Pradeep Ranganathan : విధి వింత ఆట ఎలా ఉంటుందంటే, కనీసం ఊహించడం కూడా కష్టమే. కానీ కొన్నిసార్లు జరిగే వింత పరిణామాలు గమనిస్తే, అరెరె… కథ ఇలా అడ్డం తిరిగింది ఏంటి ? అని ఆశ్చర్యం వేస్తుంది. తాజాగా ధనుష్ (Dhanush), ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan ) ల పరిస్థితి కూడా ఇలాగే తయారయ్యింది. ధనుష్ ఎలాగూ స్టార్ హీరోనే. కానీ ఒకప్పుడు “నా సినిమా చూడన్నా” అని రిక్వెస్ట్ చేసిన ప్రదీప్ ఇప్పుడు ఏకంగా ఆయనకు పోటీగా సినిమాను రిలీజ్ చేసి, సూపర్ హిట్ కొట్టేశాడు.
అప్పుడేమో ధనుష్ కు రిక్వెస్ట్
సౌత్ లో తాజా సెన్సేషన్ గా మారిన హీరో ప్రదీప్ రంగనాథన్. దర్శకుడు కావాలని ఇండస్ట్రిలోకి అడుగు పెట్టిన ఆయన, అనుకోకుండా హీరోగా మారాడు. అంతేనా ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోగా ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాడు. ఆయన ఇప్పుడు 100 కోట్ల క్లబ్ లో చేరిన, అత్యంత భారీ డిమాండ్ ఉన్న నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలో 2017లో ప్రదీప్ చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో అవుతోంది.
అప్పట్లో ప్రదీప్ ఒక షార్ట్ ఫిల్మ్ తీసి, సోషల్ మీడియాను ఉపయోగించి పెద్ద సెలబ్రిటీల దృష్టిని ఆకర్షించాడు. దీంతో సదరు షార్ట్ ఫిల్మ్ కు మంచి క్రేజ్ దక్కింది. అలా ప్రదీప్ రంగనాథన్ అప్పట్లోనే ఓ ట్వీట్ లో ధనుష్ ను తన షార్ట్ ఫిల్మ్ చూడమని ట్యాగ్ చేశాడు. ” ధనుష్ సర్, నేను 2D ఎంటర్టైన్మెంట్స్, మూవీ బఫ్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ విన్నర్ ని. నా సినిమాను మీరు చూస్తే చాలా సంతోషిస్తాను” అని ఆ ట్వీట్ లో రాసుకొచ్చాడు ప్రదీప్.
కట్ చేస్తే… ఈ 8 సంవత్సరాల కాలంలో ప్రదీప్ బాక్సాఫీస్ వద్ద ధనుష్ దర్శకత్వం వహించిన సినిమాతో పోటీ పడ్డాడు. గత వీకెండ్ లో ‘ది రిటర్న్ ఆఫ్ డ్రాగన్’ సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించగా, అనుపమ పరమేశ్వరన్, కాయదు లోహార్ హీరోయిన్లుగా నటించారు.
మరోవైపు ‘నిలవుకు ఎన్ మెల్ ఎన్నడి కోబం’ మూవీ కూడా అదే టైమ్ లో తెరపైకి వచ్చింది. ‘డ్రాగన్’ మూవీ ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడింది. ‘నిలవుకు ఎన్ మెల్ ఎన్నడి కోబం’ మూవీకి ధనుష్ దర్శకత్వం వహించగా, ఈ సినిమాలో యంగ్ నటీనటులు నటించారు. రెండు సినిమాలు యూత్ ఫుల్ ఎంటర్టైనర్లుగా రూపొందాయి.
అయితే ఆశ్చర్యకరంగా ధనుష్ సినిమా కంటే ప్రదీప్ సినిమా పాజిటివ్ రివ్యూలతో ఇన్స్టంట్ హిట్ అయింది. చాలా చోట్ల ధనుష్ దర్శకత్వం వహించిన సినిమా కంటే ప్రదీప్ సినిమా బాగా ఆడుతోంది. అంటే ప్రదీప్ రంగనాథన్ క్రేజ్, డిమాండ్ ఏ రేంజ్ లో పెరిగేవ అర్థం చేసుకోవచ్చు. టాలెంట్ ఉంటే కటౌట్ తో పనేం ఉంటుంది మరి . ఇదిలా ఉండగా, ‘డ్రాగన్’ హిట్ తరువాత ప్రదీప్ కు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి.
@dhanushkraja Sir I'm 2D Entertainments,Movie Buff short film contest Winner.Ill be muchh happpy if u c my film https://t.co/hSgofUtUn9
— Pradeep Ranganathan (@pradeeponelife) April 6, 2017