YS Sharmila: మాజీ సీఎం జగన్ ను చెల్లెలు, కాంగ్రెస్ పార్టీ అద్యక్షురాలు వైఎస్ షర్మిళ ఒక పట్టాన వదిలేలా లేరు. మొన్నటి వరకు ఓ రేంజ్ లో జగన్ పై విమర్శలు చేసిన షర్మిళ, ఇప్పుడు ఏకంగా జగన్ పై చర్యలెక్కడ అంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. మీరు మీరు ఒకటే కాబట్టి, జగన్ పై చర్యలు తీసుకోరా అంటూ ఏకంగా సీఎం చంద్రబాబునే ప్రశ్నిస్తున్నారు. దీన్ని బట్టి సెకీ ఒప్పందంలో జగన్ అవినీతికి పాల్పడ్డారో లేదో కానీ షర్మిళ మాత్రం ఆ ఒప్పందం లక్ష్యంగా తన అన్నను గురి పెడుతున్నారు.
తాజాగా ఏపీ కాంగ్రెస్ పార్టీ అద్యక్షురాలి హోదాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ.. షర్మిళ ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో జగన్ పై చర్యలు తీసుకోవాలని, లేకుంటే మీరు కూడా మద్దతు పలికినట్లేనంటూ షర్మిళ చెప్పడం విశేషం. ఇటీవల సెకీ ఒప్పందంపై వైసీపీకి చెందిన విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. మాజీ సీఎం జగన్ తప్పు చేస్తే సెకీ ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేయలేదో చెప్పాలంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇదే ప్రశ్నతో షర్మిళ, కూటమి ఎదురు ప్రశ్న వేశారు.
విజయసాయి రెడ్డి చెప్పినట్లుగా సెకీ ఒప్పందాన్ని సీఎం చంద్రబాబు ఎందుకు రద్దు చేయలేదో చెప్పాలన్నారు. ప్రభుత్వం మౌనంగా ఉందంటే, అదానీ ఒప్పందం అక్రమం కాదని ఒప్పుకున్నారా ? సక్రమం కాబట్టే రద్దు చేయలేదని చెప్పకనే చెప్తున్నారా అంటూ ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజకీయం తప్ప.. మీ ఆరోపణల్లో నిజం లేదంటారా, పోనీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది కూడా అంత తూచ్ కిందనేనా ? అదానీ జగన్ నే కాదు మిమ్మల్ని కూడా కొన్నారని చెప్తారా అంటూ సీరియస్ కామెంట్స్ చేశారు.
ముడుపులు వాళ్ళకేనా.. మీకు అందాయనే నిజం అంగీకరిస్తున్నారా సీఎం గారూ అంటూ షర్మిళ అనడం విశేషం. ఇదేనా బాబు గారు.. మీ 40 ఏళ్ల రాజకీయం ? 1750 కోట్ల లంచాలు తీసుకొని, రాష్ట్ర ప్రజల నెత్తిన 1.50 లక్షల కోట్ల భారం వేసి, అదానీకి మేలు చేసే డీల్ పై మీరు మౌనంగా ఉన్నా… కాంగ్రెస్ పార్టీ మాత్రం ఉద్యమాన్ని ఆపదని హెచ్చరించారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం, న్యాయబద్ధంగా కోర్టు మెట్లు ఎక్కడానికి కూడా సిద్ధమని, ఇప్పటికైనా డీల్ రద్దు చేసి.. రూ.1750 కోట్ల ముడుపుల పై దర్యాప్తుకు ఆదేశాలు ఇవ్వాలని షర్మిళ డిమాండ్ చేశారు.
జగన్ తప్పు చేస్తే సెకీ ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేయలేదో చెప్పాలంటున్న విజయసాయి రెడ్డి వ్యాఖ్యలకు చంద్రబాబు ఏమంటారు?: వైఎస్ షర్మిల
మౌనంగా ఉంటున్నారు అంటే అదానీ ఒప్పందం అక్రమం కాదని ఒప్పుకున్నారా?
సక్రమం కాబట్టే రద్దు చేయలేదని చెప్పకనే చెప్తున్నారా?
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు… pic.twitter.com/Psf0vFb2Br
— BIG TV Breaking News (@bigtvtelugu) December 16, 2024