BigTV English

Premikudu Re Release: ప్రభుదేవా బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ప్రేమికుడు.. మే1న రీ-రిలీజ్‌

Premikudu Re Release: ప్రభుదేవా బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ప్రేమికుడు.. మే1న  రీ-రిలీజ్‌

Prabhu Deva’s Premikudu Movie Re-Release on May1: రీ రిలీజ్ కు సిద్ధమవుతుంది ప్రేమికుడు మూవీ. 30 ఏళ్ల క్రితం విడుదలైన ప్రభుదేవ ప్రేమికుడు సినిమా ఓ సంచలనం. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కెటి కుంజుమాన్ నిర్మాతగా, ఏ.ఆర్. రెహమాన్ సంగీతం, ప్రభుదేవా డాన్స్, కథానాయిక నగ్మా అంద చందాలు కుర్రకారును థియేటర్లకి పరుగులు పెట్టించాయి.


మహా గాయకుడు స్వర్గీయ యస్.పి. బాలసుబ్రమణ్యం ఈ సినిమాలోప్రభుదేవ తండ్రిగా ప్రత్యేక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. వడివేలు, రఘువరన్, గిరీష్ కర్నాడ్ ప్రధాన పాత్రలు పోషించారు. తమిళంలో రూపొందిన ఈ చిత్రం తెలుగులో కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇందులోని పాటలకు ఇప్పటి యువతరం కూడా డాన్సులు వేస్తున్నారంటే ఈ ప్రేమికుడి కెపాసిటీ అర్దం చేసుకోవచ్చు.

Also Read: అప్పుడు వదిలేసుకున్నా.. ఇప్పుడు ఆ ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నా


ప్రస్తుతం రీ-రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో ప్రేమికుడు సినిమా మే 1న 300లకు పైగా థియేటర్ లలో ఘనంగా రీ-రిలీజ్ చేయనున్నట్లు నిర్మాతలు పేర్కొన్నారు. ప్రేమికుడు రీ-రిలీజ్ సంబంధించిన వేడుక ఏప్రిల్ 27న ఘనంగా జరిగింది.

రమణ, మురళీధర్‌ ఈ చిత్రానికి రీ రిలీజ్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ కె ప్రసన్న కుమార్, కోసాధికారి రామ్ సత్యనారాయణ, దర్శకులు ముప్పలనేని శివ, అథిదులుగా హాజరయి రీ రిలీజ్ కానున్న ప్రేమికుడు మూవీ మళ్లీ ఘన విజయం సాధించి నిర్మాతలకు లాభాలపంట పండించాలని అభిలాషించారు.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×