Prabhas : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ ఏడాది కల్కి మూవీతో ప్రేక్షకులను పలకరించిన ఈయన భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.. ప్రస్తుతం రాజా సాబ్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ప్రభాస్ నటించిన బాహుబలి సిరీస్ సినిమాలతో తెలుగు సినిమాల సత్తా ప్రపంచ వ్యాప్తంగా తెలిసింది.. అప్పటి నుంచి పాన్ ఇండియా మూవీలను తెరకేక్కిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీ మార్కెట్ అనేది ప్రపంచం మొత్తం విస్తరించేలా చేశాడు ప్రభాస్.. ఆ తర్వాత అదే కోవలో ఆయన కొనసాగుతూ వస్తున్నారు. ఆయన ఇండస్ట్రీకి ఎంత పేరు తెచ్చారో ఆ సినిమా కోసం అంతగా కష్టపడుతూ ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ కు కొన్ని రకాల అనారోగ్య సమస్యలు రావడానికి కారణం ఇదే అంటూ ఓ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది.
ఈ మధ్య కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా ప్రభాస్ ఇబ్బంది పడుతున్నారన్నా విషయం తెలిసిందే. ఆ సమస్యలు రావడానికి కారణం ఆయన బాహుబలి టైంలో చేసిన పొరపాటే అంటున్నారు. బాహుబలి సినిమాలో ప్రభాస్ కటౌట్ చూస్తే ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ వస్తాయి. ఆయన ఆ కటౌట్ రావడానికి ఎంతో కష్టపడ్డారట. ప్రతిరోజు డైట్ మెయింటైన్ చేస్తూ ఎక్సర్సైజ్ చేశారట. అయితే సినిమా రెండు పార్ట్ లుగా వచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ భారీ సక్సెస్ ను అందుకోవడానికి కారణం జక్కన్న. ప్రతిరోజు డైట్ మెయింటెన్ చేయిస్తూ తన బాడీని ఒక షేపులోకి తీసుకువచ్చిన రాజమౌళి ఈ సినిమాల తర్వాత వదిలేసాడు.
ప్రభాస్ డైట్ మైంటైన్ చేయడం వీలు కాలేదు. ఇంకేముంది తన బాడీలో చాలావరకు కాంప్లికేషన్స్ వచ్చాయట. మళ్లీ మునుపటిలా బాడీని పొందడానికి ఆయన తరచూ విదేశాలకు వెళ్లి చికిత్స తీసుకుంటున్నారట.. తన బాడీ ని తను పొందడానికి చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడిందంటూ మరి కొంతమంది చెబుతారు. ఇక బాహుబలి సినిమా వల్లే తన బాడీ ఇలా అయిందని అందరూ చెబుతుంటారు… ఇక ఏది ఏమైనా కూడా తొందర్లోనే ప్రభాస్ కి ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని పోయి ముందుగా లాగా మారతారని అంటున్నారు. అయితే ఇదే సమస్య కొనసాగితే మాత్రం ప్రభాస్ సినిమాలకు ఖచ్చితంగా దూరం అవుతారని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ప్రభాస్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ప్రభాస్ నాలుగు సినిమాల తో బిజీగా ఉన్నాడు. ఈయన నటిస్తున్న రాజాసాబ్ మూవీ ఈ ఏడాది సమ్మర్ లో విడుదల కాబోతుంది. మారుతి దర్శకత్వం లో ఈ మూవీ రాబోతుంది. ఆ సినిమా తర్వాత సందీప్ వంగాతో స్పిరిట్ చేస్తున్నాడు. దీని తర్వాత కల్కి 2, సలార్ 2 మూవీల ను చేస్తున్నారు. ఆ తర్వాత సినిమాలకు కొద్ది రోజులు బ్రేక్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి..