Prapancha Yatrikudu : తెలుగు బిగ్ బాస్ 7 విజేత పల్లవి ప్రశాంత్ తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నాడు. ప్రముఖ యూట్యూబ్ వ్లాగర్, ప్రపంచయాత్రికుడు ఆయనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దీనికి కారణం – క్రికెట్ ప్రిడిక్షన్ యాప్ ప్రమోషన్. ఈ యాప్ పరోక్షంగా బెట్టింగ్‌కు సంబంధించినదని ఆరోపణలు వస్తున్నాయి. ప్రపంచయాత్రికుడు గతంలో బయ్యా సన్నీ యాదవ్, హర్ష సాయి, పరేషన్ బాయ్స్ వంటి ప్రముఖులను ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ విషయంలో టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ కూడా ఈ వరుసలో చేరాడు.
‘రైతు బిడ్డ’గా పేరు తెచ్చుకున్న పల్లవి ప్రశాంత్ ఈ యాప్ ప్రమోషన్ కోసం భారీ రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ప్రపంచయాత్రికుడు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీల ద్వారా, యుట్యూబ్ వీడియోల ద్వారా ఈ విషయాన్ని బయటపెట్టాడు. పల్లవి ప్రశాంత్ ఒక నమ్మక ద్రోహి, రైతు బిడ్డ అని చెప్పి ప్రజలని మోసం చేసి సింపతీతో బిగ్ బాస్ గెలిచి ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడు అంటూ నా అన్వేషణ పల్లవి ప్రశాంత్ పై భూతులతో రెచ్చిపోయాడు. నాగార్జున, శివాజీ లాంటి యాక్టర్స్ ని కూడా మోసం చేసేలా పల్లవి ప్రశాంత్ నటించాడు, ఇతను ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్ వలన నష్టపోయిన వాళ్లు పోలిస్ కేస్ పెట్టండి అంటూ నా అన్వేషణ చెప్పాడు. దీంతో ఈ వివాదం సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్‌గా మారింది. క్రికెట్ ప్రిడిక్షన్ యాప్స్ నేరుగా బెట్టింగ్‌ను ప్రోత్సహిస్తాయా? అనే చర్చ మొదలైంది. ప్రముఖులు ఇలాంటి యాప్స్‌ను ప్రచారం చేయడం నైతికంగా సరైనదేనా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
ఈ వ్యవహారంపై పల్లవి ప్రశాంత్ ఇంతవరకు స్పందించలేదు. ఆయన ఈ విమర్శలను పట్టించుకోకుండా ముందుకు సాగుతారా లేక స్పష్టత ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. సామాజిక మాధ్యమాల్లో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి వాదిస్తున్నారు. ఒక వర్గం ఆయనను సమర్థిస్తుండగా, మరో వర్గం ఇలాంటి ప్రమోషన్లు చేయడం తప్పని వాదిస్తోంది.
ఇలాంటి యాప్స్ ప్రమోషన్ల వల్ల ఇన్‌ఫ్లుయెన్సర్ల బాధ్యతపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. యువతను ప్రభావితం చేసే వ్యక్తులు తమ బ్రాండ్ ఎంపికలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రపంచయాత్రికుడు ఇప్పటికే హర్ష సాయి, బయ్యా సన్నీ యాదవ్, పరేషన్ బాయ్స్ లాంటి ఇన్‌ఫ్లుయెన్సర్లను ఎక్స్‌పోజ్ చేసి సంచలనం సృష్టించాడు. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ వంతు వచ్చినట్లే కనిపిస్తోంది, మరి తర్వాత ఎవరు లైన్‌లో ఉంటారో? ఈ జాబితాలో నెక్స్ట్ టార్గెట్‌గా ఎవరైనా పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్ ఉంటారని అనిపిస్తోంది! ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.