Prashant Varma : ఈ ఏడాది సంక్రాంతికి ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి ఇండస్ట్రీ మొత్తాన్ని ఔరా అనిపించిన బ్లాక్ బాస్టర్ మూవీ హనుమాన్.. ఈ మూవీ గురించి చెప్పాలంటే ముందుగా డైరెక్టర్ గురించి చెప్పాలి.. ఈ మూవీని ఛాలెంజింగ్ గా తీసుకొని బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. ఒక చిన్న సినిమా పాన్ ఇండియా లెవెల్ లో సెన్సేషన్ సృష్టించి 300 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబడుతుందా అని ట్రేడ్ పండితులు సైతం నోరెళ్లబెట్టారు. సంక్రాంతి రేసులో స్టార్ హీరోల సినిమాలను బీట్ చేసి అరుదైన రికార్డు ను సొంతం చేసుకుంది. మిగిలిన సినిమాలను ఆడియన్స్ మర్చిపోయే రేంజ్ లో ఈ చిత్రం సునామీ ని సృష్టించి 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని రాబట్టింది. ఈ చిత్రం తో తేజ సజ్జ పాన్ ఇండియన్ హీరో గా మారిపోయాడు.. ఈ సినిమా అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించారు. తాజాగా ఈ మూవీ డైరెక్టర్, హీరోయిన్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది..
ఈ హీరోయిన్ గురించి అందరికి తెలుసు. తమిళ్ళో పలు చిత్రాల్లో నటించింది. కానీ ఆమెకు అంతగా గుర్తింపు తీసుకురాలేదు. ఇక తెలుగులో గతంలో యాంకర్ ప్రదీప్ మాచిరాజుతో 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే మూవీలో నటించింది. కానీ ఆ మూవీ అంతగా గుర్తింపును తీసుకురాలేదు. ఇక ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన హనుమాన్ మూవీతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ మూవీ భారీ విజయాన్ని అందుకోవడంతో పాపకు మంచి క్రేజ్ ను అందుకుంది.. పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు లభించింది. ఈమె ఆ స్థాయిలో గుర్తింపు పొందడానికి కారణం కచ్చితంగా హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మనే. అలాంటి ప్రశాంత్ వర్మ గురించి ఈమె లేటెస్ట్ గా తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో చేసిన కొన్ని కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది..
అసలు వీరిద్దరి మధ్య ఏం జరిగింది అంటే.. అమృత అయ్యర్ తన ఇంస్టాగ్రామ్ స్టోరీ లో షేర్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇది చూసిన తర్వాత కచ్చితంగా ఈమెకు, ప్రశాంత్ వర్మ కి మధ్య ఎదో గొడవ జరిగింది. అందుకే ఆమె ఇలా చేసింది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రీసెంట్ గా ఆమె హీరోయిన్ గా నటించిన ‘బచ్చలమల్లి’ ప్రోమోషన్స్ లో కూడా హనుమాన్ గురించి మాట్లాడేందుకు ఇష్టపడలేదు. అప్పట్లో ఈమె ‘హనుమాన్’ మూవీ ప్రోమోషన్స్ లో కూడా పెద్దగా పాల్గొనలేదు. దీని గురించి ఇంటర్వ్యూ లో అడిగితె నేను హనుమాన్ మూవీ ప్రమోషన్స్ టైం లో వేరే మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నానని చెప్పింది. ఇక ఈ మూవీ మిక్స్డ్ టాక్ ను అందుకుంది. ఇక ఈ హనుమాన్ మూవీకి సీక్వెల్ గా జై హనుమాన్ మూవీ రాబోతుంది. మరి ఆ మూవీలో ఈ హీరోయిన్ ఉంటుందా? లేదా మార్చేశారా? అన్నది ఆసక్తిగా మారింది.