Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత పాన్ ఇండియా చిత్రాల్లో మాత్రమే నటిస్తున్నాడు. ఒక్కో మూవీతో ప్రపంచ రికార్డులను బ్రేక్ చేస్తూ వస్తున్నాడు. పౌరాణిక జానపద కథను, ఇతిహాసాన్ని ముందుకు నడిపించే సత్తా డార్లింగ్ ప్రభాస్ కి ఉందని నిరూపణ అయింది. యాక్షన్ సినిమాల్లో అదరగోడుతూ హాలీవుడ్ రేంజ్ కు చేరుకున్నాడు. ఈ మధ్య వచ్చిన రెండు సినిమాలతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. బాహుబలి తర్వాత మూడు సినిమాలు యావరేజ్ టాక్ ను అందుకున్నా కూడా జనాలకు ప్రభాస్ పై ఉన్న క్రేజ్ మాత్రం తగ్గలేదు. ప్రశాంత్ నీల్ `సలార్`లో ప్రభాస్ యాక్షన్ మోడ్ పీక్స్ ని టచ్ చేసింది. వరుస సినిమాల్లో అతడు సూపర్ పాన్ ఇండియన్ స్టార్ డమ్ ఎలా ఉంటుందో చూపించాడు. అయితే ప్రభాస్ ఇప్పుడు ఒక లెక్క ఇక ముందు ఒక లెక్క అంటూ నెక్స్ట్ మూవీ ల కోసం మాస్టర్ ప్లాన్ వేసినట్లు ఓ వార్త వినిపిస్తుంది. అందులో నిజమేంత ఉందో తెలియదు కానీ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషి అవుతున్నారు..
గత ఏడాది ప్రభాస్ కల్కి మూవీతో ప్రేక్షకులను పలకరించాడు.. ఆ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రధాన పౌరాణిక కథలు.. అడ్వెంచర్ థ్రిల్లర్ లకు ప్రభాస్ కేరాఫ్ అడ్రెస్ గా మారుతున్నాడని చర్చ సాగుతోంది. అతడు రోజు రోజుకు షైన్ అవుతున్నాడు. తన స్థాయిని పెంచుకునే ప్రాజెక్టుల కోసం ప్లానింగ్ మార్చుకున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేంటంటేప్రశాంత్ నీల్ తదుపరి ప్రభాస్‌తో కలిసి ఒక ఇతిహాస పౌరాణిక సినిమాకి పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. దీన్ని ప్రముఖ తెలుగు నిర్మాణ సంస్థలలో ఒకటి భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నట్లు ఓ వార్త వినిపిస్తుంది..
ఇక ముందు చేసే ప్రాజెక్టలపై శ్రద్ద తీసుకుంటున్నాడు ప్రభాస్ బిగ్ స్కేల్ పౌరాణికాలు, అడ్వెంచర్ థ్రిల్లర్ల కోసం ప్రభాస్ సిద్ధమవుతున్నాడు. అతడు ఇండియాలో బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ స్టార్ అనడంలో సందేహం లేదు. దీనిని తోపులం అని చెప్పుకునే ఖాన్ ల త్రయం కూడా అంగీకరించేందుకు వెనకాడటం లేదు.. సలార్ 2 తో పాటు బ్యాక్ టు బ్యాక్ పౌరాణిక చిత్రాల తో ప్రభాస్ తన క్రేజ్ ను ఇంకా పెంచుకొనే ప్రయత్నం చేస్తున్నాడని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇక ప్రభాస్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల తో ఫుల్ బిజీగా ఉన్నాడు. డైరెక్టర్ మారుతి దర్శకత్వం లో రాజా సాబ్ చేస్తున్నాడు. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే హను రాఘవపూడితో ఫౌజీ, సందీప్ రెడ్డి వంగా తో స్పిరిట్ అతడి స్థాయిని పెంచే సినిమాలుగా ప్రచారం ఉంది.. ఈ మూవీల తర్వాత కల్కి 2, సలార్ 2 మూవీలలో నటించనున్నాడు. ఆ తర్వాత హాలీవుడ్ లో ఓ మూవీ చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. అందులో నిజమేంత ఉందో తెలియాల్సి ఉంది..