Ram Charan : టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan ) త్రిపుల్ ఆర్ తర్వాత రేంజ్ పూర్తిగా మారిపోయింది.. ఆ తర్వాత ఆతను వరుసగా సినిమాలు చేస్తాడని అనుకున్నారు. కానీ రీసెంట్ గా గేమ్ చేంజర్ మూవీలో నటించాడు. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ ( Sankar ) కాంబినేషన్ లో ఈ మూవీ తెరకెక్కింది.. ఈ ఏడాది సంక్రాంతి సందర్బంగా ఈ మూవీ విడుదలైంది.. భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ బోల్తా కొట్టింది. డైరెక్టర్ స్టోరీని చూపించడలో తడపడ్డాడనే విమర్శలు అందుకున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్ నెక్స్ట్ ప్రాజెక్టు లపై ఫోకస్ పెట్టాడు. రెండు ప్రాజెక్టలకు సైన్ చేశాడు.. అయితే రామ్ చరణ్ ఓ మిస్టేక్ చేశాడంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అసలు విషయం ఏంటో ఒకసారి తెలుసుకుందాం..
మెగాస్టార్ వారసుడు గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కూడా తన టాలెంట్ తో ఒక్కో మూవీతో తన రేంజ్ పెంచుకుంటూ పోతున్నాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న ఈ స్టార్ హీరో ఇండస్ట్రీలో ఒక గొప్ప నటుడిగా ఎదిగే ప్రయత్నమైతే చేస్తున్నాడు. ఇక దానికి తగ్గట్టుగానే ‘త్రిబుల్ ఆర్’ సినిమాలో ఆయన పోషించిన పాత్రకు గాను ఆయనకు గొప్ప గుర్తింపు లభించడమే కాదు గ్లోబల్ స్టార్ ను చేసింది.. మరి ఇలాంటి రామ్ చరణ్ మగధీర సినిమా తర్వాత ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా ఎదుగుతాడు అంటూ చాలామంది చాలా అనుకున్నారు. కానీ అంతగా అవ్వలేక పోయాడు. దానికి అనేక కారణాలు ఉన్నాయని కొందరు చర్చిస్తున్నారు.. మగదీర మూవీ తర్వాత ఆయన సినిమాలు అంతగా చెప్పుకొదగ్గ సినిమాలు కాదు.
Also Read:అల్లు అర్జున్ సినిమాలో స్టార్ హీరో .. ఫ్యాన్స్ కు మెంటలెక్కించే న్యూస్..!
రోటిన్ కథలతో రెగ్యులర్ షూటింగ్ లు చెయ్యడం వల్లే ఆయన సినిమాలు ఎక్కువగా ఆకట్టుకోలేక పోయాడు. సక్సెసులైతే వచ్చాయి. కానీ ఆయన సినిమాల మీద ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించలేకపోయారు. ఆ తర్వాత చేసిన ప్రతి మూవీ మెప్పించింది. కానీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా బ్లాక్ బాస్టర్ అవ్వలేదు. రామ్ చరణ్ కొత్తదనాన్ని స్వీకరిస్తూ కొత్త సినిమాలు చేస్తూ కొత్త జానర్ లో మూవీస్ చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ వచ్చాడు. సినిమాలకి ఎక్కువ గుర్తింపు లభించేది. ఇక ప్రస్తుతం ఆయన బుచ్చి బాబు డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ రికార్డులను కొల్లగొట్టాలనే ప్రయత్నంలోనే తను ఉన్నట్టుగా తెలుస్తోంది. గేమ్ చేంజర్ మూవీ తో భారీ డిజాస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు. రామ్ చరణ్ తన తదుపరి సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఆయన లాంటి స్టార్ హీరో ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మరొకరు లేరనేది వాస్తవం. ఇక ఇప్పుడు బుచ్చిబాబుతో ఓ మూవీ చేస్తున్నాడు. ఆ తర్వాత సుకుమార్ తో మూవీ చేస్తున్నాడు. చూడాలి ఏ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందో..