Prabhas: సినీ పరిశ్రమలోకి ఎంటర్ అవ్వడం, అక్కడ సక్సెస్ సాధించడం అంత ఈజీ కాదని చాలామంది అనుకుంటూ ఉంటారు. గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టాలంటే టాలెంట్‌తో పాటు చాలా లక్ కూడా ఉండాలి అంటారు. అంతకంటే ముందుగా అసలు అవకాశాలు రావడం అనేది పెద్ద విషయంగా ఉండేది. కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి. ఈరోజుల్లో టాలెంట్ ఉన్నవారిని అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. సీనియర్ దర్శకులు, నిర్మాతలు సైతం కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయడానికి ముందుకొస్తున్నారు. ఆ లిస్ట్‌లో ప్రభాస్ కూడా యాడ్ అవ్వడం విశేషం. ప్యాన్ ఇండియా స్టార్ స్థాయిలో ఉండి కొత్తవారిని ఎంకరేజ్ చేయాలని ప్రభాస్ నిర్ణయించుకున్నాడు.
ఈ వెబ్‌సైట్‌కు వస్తే చాలు
ప్యాన్ ఇండియా స్టార్ అయినా కూడా కొత్త దర్శకులతో, యంగ్ టాలెంట్‌తో కలిసి పనిచేయడానికి ప్రభాస్ ఎప్పుడూ పెద్దగా ఆలోచించలేదు. తన కథ నచ్చిందంటే ఫ్లాప్ డైరెక్టర్స్‌కు కూడా ఛాన్స్ ఇవ్వడానికి వెనకాడడు. ఇప్పుడు అలాంటి ప్రభాస్ తానే స్వయంగా ముందుకొచ్చి రైటర్స్, డైరెక్టర్స్‌కు ఛాన్స్ ఇస్తా అంటున్నాడు. దానికి సంబంధించి తన సోషల్ మీడియాలో పోస్ట్ కూడా షేర్ చేశాడు. కథలు రాసేవాళ్లు, రాయాలనుకునేవాళ్లు తమలో టాలెంట్ ఉంటే ఈ ప్లా్ట్‌ఫార్మ్ తమకు అవకాశం ఇస్తుందని ఒక వెబ్‌సైట్‌ను షేర్ చేశాడు. అదే ‘ది స్క్రిప్ట్ క్రాఫ్ట్’ (The Script Craft).
Also Read: హైకోర్టులో అల్లు అర్జున్ కి ఊరట.. ఖుషీలో ఫ్యాన్స్..!
ఫ్రెండ్ కోసం ప్రభాస్ ప్రమోషన్
‘మీ కథను పంచుకోండి. ఈ ప్లాట్‌ఫార్మ్ ద్వారా ప్రపంచాన్ని ఇన్‌స్పైర్ చేయండి. ఇందులో రైటర్స్ తమ అక్షరాలకు ప్రాణం పోస్తే.. ఆడియన్స్ తమ కలను నిజం చేయడానికి ఓట్లు వేస్తారు. ఈ మూమెంట్‌లో జాయిన్ అవ్వండి’ అంటూ ప్రభాస్ (Prabhas).. ఒక వీడియోను పోస్ట్ చేశాడు. అంతే కాకుండా ‘ది స్క్రిప్ట్ క్రాఫ్ట్’ టీమ్‌కు విషెస్ కూడా తెలిపాడు. ఈ వినూత్న ఆలోచన ముందుగా ప్రభాస్ క్లోజ్ ఫ్రెండ్ అయిన ఉప్పలపాటి ప్రమోద్‌కు వచ్చింది. ఈ ఆలోచన మంచిదని, ఎంతోమంది కొత్త టాలెంట్‌ను ముందుకు తీసుకువెళ్తుందని ప్రభాస్ కూడా దీనిని ప్రమోట్ చేయడానికి ముందుకొచ్చాడు.
కష్టపడాల్సిన పనిలేదు
ఇప్పటికే ఎంతోమంది దర్శకులు, నిర్మాతలు కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తామని ఓపెన్‌గా అనౌన్స్‌మెంట్ ఇచ్చాడు. ప్రభాస్ చివరి సినిమా అయిన ‘కల్కి 2898 ఏడీ’ సమయంలో కూడా కొత్తవారిని అసిస్టెంట్ డైరెక్టర్స్‌గా తీసుకుంటామని నాగ్ అశ్విన్, వైజయంతి మూవీస్ ప్రకటించింది. నిజంగానే ఎంతోమంది కొత్తవారిని అసిస్టెంట్స్‌గా తీసుకొని వారికి సినిమాలోని క్రాఫ్ట్స్‌ను నేర్పించే బాధ్యత తీసుకున్నాడు నాగ్ అశ్విన్. ఇప్పుడు ప్రభాస్ కూడా స్వయంగా అదే పనిచేస్తున్నాడు. కథలు పట్టుకొని నిర్మాతల ఆఫీసుల చుట్టూ తిరిగి కష్టపడాల్సిన పనిలేకుండా ఒక వెబ్‌సైట్ ఓపెన్ చేసి అందులో మీ కథ చెప్తే చాలు.. మీ టాలెంటే మిమ్మిల్ని ముందుకు నడిపిస్తుంది. ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేసి మీ కథను ఎలా పంపించాలి అనే విషయాన్ని కూడా ప్రభాస్ షేర్ చేసిన వీడియోలో స్పష్టంగా వివరించారు.
Share your story, inspire the world on this platform, where writers bring their words to life and the audience votes to shape reality. Join the movement. Best wishes to the #TheScriptCraft team! – #Prabhas via Instagramhttps://t.co/AuedxNZowD @TSCWriters #Vaishnav… pic.twitter.com/u1VtrUSubN
— The Script Craft (@TSCWriters) November 6, 2024