The Rajasaab Movie : తెలుగులో ఉన్న పాన్ ఇండియా హీరోస్ ప్రభాస్ ఒకరు. ప్రభాస్ కెరియర్ ప్రస్తావన విషయానికి వస్తే బాహుబలి సినిమాకి ముందు బాహుబలి సినిమా తర్వాత అని చెప్పాలి. తెలుగులో అంత మార్కెట్ లేదు అనుకునే టైంలోనే దాదాపు ఐదేళ్లపాటు తన టైంను రాజమౌళి కోసం వెచ్చించి బాహుబలి సినిమా కోసం కేటాయించాడు. బాక్సాఫీస్ వద్ద బాహుబలి సినిమా ఎటువంటి రికార్డ్స్ క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో ఒక సినిమాకి ఇంత మార్కెట్ ఉంటుందని ఎవరూ ఊహించి ఉండరు. 1000 కోట్లకు పైగా ఆ సినిమా కలెక్షన్స్ వసూలు చేసింది. బాహుబలి సినిమా తర్వాత ఇప్పటివరకు ప్రభాస్ చేసిన ప్రతి సినిమా పాన్ ఇండియా స్థాయిలోనే విడుదలైంది. ఇప్పటివరకు ప్రభాస్ కెరియర్లో 1000కోట్లకు పైగా వసూలు చేసిన సినిమాలు రెండు ఉన్నాయి. ఇప్పుడు ప్రభాస్ నుంచి ఒక సినిమా వస్తుంది అని అంటే ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు అనడంలో అతిశయోక్తి లేదు.
ఇక రీసెంట్ గా కల్కి సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమా ఇప్పుడు జపాన్లో కూడా విడుదలకు సిద్ధమవుతుంది. జనవరి మూడో తారీఖున కల్కి సినిమా జపాన్ లో రిలీజ్ కానుంది. ఈ తరుణంలో దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా సినిమా ప్రమోషన్స్ కోసం జపాన్ లో తిరుగుతున్నారు. ఇక ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ప్రభాస్ రాజా సాబ్ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇదివరకే నిర్మాత విశ్వప్రసాద్ ఈ సినిమా గ్రాండ్ స్కేల్లో ఉండబోతుంది అని పలు ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పుకొచ్చారు. దీంతోపాటు ఇప్పటివరకు మారుతి తీసిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. మారుతి కెరియర్ లో ఇప్పటివరకు ఒక్క డిజాస్టర్ సినిమా అంటూ లేదు. ఆ నమ్మకం కూడా ప్రభాస్ అభిమానులు బాగా ఉంది.
ఇకపోతే మారుతి దర్శకత్వంలో రాబోతున్న రాజా సాబ్ సినిమా వాయిదా పడిపోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఇక రీసెంట్ గా ప్రభాస్ కాలికి గాయం అవ్వడంతో ఈ సినిమా షూటింగ్ కూడా పోస్ట్ పోన్ కానుంది. ఇక ప్రస్తుతం ప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వంలో కూడా ఒక సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమా సెకండ్ వరల్డ్ వార్ టైం లో జరిగే కథగా ఉండబోతున్నట్లు పలు సందర్భాల్లో హను చెప్పుకొచ్చాడు. ఈ సినిమాకు ఫౌజీ అనే టైటిల్ ఖరారు లో ఉంది. కానీ దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఇప్పటివరకు రాలేదు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన ఇమాన్వి నటిస్తోంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. హను రాఘవపూడి చేసే సినిమాలకు మాక్సిమం విశాల్ చంద్రశేఖర్ సంగీత దర్శకులుగా వ్యవహరిస్తారు. ఇకపోతే రాజా సాబ్ సినిమా పోస్ట్ పోన్ అవడంతో ఒక్కసారి కూడా చెప్పిన డేట్ కి రారు అని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతూనే ఉన్నారు.
Also Read : Neha Shetty In OG Movie : పవన్ కళ్యాణ్ సినిమాలోనేహాశెట్టి స్పెషల్ సాంగ్.?