BigTV English

Prashanth Neel: ‘సలార్’ విషయంలో డిస్పాయింట్ అయ్యాను, ఈసారి నో డౌట్.. సీక్వెల్‌పై నీల్ కామెంట్స్

Prashanth Neel: ‘సలార్’ విషయంలో డిస్పాయింట్ అయ్యాను, ఈసారి నో డౌట్.. సీక్వెల్‌పై నీల్ కామెంట్స్

Prashanth Neel: చాలావరకు ఫ్యాన్స్ అంతా తమ అభిమాన హీరోలు కమర్షియల్ సినిమాల్లో నటిస్తే అవి చూసి ఎంజాయ్ చేయాలని ఆశపడతారు. అలాగే ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఆశపడ్డారు. కానీ ‘బాహుబలి’ తర్వాత పాన్ ఇండియా స్టార్ అని ట్యాగ్ సంపాదించుకున్న ప్రభాస్.. ఎక్కువగా ప్రయోగాల వైపు అడుగులు వేశాడు. అదే సమయంలో ప్రభాస్ (Prabhas).. ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడనే విషయం బయటపడింది. దీంతో ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో వచ్చిన ‘కేజీఎఫ్’ను చూసిన ప్రేక్షకులు.. ప్రభాస్‌తో కూడా అలాంటి మూవీ చేస్తే బాగుంటుందని ఆశపడ్డారు. అలా ‘సలార్’ అందరి ముందుకు వచ్చింది. తాజాగా ఈ మూవీ సీక్వెల్‌పై ప్రశాంత్ నీల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


సీక్వెల్‌పై క్లారిటీ

సరిగ్గా ఏడాది క్రితం ‘సలార్’ (Salaar) మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రభాస్ ఇతర సినిమాలలాగానే ‘సలార్’ కూడా పలుమార్లు విడుదల తేదీని వాయిదా వేసుకొని ఫైనల్‌గా 2023 డిసెంబర్ 22న థియేటర్లలో సందడి చేసింది. ప్రభాస్ నుండి ఇలాంటి ఒక మాస్ కమర్షియల్ సినిమాను ఆశిస్తున్న ప్రేక్షకులకు ‘సలార్’ విపరీతంగా నచ్చింది. ఇందులో ప్రభాస్ ఎక్కువగా మాట్లాడడు.. ఓన్లీ యాక్షన్‌తోనే అందరినీ ఆకట్టుకున్నాడు. రెబెల్ స్టార్‌ను మళ్లీ ఫామ్‌లోకి తీసుకొచ్చిన ఈ సినిమా విడుదలయ్యి ఏడాది కావడంతో ఫ్యాన్స్ అంతా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇదే సమయంలో దీని సీక్వెల్ గురించి క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు ప్రశాంత్ నీల్.


Also Read: టాలీవుడ్ ఇండస్ట్రీలో వివాదాలు లేని స్టార్ హీరోలు వీరే..

డిసప్పాయింట్ అయ్యాను

ఎన్నో సమాధానం లేని ప్రశ్నలతో ‘సలార్’ను ముగించాడు ప్రశాంత్ నీల్. వాటికి సమాధానాలు కావాలంటే సీక్వెల్ కోసం ఎదురుచూడాల్సిందే అన్నాడు. దీంతో ‘సలార్ 2’ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో ప్రశాంత్ నీల్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా అందులో సీక్వెల్ గురించి కామెంట్స్ చేశాడు. ‘సలార్’ విషయంలో తాను డిసప్పాయింట్ అయ్యానని, ఆ సినిమాను ఇంకా బాగా చేసి ఉండవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశాడు ప్రశాంత్ నీల్. అందుకే సీక్వెల్ విషయంలో ఎలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటానని మాటిచ్చాడు. ‘సలార్ 2’ (Salaar 2) విషయంలో కాంప్రమైజ్ అయ్యేది లేదన్నాడు.

అంతకు మించి

‘‘సలార్ విషయంలో నేను చాలా కష్టపడ్డాను కానీ కేజీఎఫ్ 2 ఇచ్చినంత తృప్తి సలార్ ఇవ్వలేకపోయింది. అందుకే నేను సలార్ రిలీజ్ అయినప్పుడే డిపైడ్ అయ్యాను సలార్ 2ను నా బెస్ట్ మూవీస్‌లో ఒకటిగా చేయాలి అని. సలార్ 2కు నా రైటింగ్ నా బెస్ట్ వర్క్ అని నేను అనుకుంటున్నాను. ప్రస్తుతం ఆడియన్స్ ఎంత ఊహించుకుంటున్నారో, నేను ఎంత చేయాలని అనుకుంటున్నానో అంతకు మించి సలార్ 2 ఉంటుంది. కొన్ని విషయాలు మాత్రమే నేను ఇంత కాన్ఫిడెంట్‌గా ఉండేలా చేస్తాయి. సలార్ 2 అనేది ఏ మాత్రం డౌట్ లేకుండా నా బెస్ట్ వర్క్’’ అంటూ ‘సలార్ 2’పై విపరీతమైన నమ్మకాన్ని వ్యక్తం చేశారు ప్రశాంత్ నీల్. దీంతో ఫ్యాన్స్‌లో అంచనాలు కూడా పెరిగిపోయాయి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×