South Indians Job Discrimination| దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని నోయిడాకు చెందిన ఒక కన్సల్టెన్సీ కంపెనీ ఇటీవల ఒక వివాదాస్పద ఉద్యోగ ప్రకటన చేసింది. ఈ ప్రకటన ప్రకారం.. దక్షిణది రాష్ట్రాలకు చెందినవారికి ఈ ఉద్యోగార్హత లేదు. ప్రముఖ జాబ్ పోర్టల్ లింక్డ్ ఇన్ లో వచ్చిన ఈ ఉద్యోగ ప్రకటనలో అర్హతలు చూసి నెటిజెన్లు మండిపడుతున్నారు. హిందీ మాట్లాడడం చాలా మంది దక్షిన భారతీయులకు బాగా తెలుసునని వాదిస్తున్నారు.
ఉద్యోగ ప్రకటనలో ఏ ముంది?
నోయిడాలో డేటా అనలిస్ట్ ఉద్యోగం కోసం ఇచ్చిన ప్రకటనలో అభ్యర్థులకు
– 4 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ (అనుభవం) ఉండాలి.
-క్రాస్ ఫంక్షనల్ టీమ్స్ తో, అందరు స్టేక్ హోల్డర్స్ తో కలిసి పనిచేసే యోగ్యత
– డేటా సొలుష్యన్స్ హై క్వాలిటీలో డెలివర్ చేసే బాధ్యతను నిర్వర్తించాలి
అయితే ఈ అర్హతలో పాటు చివర్లో ఒక వివాదాస్పద సూచన చేశారు. అదే ‘దక్షిణ భారతదేశానికి చెందిన అభ్యర్థులు ఈ ఉద్యోగానికి అర్హులు కారు’ అని.
ఎక్స్ లో కూడా ఈ ఉద్యోగ ప్రకటన చేశారు. అందులో అయితే స్పష్టంగా.. “దక్షిణ భారతీయులు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేయడానికి వీల్లేదు ” అని ట్వీట్ చేశారు.
సోషల్ మీడియాలో ఈ జాబ్ పోస్టింగ్ పై నెటిజెన్లు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ఈ పోస్ట్ చాలా వివక్ష పూరితంగా ఉందని చాలా మంది ఖండిస్తున్నారు. “ఉద్యోగాల కోసం అభ్యర్థులను ఎంపిక చేసుకునే క్రమంలో ప్రాంతీయపరంగా వివక్ష చూపడం ఏ మాత్రం సమర్థనీయం కాదు చాలా అసహ్యకరంగా ఉంది,” అని ఒక యూజర్ పోస్ట్ పెట్టారు.
Also Read: చిమ్నీలో చిక్కుకున్న క్రిస్మస్ శాంటా క్లాజ్.. పోలీసుల నుంచి తప్పించుకోబోయి..
మరొక యూజర్ అయితే.. “దక్షిణ భారతీయులు హిందీ అన్గళంగా మాట్లాడడం రాదని భావించి వారికి ఉద్యోగ అర్హత లేదని చెబుతున్నారు. ఈ ఉద్యోగంలో హిందో ఒక అవసరంగా చూపారు. నాకు తెలిసి ఆ ఉద్యోగంలో హిందీ మాట్లాడడం, రాయడం తెలిసి ఉండాలి. అందుకే దక్షిణ భారతీయుల దరఖాస్తు చేయవద్దని చెప్పారు. కానీ చివర్లో ఆ కండీషన్ వారు ఇవ్వకుండా ఉంటే బాగుండేది. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో కూడా హిందీ బాగా మాట్లాడే వారు, రాసే వారు ఉన్నారనేది నా అభిప్రాయం.” అని కామెంట్ చేశాడు.
ఈ ఉద్యోగం ప్రకటనపై చాలా మంది దక్షిన భారతీయులు స్పందించారు. వీరిలో ఒక యూజర్ కామెంట్ చేస్తూ.. “కేరళకు చెందిన వారు చాలామంది హిందీ చాలా బాగా మాట్లాడుతారు. పాఠశాలలో హిందీ చదువుకోవడం వల్లే వారు భాషపై అవగాహన ఉంది. అందుకే ఇలాంటి ప్రకటన చేయడం ఏ మాత్రం సమర్థనీయం కాదు. మిగతా రాష్ట్రాల గురించి నాకు తెలియదు. కానీ కేరళకు చెందిన చాలామంది హిందీలో మాట్లాడుతూ.. ఉత్తరాది రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ” అని రాశాడు.