BigTV English

Odela 2 Movie : ‘ఓదెల 2’ కోసం తమన్నా ఎన్ని కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుందో తెలుసా?

Odela 2 Movie : ‘ఓదెల 2’ కోసం తమన్నా ఎన్ని కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుందో తెలుసా?

Odela 2 Movie : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ఓదెల 2.. లేడీ ఒరియేంటెడ్ గా తెరకేక్కిన ఈ మూవీలో తమన్నా గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్తగా కనిపించింది. నాగసాధువు గా ఇందులో కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 17వ తేదీన గ్రాండ్‌గా రిలీజైంది. డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వం పర్యవేక్షణ లో అశోక్ తేజ దర్శకత్వం వహించిన ఈ సినిమా లో వశిష్ట సింహ, హెబ్బా పటేల్, మురళీ శర్మ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. భారీ బడ్జెట్ తో నిర్మాతలు సంపత్‌ నంది టీమ్‌ వర్క్స్‌, మధు క్రియేషన్స్‌ నిర్మించారు. ఈ మూవీ థియేటర్లలోకి వచ్చిన మొదటి మూవీతోనే భారీ విజయాన్ని సొంతం చేసుకుందనే టాక్ వినిపిస్తుంది. ఈ మూవీకి తమన్నా ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..


తమన్నా రెమ్యూనరేషన్..?

గతంలో రిలీజ్ అయిన ఓదెల మూవీకి సీక్వెల్ గా ఈ మూవీ వచ్చింది. హీరోయిన్ తమన్నా హవా ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదు. కొంత కాలం పాటు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారు తమన్నా. ఆ మధ్యలో ఆమె నటించిన కొన్ని సినిమాలు ఫ్లాప్ కావడంతో కెరీర్ కాస్త డల్ అయింది. చాలా కాలం తర్వాత ‘జైలర్’, ‘స్త్రీ 2’ లోని ఐటెం సాంగ్స్ ఆమె కెరీర్ మళ్లీ ఊపందుకుంది. తాజాగా ఆమె ఓ సినిమా కోసం రూ 2 కోట్లు తీసుకుంటున్నారని టాక్. అంటే ఓదెల2 కూడా రెండు కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకున్నారని టాక్.. ఇక ముందుకు ఆమె రెమ్యూనరేషన్ పెంచే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.


Also Read : పవన్ కళ్యాణ్ ‘ఓజీ ‘ కష్టమే.. మరోసారి వాయిదా..?

స్టోరీ విషయానికొస్తే.. 

ఊరుని పట్టి పీడిస్తున్న ప్రేతాత్మ ను దైవాంశ అండతో ఓ నాగసాధువు ఎలా కాపాడిందన్నదే సినిమా. ఓవరాల్ గా చూస్తే మూవీలో హింస ఎక్కువగా డామినేట్ చేసిందనే చెప్పాలి. ప్రత్యేకించి ప్రధమార్థం లో తిరుపతి ప్రేతాత్మ మహిళల పై దాడి చేసే సన్నివేశాలు మితిమీరిన హింసతో ఉన్నాయి. ఊరికి సాయం చేసేందుకు నాగ సాధువు భైరవి ఎంట్రీతో ఇంటర్వెల్ పడుతుంది. ఆ తర్వాత స్టోరీ భయంకరంగా కీలకంగా ఉంటుంది. భైరవి నీడలో శివుడు కనిపించటంతో పాటు పతాక సన్నివేశాల లో శివుడు వచ్చే సీన్ సినిమాను కొంత మేరకు నిలబెట్టాయని చెప్పాలి.. ఈ భైరవిని కాపాడేందుకు శివుడు కదిలి రావడం సినిమాకు ప్లస్ అయ్యింది. కొన్ని సీన్లు మైనస్ అయ్యాయి.. కానీ పర్వాలేదు సినిమా రన్ అవుతుంది. కలెక్షన్స్ కూడా భారీగానే వస్తున్నాయి. మరి మూవీ ఎన్ని కోట్లు రాబడుతుందో చూడాలి.. మొదటి రోజు భారీగానే కలెక్షన్స్ ను రాబట్టింది. భయంకరమైన సీన్స్ ఉండటంతో జనాలు ఈ మూవీని చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దాంతో మూవీ భారీ విజయాన్ని అందుకునేలా కనిపిస్తుంది. మరి ఎన్ని కోట్లు ఫైనల్ గా రాబడుతుందో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×