E-Paper
Advertisement

Food Travel: విదేశీయాత్రలో విధిగా రుచి చూడాల్సిన వంటకాలు

Food Travel:  విదేశీయాత్రలో విధిగా రుచి చూడాల్సిన వంటకాలు

 

Food Travel
 

Must-Taste Dishes While Traveling Countrys: రుచికరమైన, వైవిధ్య భరితమైన ఆహారం రుచి చూడాలని అందరూ కోరుకుంటారు. అయితే.. కొత్త దేశంలో, సరికొత్త వాతావరణంలో ఎన్నడూ రుచిచూడని, ఊహకు అందని రుచులను ఆస్వాదించటంలో కలిగే మజాయే వేరు. అందుకే ప్రపంచవ్యాప్తంగా పేరున్న కొన్ని వంటకాలు, అవి లభించే ప్రదేశాల వివరాలను మీకు అందిస్తున్నాం. మీరూ వీటి గురించి తెలుసుకోండి. వీలుంటే వీసా తీసుకుని వెళ్లి రుచి చూసిరండి.

నేపుల్స్‌, ఇట‌లీ

పిజ్జా పుట్టినిల్లు.. నేపుల్స్‌లోని పిజ్జేరియా డ మిషెల్ రెస్టారెంట్. తొలి పిజ్జా ఇక్కడే తయారైంది. స్థానికంగా దొరికే పిండి, టొమాటో, మోజ‌రెల్లా చీజ్, ఆలివ్ ఆయిల్‌, బాసిల్ క‌లిపి చేసే ఈ పిజ్జాని.. రాతి ఒవెన్‌లో 450 డిగ్రీల వ‌ద్ద 90 సెక‌న్ల పాటు ఉడికిస్తారు. దీని రుచిని ఆస్వాదించటానికి నేటికీ ప్రపంచం నలుమూలల నుంచి వందల పర్యాటకులు వస్తుంటారు.

మ‌ర్రాకెచ్‌, మొరాకో
జీవితంలో ఎన్నడూ రుచిచూడని వెరైటీ వంటకాన్ని రుచి చూడాలనుకునే వారికి ఇక్కడ లభించే ‘టాజైన్’ మంచి ఆప్షన్. దీనిని రుచి చూసేందుకే పర్యాటకులు ఇక్కడికొస్తారంటే ఆశ్చర్యపడక తప్పదు. కూర‌గాయ‌లు, మాంసం క‌లిపి మట్టిపాత్రల్లో సన్నని సెగమీద ఉడికించి చేసే ఈ వంటకం ప్రపంచపు అత్యుత్తమ వంటకాల్లో ఒకటిగా గుర్తింపుపొందింది. దీన్ని రుచి చూసిన వారు జీవితంలో ఆ కమ్మని రుచిని మరిచిపోలేరని చెబుతారు.

టోక్యో, జ‌పాన్
జ‌పాన్ టెక్నాలజీకే గాక నోరూరించే వంటకాలకూ ప్రసిద్ధే. ముఖ్యంగా.. టోక్యో సమీపంలోని సుజుకి చేప‌ల మార్కెట్‌‌లో లభించే చేపల వంటకాలైన టెంపూరా, సాషిమీ, సూషీ, సోబా, సుకియాకీ, మీసో సూప్‌ల‌తో పాటు మంచినీటిలో పెరిగే ఈల్‌ చేపతో చేసే ‘ఉన‌గి’ అనే వంట‌కం ఇక్కడ బాగా ఫేమస్.

బ‌ఫెల్లో, న్యూయార్క్
ఇక్కడి యాంక‌ర్ బార్‌లో తయారైన చికెన్ వింగ్స్.. బఫెలో వింగ్స్‌గా ప్రాచుర్యం పొందాయి. సెల‌రీ, క్యార‌ట్, బ్లూ చీజ్ డిప్‌తో సర్వ్ చేసే ఈ వంటకం రుచి చూసేందుకు నేటికీ జనం అక్కడికి వస్తుంటారు. 1977లో స్థానిక ప్రభుత్వం జులై 29ని చికెన్ వింగ్స్ డే అని ప్రకటించటంతో దీనికి మరింత గుర్తింపు వచ్చింది.

