికల పరిణామాలే కీలకంగా మారాయి. 2020లో జరిగిన అమెరికా ఎన్నికల్లో అట్లాస్ ఇంటెల్ సంస్థ చేసిన సర్వే అంచనాలే ఫలితాల్లో కనిపించడంతో ఆ సర్వేకు క్రెడిట్ ఉంది. పైగా ఈ సర్వే నవంబర్ 3 వరకు జరగడంతో ఇదే ప్రజల చివరి అభిప్రాయం అని అట్లాస్ ఇంటెల్ సంస్థ పేర్కొంది.

ఎన్నికల ప్రచారంలో ట్రంప్ పై హత్యాయత్నం జరగడం.. ప్రస్తుత అధ్యక్షుడు ప్రచారం మధ్యలో నుంచి పోటీ నుంచి విరమించుకోవడంతో ప్రజాభిప్రాయం మారిందని అట్లాస్ ఇంటెల్ సంస్థ పేర్కొంది.

Also Read: 29 మంది పిల్లలకు ఉరిశిక్ష!.. జైల్లో ఆహారం ఇవ్వకుండా వేధింపులు..

ఈ కీలక రాష్ట్రంలో ట్రంప్ వెనుకంజ
అమెరికా లో రిపబ్లికన్ పార్టీ కంచుకోట అని లోవా రాష్ట్రానికి పేరుంది. 2016, 2020 ఎన్నికల్లో ఈ రాష్ట్రం నుంచి ట్రంప్ భారీ మెజారిటీతో గెలుపొందారు. కానీ ఈ రాష్ట్రంలో ప్రస్తుతం కమలా హ్యారిస్ హవా నడుస్తోందని సెల్జర్ సంస్థ చేసిన పోల్ సర్వేలో తేలింది.

సెల్జర్ సంస్థ శనివారం నవంబర్ 2 న విడుదల చేసిన సర్వే ఫలితాల్లో కమలా హ్యారిస్ కు 47 శాతం ఓటర్ల మద్దతు ఉంటే.. ట్రంప్ నకు 44 శాతం మంది ప్రజలు జైకొట్టారు. అక్టోబర్ 28 నుంచి 31 మధ్య జరిగిన ఈ సర్వేలో 808 మందిని సెల్జర్ సంస్థ వారి అభిప్రాయం కోరింది.

అయితే డొనాల్డ్ ట్రంప్ ఈ సర్వే ఫలితాలను ఒప్పుకోలేదు. మరో సర్వేలో తనకు అనుకూలంగా ప్రజలు ఉన్నట్లు తేలిందని ప్రకటించారు. ఒకవేళ ఎన్నికల్లో తనకు అనుకూలంగా ఫలితాలు రాకపోతే ఆ ఫలితాలను తాను అంగీకరించేది లేదని వివాదాస్పదంగా మాట్లాడారు. ఆదివారం ఆయన పెన్సిల్వేనియాలో జరిగిన ర్యాలీ ట్రంప్ మాట్లాడుతూ.. 2020 అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై అనుమానం వ్యక్తం చేశారు. ఆ ఎన్నికల్లో జో బైడెన్ విజయం సాధించడం అంటేనే మోసం జరిగిందన్నారు. తాను ఆ సమయంలో వైట్ హౌస్ ని వదిలి తప్పు చేశానని చెప్పారు.

2020 అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల్లో మోసం జరిగిందని ఇంతకు ముందు చాలా కోర్టుల్లో ట్రంప్ కేసులో వేశారు. కానీ ఆ కేసుల్లో ఆయనకు వ్యతిరేకంగా తీర్పులు వచ్చాయి.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×