BigTV English

Prahbhas: ప్రభాస్ ఎవరితో సినిమా చేసినా ఇబ్బంది పడేది మాత్రం అభిమానులే…

Prahbhas: ప్రభాస్ ఎవరితో సినిమా చేసినా ఇబ్బంది పడేది మాత్రం అభిమానులే…

Prabhas: ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్, ఫౌజీ సినిమాలు చేస్తున్నాడు. త్వరలో స్పిరిట్, కల్కి 2 సెట్స్ పైకి వెళ్లనున్నాయి. కానీ, ప్రభాస్ ఏ దర్శకుడితో పని చేసినా, ఏ ప్రొడక్షన్ హౌజ్ లో సినిమా చేసినా… ఇబ్బంది పడేది మాత్రం అభిమానులే. సినిమా ఎంతవరకు వచ్చిందో, ఎప్పుడు ఏ అప్డేట్ వస్తుందో తెలియక అభిమానులు నిరాశ చెందుతున్నారు. గతంలో సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాల సమయంలో కూడా ఇదే పరిస్థితి కనిపించింది.


మేకర్స్ మాత్రం “మీరు సైలెంట్‌గా ఉండండి, మేము మంచి సినిమా చేస్తాం” అనే మాటలతో ముందుకు సాగుతున్నారు. కానీ, కనీసం చిన్న అప్డేట్ ఇవ్వకపోవడం వల్ల ఫ్యాన్స్ అసహనంతో సోషల్ మీడియాలో ప్రొడక్షన్ హౌజ్‌లను ట్యాగ్ చేస్తూ నేషనల్ ట్రెండ్స్ చేస్తున్నారు. ఫ్యాన్స్ అండగా ఉండటమే కాకుండా, సినిమా ప్రమోషన్‌కి కూడా ఎంతగానో సహాయపడతారు. అలాంటప్పుడు, వాళ్లకు కనీసం కొన్ని వివరాలు ఇవ్వడం మేకర్స్ బాధ్యత కాదు అంటే ఎలా?

ప్రభాస్ గత సినిమాలను పరిశీలిస్తే కూడా ఇదే ప్యాట్రన్ కనిపిస్తుంది. సాహో షూటింగ్ ఆలస్యం గురించి సరైన క్లారిటీ రాలేదు. రాధేశ్యామ్ అనేకసార్లు రిలీజ్ డేట్ మారినా, ఎందుకు మారిందో పూర్తి స్పష్టత లేదు. ఆదిపురుష్ టీజర్ వచ్చిన తర్వాత విమర్శలు వచ్చినప్పటికీ, మేకర్స్ అభిమానుల్ని ట్రస్ట్‌లో పెట్టే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు అదే పరిస్థితి రాజాసాబ్, ఫౌజీ, స్పిరిట్, కల్కి 2 సినిమాల విషయంలో కొనసాగుతోంది. ప్రస్తుతం రాజాసాబ్, ఫౌజీ షూటింగ్ దశలో ఉంది. కానీ, ఫస్ట్ లుక్ లేదా ఓ చిన్న గ్లింప్స్ విడుదల చేసినా అభిమానులు సంతోషంగా ఫీలవుతారు. స్పిరిట్, కల్కి 2 సినిమాల విషయానికి వస్తే, ఇవి 2025-26కి విడుదల కావొచ్చు.


ఇప్పటి సినిమాల ప్రమోషన్ ఎక్కువగా సోషల్ మీడియా & డిజిటల్ ప్రమోషన్ మీద ఆధారపడి ఉంది. ప్రతి చిన్న అప్డేట్ కూడా పాన్-ఇండియా స్థాయిలో భారీ హైప్ తీసుకురావచ్చు. రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, యష్ వంటి స్టార్ హీరోల సినిమాలు ముందే ప్రోమోషన్‌కి ప్లాన్ చేస్తుంటే, ప్రభాస్ సినిమాల మేకర్స్ మాత్రం అభిమానులను ఇబ్బంది పెడుతున్నారు.

ఇకనైనా మేకర్స్ మారాలి. కనీసం ఒక్క షెడ్యూల్ కి ఒక్క అప్డేట్ అయినా ఇవ్వాలి. కనీసం షూటింగ్ BTS స్టిల్స్ విడుదల చేయాలి. అభిమానులకి జోష్ ఉండాలంటే ఆ మాత్రం చేయాలి, ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడూ సినిమాకి ప్రాణం పెడతారు, అలాంటి ఫ్యాన్స్ కి మేకర్స్ సరైన అప్డేట్ ఇస్తే… ఆ సపోర్ట్ రెట్టింపు అవుతుంది. ఒక్క ఫస్ట్ లుక్ విడుదల చేసినా, చిన్న అప్డేట్ ఇచ్చినా… అభిమానులు హ్యాపీ అవుతారు, సినిమాకి క్రేజ్ పెరుగుతుంది. మేకర్స్ మౌనంగా ఉంటే, అభిమానులు అసహనానికి గురవుతారు. ఇకనైనా, రాజాసాబ్, ఫౌజీ టీమ్స్ – ఏదైనా అప్డేట్ ఇవ్వాలి!

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×