ఎన్సెనాడా, మెక్సికో
ఫిష్ టాకోస్‌ ప్రియులకు దాని పుట్టిల్లు ఇక్కడి ‘సాన్ ఫెలిపే’లోని ‘రూబియోస్’ అనే బుల్లి దుకాణమని తెలియకపోవచ్చు. తర్వాతి రోజుల్లో ఇది ప్రపంచమంతా పాకినా.. స్థానికంగా లభించే టాకోస్ రుచే వేరు అని టూరిస్టులు చెబుతుంటారు. ఇక్కడి రొయ్యల కాక్‌టెయిల్‌, ఫిష్ ఫిల్లెట్స్‌లకూ మంచి డిమాండ్ ఉన్నా.. ఫిష్ టాకోస్‌దే తొలిస్థానం.

ప్యారిస్‌, ఫ్రాన్స్
విప్లవాలకు పుట్టినిల్లైన ఫ్రాన్స్.. ఆహార ప్రియులకూ మంచి అనుభూతినిస్తుంది. ఇక్కడి నోరూరించే వైన్‌తో బాటు అద్భుత‌మైన బ్రెడ్‌, ఛీజ్ వంట‌కాలను రుచి చూసేందుకు సెల‌బ్రిటీలు సైతం క్యూ కడతారు. బిఫోర్ స‌న్‌సెట్‌, జూలీ అండ్ జూలియా, మిడ్‌నైట్ ఇన్ ప్యారిస్ వంటి సినిమాల్లో ఇక్కడి ఫుడ్ వెరైటీలు మీరూ చూడొచ్చు.

కోపెన్‌హాగెన్‌, డెన్మార్క్
ప్రపంచంలోనే అత్యంత ఆనంద‌మ‌య‌మైన న‌గ‌రమైన కోపెన్‌హాగన్‌లో దొరికే స్మోరెబ్రోడ్ శాండ్‌విచ్‌ అంటే భోజన ప్రియుల నోట్లో నీళ్లూరాల్సిందే. మంచి సాల్మన్ చేపను గుడ్లు, ముల్లంగి ముక్కలతో కలిపి ఉడికించి, రై బ్రెడ్‌తో త‌యారుచేసే ఈ శాండ్‌విచ్ రుచి చూసేందుకైనా ఈ నగరం వెళ్లాల్సిందేనట.

Related News

Big Shock To Trump: ట్రంప్‌కు ఊహించని ఝలక్.. షాకిచ్చిన వార్ పవర్స్, ఆపరేషన్ ‘ఎపిక్ ఫ్యూరీ’ క్లోజ్

Kuwait Airport: ఇరాన్ మిస్సైళ్ల దాడులు.. కువైట్‌ ఎయిర్‌పోర్ట్ డ్యామేజ్, విమాన సర్వీసులు రద్దు

మరో బాంబ్‌ పేల్చిన అమెరికా.. భారత్‌పై అదనపు సుంకాలకు ప్రతిపాదన, ఏకంగా 12 శాతం

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు.. అమెరికా స్థావరాలపై ఇరాన్ వరుస దాడులు, ఖేష్మ్ ద్వీపంపై

ఇరాన్ షాకింగ్ నిర్ణయం.. ఇకపై మాటలు-చర్చల్లేవ్, హోర్మూజ్ జలసంధి మాటేంటి?

ఇరాన్‌లో ఇంటిపోరు మొదలైందా? అధ్యక్షుడు మసూద్‌ నిర్ణయం వెనుక, అసలేం జరుగుతోంది?

రూటు మార్చిన అమెరికా.. ఇరాన్‌పై మెరుపు దాడులు, రాడార్- డ్రోన్ వ్యవస్థలు డ్యామేజ్

హోర్ముజ్ జలసంధిలో హై టెన్షన్.. ఇరాన్ సైనిక క్యాంప్‌పై అమెరికా దాడి, కవ్వింపు చర్యలు డీల్ కోసమా?

Big Stories

×