సినిమా : దేవకీ నందన వాసుదేవ
డైరెక్టర్ : అర్జున్ జంధ్యాల
కథ : ప్రశాంత్ వర్మ
నటీనటులు : అశోక్ గల్లా, దేవదుత్తా నాగే,మానస వారణాసితో పాటు తదితరులు
ప్రొడ్యూసర్ : సోమినేని బాలకృష్ణ
మ్యూజిక్ : భీమ్స్ సిసిరోలియో
విడుదల తేదీ : 22 నవంబర్ 2024
Devaki Nandana Vasudeva Rating – /5
Devaki Nandana Vasudeva Movie Review : మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ ‘హీరో’ సినిమాతో డెబ్యూ ఇచ్చాడు. మొదటి సినిమా అనుకున్న ఫలితం ఇవ్వలేదు. కాబట్టి కొంత గ్యాప్ తీసుకుని ‘దేవకీ నందన వాసుదేవ’ చేశాడు. ఇది అతనికి హిట్ ఇచ్చిందో? లేదో? ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి :
కథ:
కంస రాజు (దేవదత్తా నాగే) కనీసం దయ, కనికరం లేని ఘోరమైన వ్యక్తి. అతన్ని ఎదురించి ఎవ్వరూ నిలబడలేరు. అలా ఎదురుతిరిగితే బ్రతకడం కష్టం. అయితే ఇతను ఒకసారి కాశీ వెళ్లగా అక్కడ ఒక అఘోర.. ఇతనికి షాకింగ్ న్యూస్ చెబుతాడు. అదేంటంటే కంస రాజు చెల్లెలి మూడో సంతానం వల్ల అతనికి ప్రాణగండం ఉంటుందట. దీంతో కంసరాజు క్రూరంగా మారి తన చెల్లెలి భర్తని చంపేస్తాడు. అయితే అప్పటికే ఆమె ప్రెగ్నెంట్ అయ్యి ఉంటుంది. మరోపక్క అతను ఓ కేసు విషయంలో అరెస్ట్ అవుతాడు. ఆ రోజే కంస రాజు చెల్లెలు (దేవయాని)కి అమ్మాయి సత్య (మానస వారణాసి) పుడుతుంది. ఆ తర్వాత ఆమె ఓ పెళ్ళిలో కృష్ణ (అశోక్ గల్లా) దృష్టిని ఆకర్షిస్తుంది. తొలిచూపులోనే అతను ప్రేమలో పడతాడు. ఆ తర్వాత జైలు నుండి విడుదలైన కంస రాజుపై కొందరు అటాక్ చేస్తారు. ఆ ఎటాక్ నుండి కృష్ణ .. కంసరాజుని కాపాడతాడు.దీంతో కృష్ణని దగ్గరకి తీసుకుంటాడు కంస రాజు. ఆ తర్వాత సత్య, కృష్ణ..ల ప్రేమ వ్యవహారం ఇతనికి తెలిసిందా? తెలిశాక ఏమైంది? అసలు సత్య.. ఒక్కరేనా? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఈ ప్రశ్నలకి సమాధానం తెలియాలంటే ‘దేవకీ నందన వాసుదేవ’ చూడాలి.
విశ్లేషణ :
ప్రశాంత్ వర్మ ఈ సినిమాకి కథ అందించడం అనేది అందరిలో క్యూరియాసిటీ పెంచే అంశం. అతని బ్రాండ్ వల్లే ఈ సినిమాకి మినిమమ్ బిజినెస్ జరిగింది. కానీ ఈ సినిమా కథని బట్టి ‘ప్రశాంత్ వర్మ పెద్ద టాలెంటెడ్ కాదేమోలే’ అనే ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఈ సినిమా టీజర్, ట్రైలర్స్ లో మైథలాజికల్ టచ్ ఉన్నట్టు చూపించాడు. కానీ సినిమాలో అది ఏమాత్రం సింక్ అవ్వలేదు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలా మొదలై.. హీరోయిన్ విషయంలో ఓ ట్విస్ట్ ఇచ్చి చివరికి మైథాలజీని అనవసరంగా ఇరికించి ఏదేదో చేసేయాలని అనుకున్నాడు ప్రశాంత్ వర్మ. ఇక దర్శకుడు అర్జున్ జంధ్యాల ఈ కథని మనస్ఫూర్తిగా డైరెక్ట్ చేసినట్టు అనిపించదు. అతని ఫస్ట్ సినిమా ‘గుణ 369 ‘ ప్లాప్ అయినా.. దాన్ని టీవీల్లో బాగానే చూశారు. మంచి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా అనే పేరు కూడా తెచ్చుకుంది. కానీ ఈ ‘దేవకీ నందన వాసుదేవ’ విషయంలో అతని మార్క్ పూర్తిగా మిస్ అయ్యింది.బహుశా ఇందులో కెలుకుడు ఎక్కువై ఉండొచ్చు. ఓ పక్క ప్రశాంత్ వర్మ, ఇంకో పక్క బుర్రా సాయి మాధవ్ వంటి వాళ్ళు అటు లాగి, ఇటు లాగి ఏదేదో చేసేసి ఉండొచ్చు. ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడా ఒకటి, సీన్లు బాగానే అనిపిస్తాయి. కానీ సెకండాఫ్ లో చాలా ల్యాగ్ ఉంటుంది. రిలీజ్ కి ముందు ఈ సినిమాని ఏకంగా ‘మురారి’ తో పోల్చేసి ప్రమోట్ చేసుకున్నారు. ఆ సినిమాకి వన్ పర్శంట్ కూడా ఇది మ్యాచ్ అవ్వదు. సినిమాకి ఉన్న భీమ్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ప్రొడక్షన్ వాల్యూస్ కొంతలో కొంత నయం.
నటీనటుల విషయానికి వస్తే.. గల్లా అశోక్ నటన పరంగా ఇంప్రూవ్ అయ్యింది ఏమీ లేదు. మానస వారణాసికి ఛాలెంజింగ్ రోల్ దొరికింది. కానీ ఈ పాత్రలో ఆమె సెట్ అవ్వలేదు. ‘ఆదిపురుష్’ ఫేమ్ దేవదత్త మాత్రం అదరగొట్టాడు. అతని స్క్రీన్ ప్రెజన్స్ కూడా చాలా పవర్ఫుల్ గా ఉంది. ఝాన్సీ వంటి నటీనటులు తమ పాత్రలకి న్యాయం చేశారు.
ప్లస్ పాయింట్స్ :
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
ప్రొడక్షన్ వాల్యూస్
మైనస్ పాయింట్స్ :
మిగిలినవన్నీ
మొత్తంగా ‘దేవకీ నందన వాసుదేవ’ పరమ బోరింగ్ మైథలాజికల్ డ్రామా. ఎంత ఓపిక ఉన్నా దీనిని థియేటర్లో భరించడం కష్టం.
Devaki Nandana Vasudeva Rating – 1.5/5