BigTV English

Prabhas – Prashanth Varma Movie : ప్రభాస్ మూవీకి క్రేజీ టైటిల్… ప్రశాంత్ వర్మ స్టైలే వేరప్పా

Prabhas – Prashanth Varma Movie : ప్రభాస్ మూవీకి క్రేజీ టైటిల్… ప్రశాంత్ వర్మ స్టైలే వేరప్పా

Prabhas – Prashanth Varma Movie : ‘హనుమాన్’ మూవీతో పాన్ ఇండియా డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ (Prashanth Varma) నెక్స్ట్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) తో సినిమా చేసే అద్భుతమైన అవకాశాన్ని దక్కించుకున్నారనే రూమర్ చక్కర్లు కొడుతుంది. తాజాగా ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి, అభిమానులు ఎగిరి గంతేసే అప్డేట్ వచ్చేసింది. ఈ మూవీకి టైటిల్ ని ఫిక్స్ చేశారనేది ఆ అప్డేట్ సారాంశం. ఇంతకీ ప్రభాస్ మూవీకి ఏ టైటిల్ ని ఫిక్స్ చేశారు? అనే వివరాల్లోకి వెళ్తే…


ప్రభాస్ మూవీకి ఇంట్రెస్టింగ్ టైటిల్

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్… డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని గత కొన్ని రోజులుగా టాలీవుడ్ కోడై కూస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందునున్న ఈ మూవీని మహాభారతంలోని బకాసురుడి కథ ఆధారంగా తెరకెక్కించబోతున్నారని టాక్ నడుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీకి కథకు తగ్గట్టుగానే ‘బకా’ (BAKA) అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. బకాసురుడు మూవీ కాబట్టి ‘బకా’ అనే ఈ టైటిల్ షార్ట్ గా, సినిమాకు రిలేటెడ్ గా ఉంటుందని మేకర్స్ ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఈ మూవీ ప్రశాంత్ వర్మ సినిమాలో భాగంగా ఉండబోతుందని, ఇప్పటివరకు రిలీజ్ అయిన మైథలాజికల్ సినిమాలు అన్నింటి కంటే ఇది చాలా డిఫరెంట్ గా ఉండబోతుందని అంటున్నారు.


హీరోనే కాదు టైటిల్ కూడా ఛేంజ్ 

నిజానికి ప్రశాంత్ వర్మ ముందుగా ఈ ప్రాజెక్టును బాలీవుడ్ స్టార్ రన్వీర్ సింగ్ తో కలిసి చేయాలనుకున్నారు. ‘హనుమాన్’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్టు కాగానే ఆయనను సంప్రదించి, ప్రశాంత్ వర్మ స్క్రిప్ట్ కూడా వివరించారు. టెస్ట్ లుక్ కూడా పూర్తి అయ్యిందని వార్తలు వచ్చాయి. కానీ అంతలోనే క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా రన్వీర్ సింగ్ ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత ఈ ప్రాజెక్టులో రానాతో పాటు పలువురు స్టార్ హీరోలు నటించబోతున్నారని వార్తలు వినిపించాయి. కానీ ఎట్టకేలకు ఆయన ప్రభాస్ తో ఈ మూవీని ఫిక్సయినట్టు తెలుస్తోంది.

ఇక రన్వీర్ సింగ్ తో ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు, ఈ మూవీకి ‘బ్రహ్మ రాక్షస’ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. కానీ ఇప్పుడు ప్రభాస్ ప్రాజెక్టు లోకి అడుగు పెట్టాక ఈ మూవీకి ‘బకా’ అనే టైటిల్ ని మార్చారనే వార్త ఫిలింనగర్ సర్కిల్స్ లో వైరల్ అవుతుంది. ఈ విధంగా హీరోనే కాకుండా, మూవీకి టైటిల్ ని కూడా మార్చారు. ఇదిలా ఉండగా ఈ ప్రాజెక్టుపై త్వరలోనే అనౌన్స్మెంట్ రాబోతుందని అంటున్నారు. ఇక ఈ మూవీలో గ్రామం నుంచి బలిగా మనుషులని తీసుకునే బకాసురుడి ప్రస్థానం నుంచి మొదలుపెడితే, భీముడి చేతిలో ఆయన ఓడిపోయిన తీరు వరకు స్టోరీ ఉంటుందని అంటున్నారు. అయితే ఈ వార్తలపై క్లారిటీ రావాలంటే ప్రశాంత్ వర్మ అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇచ్చేదాకా వెయిట్ అండ్ సీ.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×