BigTV English

Allu Arjun: అల్లు అర్జున్ సినిమాలో స్టార్ హీరో .. ఫ్యాన్స్ కు మెంటలెక్కించే న్యూస్..!

Allu Arjun: అల్లు అర్జున్ సినిమాలో స్టార్ హీరో .. ఫ్యాన్స్ కు మెంటలెక్కించే న్యూస్..!

Allu Arjun: స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గత ఏడాది పుష్ప 2 మూవీతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.. 1870 కోట్ల కలెక్షన్స్ ను వసూల్ చేసింది. ఈ మూవీ తర్వాత ఏ డైరెక్టర్ సినిమా చేస్తాడా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అయితే గతంలో త్రివిక్రమ్ తో సినిమా చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు అట్లీ కాంబినేషన్ లో మూవీ రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈమేరకు స్క్రిప్ట్ ని కూడా సిద్ధం చేసేసాడట అట్లీ. అయితే ఈ సినిమా ఒక క్రేజీ మల్టీస్టార్రర్ గా మారే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు.. ఈ వార్తతో ఇప్పుడు మరో కోణంలో చర్చ జరుగుతుంది.. మల్టీ స్టారర్ మూవీ అంటే మరి ఎవరితో సినిమా ఉంటుందో అని సోషల్ మీడియాలో చర్చమొదలైంది. తాజాగా ఈ మూవీ గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఈ మూవీలో తమిళ స్టార్ హీరో నటించబోతున్నాడుంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అందులో నిజమేంత ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..


పుష్ప 2 మూవీ తర్వాత అల్లు అర్జున్ అట్లీ తో మూవీ చేయబోతున్నాడని ఆల్మోస్ట్ ఫిక్స్ అయ్యింది. ముందుగా అట్లీ రజినీ, సల్మాన్ తో మల్టీ స్టారర్ మూవీ చేయబోతున్నారని ఆ మధ్య వార్తలు వినిపించాయి. వారిద్దరి కోసమే స్టోరీని రాసుకున్నడట.. కానీ అల్లు అర్జున్ ఈ కథ కావాలని పట్టుబట్టడంతో, ఆయన షూటింగ్ కి సిద్ధంగా ఉండడంతో అల్లు అర్జున్ కి షిఫ్ట్ అయ్యిందని టాక్.. అంతేకాదు అల్లు అర్జున్ కు సల్లూ భాయ్ ఆల్ ది బెస్ట్ చెప్పాడని ఫిలిం నగర్ లో టాక్.. అట్లీ తెరకెక్కించాలని అనుకున్న మల్టీస్టార్రర్ లో సల్మాన్ ఖాన్ కి బదులుగా అల్లు అర్జున్ వచ్చి చేరాడు. రజినీకాంత్ కూడా అల్లు అర్జున్ తో కలిసి నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కోలీవుడ్ మీడియా నుండి అందుతున్న సమాచారం. ఈ స్టోరీ ప్రకారం అల్లు అర్జున్ కు తండ్రిగా ఉండబోతున్నాడు. ఆయన పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండబోతుందట..

ఇదిలా ఉండగా.. ఈ మూవీలో మరో తమిళ హీరో శివ కార్తికేయన్ కూడా కీలకపాత్రలో నటించిన ఉన్నాడని సమాచారం. రీసెంట్ గానే ‘అమరన్’ చిత్రంతో 350 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి స్టార్ హీరోల లీగ్ లోకి అడుగుపెట్టిన శివ కార్తికేయన్, ఇప్పుడు ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో నటిస్తున్నాడని వస్తున్న వార్తల్లో ఎంత నిజముందో తెలియదు కానీ ఈ కాంబో సెట్ అయితే మాత్రం ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులు హాలీవుడ్ రేంజ్కి వెళ్లడం పక్కనే ఫాన్స్ ఖుషి అవుతున్నారు. ఈ ఉగాది లోపు ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు బయటకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అనిరుద్ ఈ చిత్రానికి సంగీతం అందించబోతున్నాడట.. ఏడాదిలోనే షూటింగ్ మొదలుపెట్టి ఏడాది చివర్లో సినిమాను రిలీజ్ చెయ్యాలని భావిస్తున్నాడట అల్లు అర్జున్.. ఆ తర్వాత త్రివిక్రమ్ తో మూవీ చేయబోతున్నాడు…


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×