TGPSC Group-1 Merit List: గ్రూప్-1 ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇది బిగ్ అలెర్ట్. తెలంగాణ రాష్ట్రంలో 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి టీజీపీఎస్సీ 1:1 నిష్పత్తిలో అభ్యర్థుల మెరిట్ జాబితాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) విడుదల చేసింది. అఫీషిల్ వెబ్ సైట్ లో మెరిట్ జాబితాను ప్రకటించింది.
1:1 నిష్పత్తిలో మెరిట్ జాబితా..
అయితే, టీజీపీఎస్సీ గతంలో ఉద్యోగాలను భర్తీ ప్రక్రియలో 1:2 లేదా 1:3 నిష్పత్తిలో మెరిట్ జాబితాను విడుదల చేసింది. కానీ ఈ సారి గ్రూప్-1 సర్వీసుల ఉద్యోగాలను భర్తీ చేసే క్రమంలో 1:3 కి బదులుగా నేరుగా 1:1 నిష్పత్తిలో అభ్యర్థులను పిలిచింది. ఏప్రిల్ 16, 17, 19, 21 తేదీల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందని నిన్ననే టీజీపీఎస్సీ వెల్లడించిన విషయం తెలిసిందే. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు.. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు నాంపల్లిలోని సురవరం ప్రతాప రెడ్డి విశ్వవిద్యాలయం (పూర్వపు పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం) లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరగనుంది.
ఏప్రిల్ 22న రిజర్వ్ డే..
అయితే, ఈ గ్రూప్-1 పోస్టుల భర్తీ ప్రక్రియకు ఏప్రిల్ 22 న రిజర్వ్ డే గా టీజీపీఎస్సీ ప్రకటించింది. నిర్ణీత టైం లోపల అభ్యర్థులకు ఒరిజినల్ సర్టిఫికెట్లు అందుబాటులో లేకుంటే.. ఈ నెల 22 న మార్నింగ్ 10:30 నుంచి సాయంత్రం 5:30 వరకు హాజరు కావొచ్చు. 1:1 మెరిట్ జాబితాలో ఉన్న వారందరూ ఈ నెల 15 నుంచి 22 వ తేదీ వరకు సాయంత్రం 5 గంటల వరకు వెబ్ ఆప్షన్లను నమోదు చేయాలని టీజీపీఎస్సీ అధికారాలు పేర్కొన్నారు.
అవసరమైన ఫామ్‌లను వెబ్ సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి..
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల్లో మెరిట్ ర్యాంక్, మల్టీ జోన్లు, రిజర్వేషన్ల వారీగా ఉద్యోగాలను పరిగణలోకి తీసుకొని 1:1 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేశామని.. సంబంధించిన జాబితాను వెబ్ సైట్లో పొందుపరిచినట్టు టీజీపీఎస్సీ అధికారులు పేర్కొన్నారు. మెరిట్ జాబితాలో ఉన్న అభ్యర్థులు ఏప్రిల్ 10 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం అవసరమైన ఫామ్ లను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. సెలెక్ట్ అయిన వారు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు, అలాగే వాటి రెండు సెట్ల జిరాక్స్ పత్రాలను తీసుకురావాలని చెప్పారు.
వెరిఫికేషన్ కు అటెండ్ కాకపోతే..?
నిర్ణీత సమయం లోపల, అలాగే రిజర్వుడే (ఏప్రిల్ 22) రోజున సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు రాని అభ్యర్థులకు మళ్లీ సమయం ఇవ్వబోమని తేల్చి చెప్పారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు ఎవరైనా అటెండ్ కాకపోయినా.. ఇతర కారణాల వల్ల అభ్యర్థి పోస్టు భర్తీకి అనర్హుడైనా.. ఆప్షన్లను నమోదు చేయకపోయినా.. వారి స్థానంలో తర్వాత ఉండే మెరిట్ అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు పిలుస్తాం అని టీజీపీఎస్సీ అధికారులు క్లారిటీ ఇచ్చారు.
NOTE: అభ్యర్థులు ఇప్పటి నుంచి ఒరిజినల్ సర్టిఫికెట్లను అందుబాటులో ఉంచుకొండి. అన్ని సర్టిఫికెట్లను రెండు సెట్లు జిరాక్స్ తీసుకోండి.